For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్నారులతో సురక్షితమైన దీపావళి పండుగను జరుపుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి..

|

దీపావళి అంటే టపాసులు పండుగ చాలా మంది చిన్నారులు అనుకుంటారు. అసలు పటాకులు పేలకుండా దీపావళి జరగదని వారు గట్టిగా నమ్ముతారు. దీపాల వెలుగులో బాణసంచా కాల్చడం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు. ఈ పండుగ సమయంలో పెద్దలంతా ముచ్చట్లు, మిఠాయిలు, పిండి వంటలు, అలంకరణలు మరియు షాపింగులలో బిజీగా ఉంటారు. కానీ చిన్నపిల్లలు మాత్రం ఈ దీపావళి పండుగకు ఎలాంటి క్రాకర్స్ కాల్చాలి. ఎన్ని టపాసులు పేల్చాలి అనే వాటిని ఎక్కువగా చర్చించుకుంటారు.

Tips to Celebrate a Safe and Happy Diwali with Kids

వీరందరి కోసం ఈ ఏడాది అక్టోబర్ 27వ తేదీన దీపావళి పండుగ ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా బంధువులు మరియు స్నేహితులతో మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ పిల్లవాడు తన స్నేహితులతో టపాసులు కాల్చేటప్పుడు ఎల్లప్పుడూ చాలా అప్రమత్తంగా ఉండండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. మీరు మీ చిన్నారులతో కలిసి సంతోషంగా దీపావళి జరుపుకునేందుకు, సురక్షితంగా ఉండటానికి మీరు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవి ఏంటో చూడండి..

 1) రద్దీ ప్రాంతాలను నివారించండి..

1) రద్దీ ప్రాంతాలను నివారించండి..

దీపావళి పండుగ సమయంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో టపాసులు పేల్చడాన్ని నివారిచండి. మీ పిల్లలకు బహిరంగ ప్రదేశంలో అంటే జన సంచారం ఉండే చోట క్రాకర్లు కాల్చామని చెప్పండి. అలాగే ఆసుపత్రులు మరియు సున్నితమైన ప్రాంతాల వద్ద ఎట్టి పరిస్థితుల్లో వీటిని పేల్చవద్దని సూచనలు చేయండి. లేదంటే తర్వాత వారికి, మీకు ఇద్దరికి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే మార్కెట్లు, భవన ప్రవేశ ద్వారాలు, మెట్ల దగ్గర కూడా బాణసంచా కాల్చొద్దని చెప్పండి.

2) సింథటిక్ దుస్తులకు దూరంగా..

2) సింథటిక్ దుస్తులకు దూరంగా..

మీరు మీ చిన్నారులు ఇంకా ఎవరైనా క్రాకర్స్ కాల్చేవారు ఎవరైనా వదులుగా ఉండే లేదా సింథటిక్ వస్త్రాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. కాటన్ వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే సింథటిక్ వస్త్రాలకు మంటలు త్వరగా వ్యాపిస్తాయి. మీరు సింథటిక్ వస్త్రాలతో క్రాకర్స్ ను కాల్చుతున్న సమయంలో అనుకోకుండా మీ బట్టలపై పడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ సమయంలో సింథటిక్ దుస్తులకు దూరంగా ఉండండి.. మీ చిన్నారులను దూరంగా పెట్టండి..

3) సరైన దూరం..

3) సరైన దూరం..

మీరు గానీ, మీ చిన్నారులు గాని క్రాకర్లు కాల్చేటప్పుడు సరైన దూరాన్ని కొనసాగించాలి. మీ పిల్లలకు కూడా మీరు ఇదే చెప్పాలి. చాలా మంది యువకులు దీపావళి పండుగ సమయంలో తమ ధైర్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. కొందరు తమ చేతిలోనే టపాసులను పేల్చడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇవి విషాధంగా మారినప్పుడే విచారకరంగా ఉంటుంది. అందుకే మీ చిన్నారులు దీపావళి సమయంలో బాణసంచాతో ఉన్నప్పుడు మీరు ఓ కంట గమనించండి.

4) పాదరక్షలు తప్పనిసరి..

4) పాదరక్షలు తప్పనిసరి..

దీపావళి పండుగ సమయంలో బాణసంచా పేల్చే సమయంలో మీ చిన్నారులకు పాదరక్షలు వేసుకోమని చెప్పండి. ఎందుకంటే ప్రమాదవశాత్తు ఏదైనా స్పార్క్ (అగ్నికణం)లు కింద పడి పాదాలకు తగిలే అవకాశముంటుంది. మామూలుగా అయితే చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు. అక్కడికి.. ఇక్కడికి తెగ తిరుగుతుంటారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని వారికి గట్టిగా చెప్పాలి.

5) రాకెట్ల పట్ల అప్రమత్తం..

5) రాకెట్ల పట్ల అప్రమత్తం..

ప్రమాదకరమైన రాకెట్ల నుండి మీ పిల్లలను దూరంగా ఉంచండి. దీపావళి సమయంలో రాకెట్ల వల్ల వివిధ పరిమాణాలు మరియు ప్రభావాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. చిన్నారులు ఆకాశంలో మన కంటికి కనిపించే ప్రభావాలతో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తారు. మీ రాకెట్ ఎంత ఖరీదైనది అయినా వారు రాంగ్ ప్లేసులో ఉండి వాటిని కాలిస్తే ఎవరైనా గాయపడొచ్చు. అలాగే ఏవైనా జంతువులకు కూడా ఈ రాకెట్ల వల్ల గాయాలు అవుతుంటాయి. అందుకే మీ పిల్లలు రాకెట్ వెలిగించే సమయంలో అతడు టెర్రస్ మీద లేదా పెద్ద మైదానంలో లేదా ఆటస్థలంలో లేదా బహిరంగా ప్రదేశంలో చేసేలా చూడండి.

6) ఫస్ట్ ఎయిడ్ టూల్ కిట్..

6) ఫస్ట్ ఎయిడ్ టూల్ కిట్..

మీ పిల్లలు బాణసంచా కాల్చే సమయంలో ప్రథమ చికిత్స వస్తు సామగ్రిని మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవడం మంచిది. ఇసుకతో నిండిన సంచి, కొన్ని పట్టీలు, నీటితో నిండిన బకెట్, ఐస్ మరియు క్రిమినాశక క్రీములను సిద్ధంగా ఉంచుకోవాలి. కాలిన గాయాల విషయంలో, కాలిన ప్రదేశాలలో వాటిని అప్లై చేయండి. ఒకవేళ మీ చిన్నారికి తీవ్ర గాయాలైతే త్వరగా మీ సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లండి.

7) సురక్షితమైన దీపావళి..

7) సురక్షితమైన దీపావళి..

రాముడు తన 14 సంవత్సరాల వనవాసం నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత దీపావళి జరుపుకుంటున్నట్లు చరిత్రలో ఉన్నట్లు

పురాణాల ద్వారా తెలిసింది. అప్పటి నుండే ఈ దీపావళి పండుగను ప్రతి ఇంట్లోనూ జరుపుకుంటున్నారు. ఇది తమ కుటుంబాలకు శ్రేయస్సు ఇస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇక పైన చెప్పిన సమాచారం మేరకు మీ చిన్నారులతో కలిసి ఈ దీపావళి పండుగను ఘనంగా జరుపుకోండి.

ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు..

English summary

Tips to Celebrate a Safe and Happy Diwali with Kids

No matter how busy you are with your relatives and friends, always keep a watch on your child while he is bursting crackers with his friends. Being careful not only helps avoid serious injuries and accidents during the festival, but it also keeps everyone safe and maintains the zest of the festivity.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more