For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్తన సౌందర్యం కాపాడుకోవడమెలా?

By B N Sharma
|

Breast Care - Before & After Breastfeed
మహిళ బిడ్డకు పాలు ఇచ్చే ముందూ, బిడ్డకు తల్లిపాలతో అవసరం ముగిసిన తర్వాత కూడా తన స్తన సౌందర్యం కాపాడుకోవాల్సిన అవసరంవుంది. బిడ్డలకు ప్రత్యామ్నాయ పోషకాహారం ఇచ్చినప్పటకి తల్లిపాలనివ్వటం తల్లికి, బిడ్డకు క్షేమం కనుక ఇవ్వాల్సి వుంటుంది. కాని కొంతమంది తల్లులు తమ స్తన సౌందర్యం చెడిపోతుందని బిడ్డకు పాలు పట్టటం ఆపేస్తారు. ఇది సరి కాదు. కొద్దిపాటి జాగ్రత్తలతో బిడ్డకు పాలు ఇచ్చినప్పటికి స్తన సౌందర్యం కాపాడుకోవచ్చు.

బిడ్డ పాలను నిలిపిన తర్వాత తల్లి తన స్తనాలకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు-
1. బిడ్డకు పాలుపట్టే తల్లులు బిగువైన లేదా లూజైన బ్రాసరీలు వేయరాదు. ఎందుకంటే బేబీకి పాలు పట్టటం కష్టమే కాక చర్మం రాపిడికి గురవుతుంది. రేషెస్ వస్తాయి. ముందు తెరుచుకుని ఎలాస్టిక్ కల మెత్తటి కాటన్ బ్రాసరీలు సూచించదగినది.
2. బేబీకి పాలు పట్టిన తర్వాత స్తనాలనను ఇన్ఫెక్షన్ కు గురికాకుండా బాగా తుడవండి. కొబ్బరి నూనె తో స్తనాలు మాసేజ్ చేస్తే వేలాడకుండా వుంటాయి. బేబీ నోటి వుమ్ము, లేదా పాల చుక్కలు కొద్దిపాటిగా వేసి తుడిస్తే క్రిమిరహితంగా వుండి ఇన్ ఫెక్షన్ రాకుండా వుంటుంది.
3. చనుమొనలపై నెయ్యి రాస్తే మంటగా వుండదు. పగిలిన చనుమొనలకు కూడా ఇదే మందు.
4. ఒక్కొక్కపుడు బేబీ స్తనాలపై వున్న వెంట్రుకలు లాగుతుంది. కనుక క్రీము లేదా కత్తెర ఉపయోగించి వాటిని తీసేయండి.
5. ఆరు నెలల తర్వాత కూడా తల్లిపాలు బిడ్డకు పడుతుంటే, బిడ్డకు పళ్ళు వచ్చి, సున్నితమైన స్తన ప్రదేశాలను కొరికే అవకాశముంది. అందుకని బేబీకి సరైన చోటు చూపించాలంటే పాలు పట్టే చోట తేనె రాయండి. ఎక్కడపడితే అక్కడ బేబీ కొరకకుండా వుంటుంది.
6. పాలు పట్టిన తర్వాత ముఖానికి వేసే మాస్క్ లేదా పండ్లతో మాస్క్ స్తనాలకు వేస్తే అవి ఎండిన తర్వాత తీసేస్తూ వుంటే స్తనాలు మంచి షేపులో వుంటాయి. మెత్తటి ఎలాస్టిక్ కల కాటన్ టీ షర్టులు ధరిస్తే శరీరం చక్కటి ఆకారంలో వుండగలదు.

English summary

Breast Care - Before & After Breastfeed | స్తన సౌందర్యం కాపాడుకోవడమెలా?

One of the unknown breast care tip after breastfeed is using face masks. Fruit masks that can peeled off after drying and can be applied all over the breast (except nipples) to keep them in shape. Preferring soft elastic clothes such as cotton tee-shirts, lycra will keep the body shape intact.
Story first published:Thursday, September 29, 2011, 8:27 [IST]
Desktop Bottom Promotion