For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులా ? అయినా సరే...తల్లి పాలే.... !

By B N Sharma
|

Breastfeeding For Working Mothers
తల్లిపాలు పట్టడమనేది బిడ్డతో చక్కటి అనుబంధం ఏర్పరచుకోడమే. తల్లిపాలు పట్టడం తల్లికి ఎంతో మంచిది. అయితే, రోజంతా ఇంటివద్దే వుండి పిల్లలకు పాలు పట్టడం మహిళా ఉద్యోగులకు సాధ్యం కాదు. బిడ్డపుట్టిన కొత్తల్లోనే తల్లులు అంటే రెండు నెలలుకూడా కాకుండానే బిడ్డను వదలి తమ ఉద్యోగాలకు వెళ్ళవలసి వస్తుంది. అటువంటపుడు, మీ స్తనాల పాలను పిండి మీరు ఇంటిలో లేని సమయంలో కూడా పిల్లలకు పట్టవచ్చు.

1. బిడ్డ పుట్టిన మొదటి వారంలోనే పాలు అధికంగా వున్నపుడు వాటిని పిండి నిలువ వుంచండి. చేతులతో పిండవచ్చు. లేదా ఒక పంపు సహాయంతో పిండవచ్చు. ఈ పాలను గాలి చొరని కంటైనర్లలో వుంచి మీరు ఇంటివద్ద వున్నపుడే బేబీకి ఇవ్వటం మొదలుపెట్టండి.
పాలు నిలువ వుంచే డబ్బాలపై తేదీలు వేయండి. తల్లిపాలు రూమ్ టెంపరేచర్ లో అయితే 4 నుండి 8 గంటలు, రిఫ్రిజిరేటర్ లో 3 రోజులు, డీప్ ఫ్రీజర్ లో 3 నెలల పాటు కూడా వుంటాయి.

2. మీరు పాలను పిండి పాపకు ఇస్తున్నట్లు తోటి పనివారలకు చెప్పి పనికి ఆటంకం లేకుండా చేసుకోండి.

3. పనికి వెళ్ళిన తర్వాత పాలు పిండటానికి ఎంపిక చేసుకునే ప్రదేశం శుభ్రంగాను, అనువైనదిగాను వుండేలా చూడండి. బయట వున్నపుడు చేసే ఈ పాలు పిండే పని పాలు అధికంగా రావటానికి గాను ఒకే నియమిత సమయంలో చేయండి. మంచి నాణ్యతగల డబ్బాలలో మాత్రమే మీ స్తనాల పాలు పిండండి.

4. మీరు ఇంటివద్దే వున్నపుడు పాప ఎంత తరచుగా మీ పాలు తాగుతోందనేది గమనించండి. ఆమెకు ప్రతి రెండు గంటలకు పాలు పడితే, మీ స్తనాల పాలు కూడా మీరు ఎక్కడ వున్నా ప్రతి రెండు గంటలకు పిండేలా చూడండి.

5. అన్నిటికి మించి మీరు పిండి డబ్బాలలో నిలువ చేసిన పాలను ఎప్పటికపుడు మీ ఇంటివద్దకు పాప తాగటానికి గాను చేర్చేటందుకు విశ్వాసపాత్రుడైన వారిని ఎంపిక చేయండి.

6. మీరు పనికి వెళ్ళే ముందు బేబీకి ఒకసారి పాలు పట్టి వెళ్ళడం మంచిది. ఇక ఆపీసుకు వెళ్ళిన రెండు గంటల తర్వాత మాత్రమే మీకు పిండేటందుకు అనుకూలత వుంటుంది.

7. బేబీకి ఆరు నెలలు నిండితే తల్లిపాలతో పాటు, అదనపు ఆహారం ఇవ్వాలి. బిడ్డకు కావలసిన పోషక విలువలు కల ఘనఆహారం కొరకు ప్రణాళిక చేయండి.

ఈ రకంగా తల్లిపాలనే పట్టడం కాకుండా, బిడ్డ కవసరమైన ఇతర అంశాలను సైతం మీరు ఇంటివద్ద వున్నపుడు ఆచరిస్తూ, పూర్తి శ్రద్ధతో ప్రేమను అందించి బిడ్డతో చక్కటి అనుబంధాన్ని పెంచుకోండి.

English summary

Breastfeeding For Working Mothers - Easy Tips | ఉద్యోగులా ? అయినా సరే...తల్లి పాలే.... !

Apart from following the above breastfeeding tips for working mothers, remember to spend quality time when you are with your child. There is no better way to bond with the child than to give him your maximum attention and love.
Story first published:Thursday, August 18, 2011, 16:43 [IST]
Desktop Bottom Promotion