For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిడ్డకు పాలిచ్చే తల్లులు తినకూడనివి!

By B N Sharma
|

Food To Be Avoided During Breastfeeding
బిడ్డ పుట్టి ఆరు నెలలు వచ్చేటంత వరకు తల్లిపాలే బిడ్డకు ఆహారం. కనుక బిడ్డకు ఏ రకమైన సమస్యలూ రాకూడదనుకుంటే పాలిచ్చే తల్లులు తల్లికి, బిడ్డకు హాని కలిగించే కొన్ని ఆహార పదార్ధాలను తినరాదు. అవేమిటో చూద్దాం!

1. ఆవుపాలు - దీనివలన ప్రయోజనాలు అధికమే. కాని అలర్జీ కలిగిస్తాయి. గర్భవతిగా వున్నపుడు, డెలివరీ తర్వాత మహిళలో వ్యాధినిరోధకత తగ్గుతుంది. కనుక అలర్జీలు త్వరగా వస్తాయి. ఇవి తల్లిపాల ద్వారా బేబీకి కూడా సోకే అవకాశం వుంది. కనుక ఆవుపాలు మానండి.

2. మసాలాలు - మసాలాలు వేసిన ఆహారం గ్యాస్ కలిగిస్తుంది. ఇది బేబీకి బదిలీ కాగలదు. కనుక మసాలాలు - దాల్చిన చెక్క, వెల్లుల్లి, మిరియం మొదలైనవి వదలండి.

3. సువాసనలనిచ్చే కొత్తిమీర, అల్లం, దాల్చిన చెక్క మొదలైనవి వాడకండి. ఇవి తల్లిపాల రుచిని మార్చి బేబీకి చెడు రుచినిస్తాయి. తాగటానికి బేబీ నిరాకరిస్తుంది.

4. నిమ్మ జాతి పండ్లు వదలండి. వీటి కారణంగా గ్యాస్ వచ్చే ప్రమాదం వుంది. దీనివలన పొట్ట గడబిడే కాక బేబీకి చర్మ అలర్జీ వచ్చే అవకాశం వుంది.

5. ఆల్కహాల్ మరియు టొబాకో - ఈ రెండూ పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. కనుక మానటం మంచిది.

తల్లి బిడ్డకు పాలు పట్టేటపుడు ఈ ఆహార పదార్ధాలు ఉపయోగించకుండా వుంటే తాను ఆరోగ్యంగా వుండటమే కాక బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్నివ్వగలదు. అందరికి అన్ని ఆహారాలు సరిపడవు కనుక ఈ అంశంలో ఒక వైద్యుడి సలహా కూడా తీసుకోండి.

English summary

Food To Be Avoided During Breastfeeding | బిడ్డకు పాలిచ్చే తల్లులు తినకూడనివి!

Avoid these five food during breastfeeding, for a healthy self and a healthy child. It is also advised to visit a doctor for his recommendations. Diet also depends from individual to individual.
Story first published:Saturday, September 17, 2011, 10:24 [IST]
Desktop Bottom Promotion