For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాని కలిగించే బిడ్డపై ధ్యాస - శరీరంపై అశ్రధ్ధ!

By B N Sharma
|

Postnatal Malnutrition among Women
ప్రసవించిన మహిళల్లో పోషకాహార లేమి తల్లులకే కాక పిల్లలకు సమస్య తెచ్చిపెడుతుంది. గర్భ ధారణ సమయంలో లేదా తర్వాత మహిళలు పోషకాహారాన్ని తీసుకోడం చాలా ప్రధానం. అపుడే డెలివరీ అయిన మహిళలలో పోషకాహార లేమి తీవ్ర సమస్యలకు దారి తీస్తోంది. దీని కారణంగా, మొదటగా తల్లి పాలు బిడ్డకు కరువవుతున్నాయి. కనుక పాలు పట్టే తల్లులు కనీసం 1000 కిలో కేలరీల ఎనర్జీ ఇచ్చే ఆహారాన్ని ప్రతిదినం తీసుకోవాలి.

సరి అయిన సలహాలు, ప్రణాళికలు లేకుండా మహిళలు తమ ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. దీనికారణంగా డీహైడ్రేషన్ కు, విటమిన్ల లోపానికి, రక్త హీనతలకు గురవుతున్నారు. దీనినే మనం పోషకాహార లేమిగా చెపుతున్నాం. బిడ్డకు పాలు పడితే తల్లికి బాగా ఆకలి వేస్తుంది. ఏ ఆహారం పడితే ఆ ఆహారం తల్లి తినేకంటే, విటమిన్లు, ఖనిజలవణాలు కల ఆహారాన్ని సమృధ్ధిగా తీసుకుంటూ శరీరం నుండి బయటకు పోయిన శక్తిని తిరిగి పొందాలి. సాధారణంగా ఫోలిక్ యాసిడ్ లోపం వచ్చి తీవ్ర రక్తలేమికి గురవుతూంటారు మహిళలు. కనుక బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు మహిళలు విటమిన్లను కలిగిన పోషక విలువలు కల ఆహారాన్ని తీసుకుంటూనే వుండాలి. బిడ్డకు పాలు చాలటం లేదన్న లేదా ఇతర మనోవ్యధలు ఆహారం సరిగా తీసుకోనివ్వక తల్లిని పోషకాహార లేమికి గురిచేస్తాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు సాధారణంగా కొంత బరువు పెరుగుతారు. అయితే పెరిగిన ఈ బరువును తగ్గించుకోవాలనే ఆందోళనలో సరి అయిన ఆహారం తీసుకోకపోవడం కూడా జరుగుతుంది. బరువు తగ్గించుకోడం అనేది నిదానమైన ప్రక్రియగా భావించాలి. ప్రసవించిన మహిళలకు తమ బేబీపై అధిక ధ్యాస వుండటంతో కనీసం రోజుకు అయిదు గంటలు కూడా నిద్రపోరు. నిద్ర లేమి ప్రభావం కూడా వీరిపై పడుతూంటుంది. బిడ్డ నిద్రిస్తున్న సమయంలోనే తల్లి కూడా నిద్రించే అలవాటు చేసుకోవాలి. డాక్టర్ లేదా పోషకాహార నిపుణులు ఇచ్చిన సలహా మేరకు ఆహారాన్ని ప్రసవించిన మహిళలు తీసుకుంటుండాలి. బిడ్డకు తల్లులకు సమస్యలు రాకుండా ఉండాలంటే, గర్భధారణ సమయంలోనే కాక, ప్రసవించిన ఆరు నెల కాలం వరకు మహిళ ఆహారం, నిద్రల పట్ల అధిక జాగ్రత్త వహించాలి.

English summary

Postnatal Malnutrition among Women | హాని కలిగించే బిడ్డపై ధ్యాస - శరీరంపై అశ్రధ్ధ!

Malnutrition during pregnancy or even after it adversely effects the baby and thus, should be avoided at all costs. Malnutrition among women who have just delivered is one of the major postpartum problems. So, lets take a closer look.
Story first published:Saturday, August 13, 2011, 16:35 [IST]
Desktop Bottom Promotion