For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భయభ్రాంతులవకండి....రెండో బిడ్డను పొందండి!!

By B N Sharma
|

Second Pregnancy After C Section Delivery
ఒక సారి సిజేరియన్ ఆపరేషన్ జరిగి డెలివరీ అయిందంటే మహిళకు ఎంతో ఒత్తిడిగాను, సమస్యగాను వుంటుంది. ఇక ఆ పరిస్ధితులలో వెంటనే రెండో గర్భం దాలిస్తే ఆమెకు పరిస్ధితి క్లిష్టంగా వుంటుంది. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత కనీసం 18 నుండి 23 నెలలపాటు శరీరానికి విశ్రాంతి నిచ్చి మొదటి కాన్పు అయిన వెంటనే వచ్చిన అలసటను పొగొట్టుకోడం ఆ తర్వాత గర్భం ధరించటం మంచిది. పూర్వం, మహిళకు ఒక సారి సిజేరియన్ అయిందంటే ఇక ఆమెకు రెండో సంతానం కష్టమని లేదా రెండో సంతానం కొరకు కూడా సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందని అనుకునేవారు. కాని ఈ ఊహలు సరి కావని రుజువయింది.

రెండో సారి సిజేరియన్ చేయాలా వద్దా ? అనేది మొదటి దానిని రెండవ ప్రెగ్నన్సీతో పోల్చి చెప్పటం జరుగుతుంది. రెండు ప్రెగ్నెన్సీలలోను ఒకే రకమైన సమస్యలు వస్తే రెండో సారి కూడా సిజేరియన్ చేయాల్సివస్తుంది. లేకుంటే పరిస్ధితినిబట్టి ఆమె సహజ ప్రసవం కూడా చేయగలిగే అవకాశాలున్నాయి. సిజేరియన్ తర్వాత వచ్చే రెండో ప్రెగ్నెన్సీకి సర్జరీ అనేది తల్లి యొక్క పరిస్ధితినిబట్టి వుంటుంది. ఆమె గత అనుభవం, పడిన బాధలు మొదలైనవి ఆమెను మరో సిజేరియన్ పిల్లాడికి సిద్ధం చేస్తాయా అనేది తెలుపుతాయి. రెండో సారి జన్మనివ్వటానికి ఆమె పూర్తిగా భయపడుతూండవచ్చు. మొదటి ప్రసవం ఎంతో బాధాకరమైనదైవుండవచ్చు. గర్భవతిగా వున్న స్త్రీ, సంబంధిత వైద్యడు ఇరువురూ కూడా ప్రసవ సమయంలో గతంలో సిజేరియన్ ఆపరేషన్ జరిగితే, ఎంతో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే, గత సిజేరియన్ నుండి అతి చిన్న కోత పడినప్పటికి అది చాలా ప్రమాదకరం. వైద్యపరంగా చెప్పాలంటే దీనిని 'యుటెరిన్ రప్చర్' అంటారు.

గర్భం ధరించటానికి ముందే మీకు ఏ రకమైన ప్రసవం తేలిక అనేదానిపై వైద్యుడి సలహాపొందటం అవసరం. గతంలోని డెలివరీ రికార్డును, ఇతర సంబంధిత సమాచారాన్ని రెండవసారి గర్భం ధరించేముందర పరిశీలించండి. సిజేరియన్ అయినంత మాత్రాన రెండవ సారి గర్భం ధరించటం హానికరం కాదు. భయపడాల్సిన అవసరం లేదు. వైద్యడు రెండో గర్భ ధారణకు అనుమతినిచ్చినా లేక మీకే రెండవ బేబీ కావలన్నా తప్పక పొందవచ్చు.

English summary

Second Pregnancy After C Section Delivery | భయభ్రాంతులవకండి....రెండో బిడ్డను పొందండి!!

One of the most important considerations for a second pregnancy after C section is the mother"s response towards the surgery. Her past experience and emotions can make her decide whether she is prepared for a cesarean kid or not. It may have been a scary and traumatic experience for her and she may be frightened and doubtful about the second birth.
Story first published:Wednesday, August 24, 2011, 15:08 [IST]
Desktop Bottom Promotion