For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్తస్రావం అరికట్టేందుకు ఆరు మార్గాలు!

By B N Sharma
|

Top 6 Things To Do During Postpartum Bleeding
మహిళలలో కొంతమందికి ప్రసవానంతరం కూడా రుతుస్రావం అవుతూనే వుంటుంది. కొంతమందిలో ఈ రుతు స్రావం మరింత అధికంగా కూడా వుంటుంది. దీని కారణంగా శరీరం బలహీనపడి మహిళలు తమ ఉత్సాహాన్ని బిడ్డపుట్టిన ఆనందాన్ని కోల్పోతూంటారు. వీటిని అరికట్టాలంటే ఆచరించాల్సిన కొన్ని సామాన్య పద్ధతులు పరిశీలిద్దాం.

1. ప్రతి మహిళ బిడ్డ పుట్టిన తర్వాత సగటున కనీసం 225 మి.లీ.రక్తాన్ని కోల్పోతుంది. బిడ్డ పుట్టిన తర్వాత అయ్యే నెలసరి రుతుస్రావం కూడా గతంలో వలే సాధారణంగా వుండదు. గర్భంలో వున్న బేబీకి రక్షక కవచంగా వున్న గర్భగోడ అంచులు కూడా బేబీ పుట్టిన తర్వాత బ్లడ్ తో పాటు బయటకు వస్తాయి. డెలివరీ తర్వాత అయ్యే రుతుస్రావాన్ని అరికట్టటానికి గాను తల్లులు ప్రధానంగా పిల్లలకు పాలు పట్టాలి. పాలుపడితే ఆ చర్య గర్భ సంకోచం మారుతుంది. ఈ చర్య బయటకు వచ్చే బ్లడ్ ను అరికట్టి గర్భం సంకోచం చెందకుండా చూస్తుంది.
2. బిడ్డకు పాలు పట్టడంతో పాటు తల్లి వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. పడుకుని వుంటే రక్త స్రావం తగ్గే అవకాశం వుంది.
3. రక్తస్రావం అధికంగా వుంటే, వీలైనంత తరచుగా ప్యాడ్స్ మార్చండి.
4. ఒక్క పదిరోజుల రక్త స్రావం తర్వాత బ్లడ్ రంగు మారుతుంది. రంగు మారకపోయినా, నొప్పులు తగ్గకపోయినా వైద్యుని సంప్రదించటం అవసరం.
5. ఈ రక్త స్రావం జరిగేటపుడు మహిళలు అపస్మారక స్ధితికి చేరితే, లేకా తీవ్ర అలసట పొందితే ఐరన్ అధికంగా వున్న ఆహార పదార్ధాలు అందించాలి. రక్త హీనత కారణంగా ఈ స్ధితి ఏర్పడుతుంది.
6. కాన్పు అనంతరం రక్త స్రావం కొనసాగే మహిళలు లేదా సిజేరియన్ పొందిన మహిళలు స్వీమ్మింగ్ పూల్స్ లో స్నానాలు చేయరాదు. స్నానం వైద్యుని సంప్రదింపుపై చేయాలి.

English summary

Top 6 Things To Do During Postpartum Bleeding | రక్తస్రావం అరికట్టేందుకు ఆరు మార్గాలు!

The periods after the birth of the baby is postpartum periods and the blood that comes out during the time is called 'lochia'. The very reason why we are giving a few tips on postpartum bleeding is because during the time the bleeding will be unimaginable high and the body resistance will be extremely low so some precautions and postnatal care tips will definitely help.
Story first published:Tuesday, August 30, 2011, 12:18 [IST]
Desktop Bottom Promotion