For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత అధిక బరువును తగ్గించడం ఎలా...!

|

సాధారణంగా మహిళలు ప్రసవం తర్వాత బరువు పెరుగుతారా? సిజేరియన్ అయినా? సాధారణ డెలివరీ అయినా బరువు పెరగాల్సిందేనా? అంటే.. కాదని అంటున్నారు వైద్యులు. ఆహార నియమాలు, వ్యాయామంతో నాజూగ్గా ఉండొచ్చని పేర్కొంటున్నారు. డెలివరీ తర్వాత 4-5 నెలల పాటు విశ్రాంతి తీసుకోవడం, నెయ్యి, స్వీట్లు లాంటి కార్బోహైవూడేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. నిత్యం వ్యాయామం చేస్తూ, పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మళ్లీ సాధారణ స్థాయికి చేరుకోవచ్చు.

గర్భందాల్చిన నాటి నుంచి డెలివరీ అయ్యే వరకు బిడ్డ బరువుతో కలిపి మహిళలు 9-12 కిలోలు బరువు పెరుగుతారు. డెలివరీ తరువాత తల్లి గర్భంలో ఉండే ఉమ్మనీరు, యూట్రస్ వల్ల 5-6 కిలోల వరకు బరువు అధికంగా ఉంటారు. ఈ బరువు కూడా ఆరు నెలల్లో తగ్గిపోయి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటారు. డెలివరీ అయిన తర్వాత పూర్తిగా విశ్రాంతి కల్పిస్తారు. ఈ సమయంలో ఎక్కువగా కార్బోహైవూడేట్లు ఉండే ఆహారం తీసుకున్నా.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు.

అధిక బరువుతో అనర్థాలు: సాధారణ డెలివరీ అయితే వారం రోజుల తర్వాత, అదే సిజేరియన్ అయితే 10 రోజుల తరువాత సాధారణంగా అన్ని పనులు చేసుకోవచ్చు. వ్యాయామం కూడా చేయడం వల్ల బరువు పెరగకుండా జాగ్రతపడొచ్చు. సిజేరియన్ అయిన వాళ్లలో ఇంటి పనులు చేసినా, వ్యాయామం చేసినా మంచిది కాదనే అపోహలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదని వైద్యులు చెబుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో పెరిగిన బరువులో 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక బరువు వల్ల మధుమేహం, హైపర్‌టెన్షన్ లాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవ్వొచ్చు.

Best Tips for Postnatal Weight loss

వ్యాయామం ఉత్తమం: వ్యాయామంతో శరీరంలో రక్తవూపసరణ, జీర్ణవ్యవస్థ బాగా పనిచేయడంతో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వ్యాయామం చేయలేనివారు రోజుకు కనీసం గంటపాటు వాకింగ్ చేయాలి. ఇవి కాకుండా థైరాయిడ్ సమస్య వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రతలు:
1. సాధారణ డెలివరీ అయితే వారం రోజులు, సిజేరియన్ అయితే పది రోజుల తరువాత వ్యాయామం, వాకింగ్ చేయవచ్చు.
2. డెలివరీ అయిన ఆరువారాల తరువాత మళ్లీ సాధారణ వైవాహిక జీవితం గడపొచ్చు.
3. డెలివరీ తరువాత 10 రోజులకు మించి విశ్రాంతి తీసుకోవద్దు.
4. కార్బోహైవూడేట్లు తక్కువగా ఆహారం తీసుకోవాలి.
4. ప్రొటీన్లు, పాలు, గుడ్లు, చేపలు, నానబెట్టిన గింజలు తీసుకోవాలి.
5. పండ్లు, పళ్లరసాలు, తాజా కూరగాయలు తీసుకోవాలి.

ఏ సమయంలో ఏం తినాలి:
1. ఉదయం: అల్పాహారంలో విటమిన్ బి ఎక్కువగా ఉన్న పదార్థాలుంటే మేలు. ఇడ్లీ, పెసరట్టు, గోధుమ, ఉప్మా, రొట్టెలు, దోశ, పాలు, ఏదైనా పండు తింటే మంచిది.
పీచుపదార్థాలు: యాపిల్స్, నారింజ, క్యారెట్ ముక్కలు, బాదం, పిస్తా వివిధ రూపాల్లో తీసుకోవాలి.
2. మధ్యాహ్నం: అన్నం, గోధుమ రొట్టెలు తీసుకోవాలి. ఐరన్, కార్బోహైవూడేట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. కూరల్లో పాలకూర, ఆకుపచ్చటి కూరగాయలు తినాలి.
సాయంత్రం: పండ్ల రసాలు, పుచ్చకాయ, క్యారెట్ రసం, పాలు తీసుకోవాలి.
3. రాత్రి: బియ్యం, పప్పుధాన్యాలుతో పాటు కోడిగుడ్డు తీసుకోవాలి. రాత్రి పది గంటల తరువాత ఆహారం తీసుకోవద్దు.

పని చేసుకోవచ్చు: డెలివరీ అయిన వారం, పది రోజుల తరువాత అన్ని పనులు చేసుకోవచ్చు. వ్యాయామం చేస్తూ.. ఆహార నియమాలు పాటించడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. మోడలింగ్, సినిమా రంగానికి చెందినవారు లైపోసక్షన్, ప్లాస్టిక్ సర్జరీల వల్ల మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటారు.

English summary

Best Tips for Postnatal Weight loss | ప్రసవం తర్వాత అధిక బరువును తగ్గించండిలా..!

After a pregnancy, most of us want to get back to our pre-pregnancy shape and weight as soon as possible, but many women find it hard to lose weight post pregnancy. In this article we explain the best ways to get back into shape after a pregnancy and provide some very helpful tips that can help you get fit for motherhood and help you look and feel your very best.
Story first published: Friday, December 21, 2012, 17:01 [IST]
Desktop Bottom Promotion