For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు మెచ్చే సుగంధ ద్రవ్యాల స్నానం!

మహిళలు మెచ్చే సుగంధ ద్రవ్యాల స్నానం!

By B N Sharma
|

Mother
మహిళ గర్భాన్ని ధరించిన మొదలు శారీరకంగా ఎన్నో అసౌకర్యాలకు గురవుతుంది. కొన్ని సమయాలలో వచ్చే సమస్యలు ఆమెకు ప్రాణాంతకంగా కూడా వుంటాయి. వాటిలో ఒకటి శారీరక నొప్పులు. డెలివరీ తర్వాత వచ్చే ఈ నొప్పులు తగ్గటానికి ఆమెకు కొన్ని రోజుల వరకు పడుతుంది. నొప్పికి తోడు ఆమెకు ఇతర సమస్యలైన రక్తస్రావం వంటివి కూడా వుంటాయి. మరి ఈ నొప్పులను తగ్గించటానికి గాను వైద్యపరంగా మందులు కూడా వాడుతూంటారు.

అయితే, ఈ నొప్పులు సహజంగా తగ్గించాలంటే సహజ విధానాలలో సుగంధ ద్రవ్యాల స్నానం ఒకటి. సుగంధ ద్రవ్యాల స్నానం అంటే అనేక రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఎసెన్సులు దీనిలో వాడతారు. దీనివల్ల శారీరక నొప్పులు తగ్గి ఎంతో హాయిగా వుంటుంది. ఒకటి లేదా రెండు స్నానాల తర్వాత సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శరీరంలోని చెడు తొలగుతుంది. చెడు తరంగాలనుండి విముక్తి కలుగుతుంది. అవసరాలకనుగుణమైన సుగంధ ద్రవ్యాలను ఎంచుకుని ఉపయోగించాలి. దీనికై బాత్ టబ్ వాడవచ్చు లేదా మామూలుగా వాడే స్నాన పరికరాలు కూడా సరిపోతాయి.

ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు ఎంచుకోవచ్చు. వాటిని వేడినీరు ఉన్న పాత్రలో ఉంచాలి. అపుడు ఆ నీరు ద్రవ్యాలలోని సారాన్ని గ్రహిస్తాయి. స్నాన పరికరాలు శుభ్రంగా వుండాలి. స్నానానికి సబ్బు, షాంపూ ఉపయోగించి రోజూవలెనే స్నానం చేయాలి. తర్వాత వనమూలికలు కలిపిన వేడి నీటిని టబ్, లేదా బకెట్ లో వున్న నీటికి చేర్చాలి. ఆ నీటితో తలతోపాటు శరీరమంతా తడిసేలా స్నానం చేయాలి. టవలుతో ఒళ్ళు తుడుచుకోవద్దు. ఒక పరిశుభ్రమైన గుడ్డ ఒంటికి చుట్టుకోవాలి.శరీరం గాలికి ఆరిపోతుంది. సుగంధ ద్రవ్యాల వాసన, ఒంటికి తగిలిన చల్లదనం ఆమెకు ఎంతో హాయినిస్తుంది.

ఈ రకంగా ఒళ్ళు సహజంగా ఆరే పద్దతి ముఖ్యం. పొడుగైన వెంట్రుకలున్నవారు తల తడుపుకోకుండా గుడ్డతో కవర్ చేయాలి. తరువాత 24 గంటలు స్నానం చేయవద్దు. కనీసం 12 గంటలైనా ఆగాలి. ఆ తర్వాత అవసరమనుకుంటే పరిశుభ్రమైన నులివెచ్చని నీటితో మరోమారు స్నానం చేస్తే శారీరక నొప్పులు మటుమాయం అవుతాయి.ఈ సుగంధ ద్రవ్యాల స్నానం మహిళ తన ప్రసవం తర్వాత వైద్యుల సలహాను బట్టి ఆచరించాలి. ఈ రకమైన స్నానం ఇంటివద్దే ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, అనుభవం కల మహిళలు ఆమెకు సహకరించాలి. ఈ రకమైన స్నానం ఆమెకు శారీరక నొప్పులు తగ్గించి మంచి నిద్రను కూడా పట్టిస్తుంది. డెలివరీ తర్వాత మహిళ మానసికంగా కూడా ఆందోళనలో వుంటుంది. బిడ్డ కొరకై అధిక సమయం వెచ్చించాలని చూస్తుంది. కనుక, సహాయంగా వుండే మహిళలు ఈ ఏర్పాట్లు చేసి ఆమెకు సౌకర్యం కలిగించి ఆనందింపచేయాలి.

English summary

Curing Postnatal Delivery Pains! | నొప్పి లేని కాన్పు...పొత్తిళ్ళల్లో బిడ్డ!

Labor pain occurs due to contractions in the uterus, it takes place while pushing the baby down. The pain the abdominal region and birth canal is severe and may go on from hours to days. It is said that preparing for childbirth is the toughest phase as the mother needs to cope up with a lot of pain.
Desktop Bottom Promotion