For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత స్త్రీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

|

Foods to Eat After The Birth - Baby..?
మాతృత్వం ప్రతి స్త్రీకీ ఒక కళ. కొత్త కోడలు కడుపు పండాలని, తాము త్వరగా అత్త, బామ్మ, అమ్మమ్మ, పిన్ని అని పిలిపించుకోవాలనీ కుటుంబ సభ్యుల్లో అందరూ కోరుకుంటుంటారు. గర్భిణీకి ఆ సమయంలో అందరూ సలహాదారులే. తినాల్సినవీ, తినకూడనవీ అని వాటి గురించి ఆమె చుట్టూ చేరి అందరూ చర్చించుకుంటూ ఉంటారు. బాలింతకీ, ఆమెను కనిపెట్టుకుని ఉండే వారికీ కూడా ఆహారాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయంలో ఆ మాత్రం జాగ్రత్తలు అవసరమే...

సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చాక బాలింతలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే పెడతారు. ఆ సమయంలో జీర్ణమైన ఆహారం మాత్రమే శిశువుకు పాలుగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ సమయంలో బాలింతలు తగు జాగ్రత్తులు పాటిస్తూ తీసుకునే ఆహారం పుష్టికరంగా, ఆరోగ్యవృద్దికరంగా ఉండేలా చూసుకోవాలి. ప్రసవం జరిగిన తొలిరోజుల్లో ఎక్కువగా పులుపు, కారం, మసాలాలను తీసుకోకూడదు. గర్భవతిగా ఉన్నప్పుడే కాదు, ప్రసవం తర్వాత కూడా కొత్తగా తల్లి అయిన స్త్రీలకు నియమిత ఆహారం ఎంతో అవసరం. శిశువు జన్మించిన ఆరు నెలల వరకూ తల్లిపాలే శిశువులకు పోషకాహారం. శిశువు తాగే పాలు తేలికగా జీర్ణించుకుని ఆరోగ్యవంతంగా దినదినాభివృద్ది చెందాలంటే తల్లి తగిన జాగ్రత్తలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. దీంతో తల్లీ, బిడ్డల ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

ఈ విషయంలో నిపుణుల సలహా ప్రకారం సాధారణంగా బాలింతలకు తొలిసారి తల్లులైనప్పుడు వారిపై ఎటువంటి ఆంక్షలూ ఉండవు. కానీ మందులు వాడేటప్పుడు మాత్రం మీ డాక్టర్ సలహాలను పాటించడం అవసరం. ఆరు నెలల వరకూ ఆమె ఇచ్చే పాలే శిశువుకి సంపూర్ణ ఆహారంగా మారుతుంది. ఈ సమయంలో పొగతాగడం, మద్యపానం లాంటివి చేయకూడదు. మసాలాలు, కృత్రిమ రంగులు, రుచులతో నిండిన ఆహారాన్ని తీసుకోకూడదు. తల్లి తీసుకొనే ఆహారంలో ఇవి చేరితే బిడ్డ జీర్ణవ్యవస్థ చెడిపోతుంది. శుద్దమైన సమతులహారం మాత్రమే తీసుకోవాలి. దీంతో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.

కెలరీలు: ధాన్యం, పంచదార, వగరు, తేనె, నెయ్యి, నూనె అన్నీ సమపాళ్ళలో కొంచెం ఎక్కువగా తీసుకోవాలి.
ప్రోటీనులు: అవయవాలు వికాసం చెంది శిశువు సక్రమంగా ఎదగాలంటే ప్రొటీన్స్ చాలా అవసంర. పప్పులు, పాలు, పాలపదార్థాలు, గుడ్లు, మాంసం, చేపలు మొదలైనవాటిలో ఇవి పుష్కలంగా ఉంటాయి.

విటమిన్స్: బిడ్డ ఎదుగుదలకు పుష్టికి వ్యాదుల నుండి తట్టుకునే శక్తికి, జీర్ణ, నాడీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి విటమిన్లు ఎంతో దోహద పడతాయి. విటిమిన్ ఎ' ఆకుకూరలు, పండ్లు, పాలు, నెయ్యి, వనస్పతి, నూనెల్లో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి' కాల్షియంను వృద్దిపరుస్తుంది. గుడ్డు సొన, లివర్, తేనె, పాలు, వనస్పతి, నెయ్యి, నూనెల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. సూర్యకిరణాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి' పుల్లని పళ్ళు, ఆకు కూరల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ' గుడ్డు సొన, ఎండిన ఫలాలు, ధాన్యం, పచ్చిన ఆకుకూరలు లాంటి వాటిలో ఉంటుంది. నూనెలె వనస్పతికి చెందినవిగా ఉండాలి. విటమిన్ కె' పంది లివర్, బంగాళాదుంపలు, పచ్చిన ఆకుకూరలు లాంటి వాటిలో లభిస్తుంది.

మినరల్స్/జింక్/ ఐరన్: ఐరన్, ఫాస్పరస్, కాల్షియమ్, అమోడివ్, జింక్ లాంటి వాటిలో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దంతాలు ఎదుగుదలకు, ఎముకల గట్టిదనానికి, పెరుగుదలకు కాల్షియం ఎంతో అవసరం. పాలు పాలపదార్థాల్లో మినిరల్స్ ఎక్కువగా లభిస్తాయి. రోగనిరోధక శక్తికి జింక్ బాగా ఉపయోగపడుతుంది. ధాన్యం,పన్నీర్, వేరుశనగ గింజలు మొదలైన వాటిలో లభిస్తుంది. మొలకెత్తిన గింజలైతే మరీ శ్రేష్టం. చేపలు, మాంసం, గుడ్లు, ఆకుపచ్చని పళ్ళు, ఆకుకూరలు, ధాన్యం రేగు పళ్ళు మొదలైన వాటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

English summary

Foods to Eat After The Birth - Baby..? | ప్రసవం తర్వాత స్త్రీ ఆహార నియమాలు..1?

As a new mom, one of the best things you can do for yourself and your baby is to eat a healthy diet.
 Even though you may be in a hurry to lose those pregnancy pounds, regularly eating foods that boost energy for new moms will give you the stamina you need to be the best mom you can be. That's because eating nutrient-rich foods at regular intervals throughout the day can maximize the little energy you probably have as a new mom.
Story first published:Tuesday, August 14, 2012, 7:59 [IST]
Desktop Bottom Promotion