For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిజేరియన్ తర్వాత జాగ్రత్తలు!

నేటి రోజుల్లో బిడ్డను కనడం అంటే సిజేరియన్ చేసి డెలివరీ చేయడమేగా సాధారణం అయిపోయింది. మహిళలు కూడా యోని ద్వారా బిడ్డ జననం కంటే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డను పుట్టించుకోవడం తేలికగా భావిస్తున్నారు. అయిత

By B N Sharma
|

postnatal
నేటి రోజుల్లో బిడ్డను కనడం అంటే సిజేరియన్ చేసి డెలివరీ చేయడమేగా సాధారణం అయిపోయింది. మహిళలు కూడా యోని ద్వారా బిడ్డ జననం కంటే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డను పుట్టించుకోవడం తేలికగా భావిస్తున్నారు. అయితే, సిజేరియన్ తర్వాత తీసుకోవలసిన ఆరోగ్య పర జాగ్రత్తలు శ్రద్ధగా పాటించాలి. లేదంటే, తల్లికి ఆనమెతో పాటు బిడ్డకు కూడా అనారోగ్యాలు కలిగే ప్రమాదముంది. సిజేరియన్ అయిన మహిళ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది పరిశీలించండి.

గాయం - సిజేరియన్ లో కుట్లు పడతాయి. గాయం మానటానికి కొంత సమయం తీసుకుంటుంది. కనుక కొద్దిరోజులు డాక్టర్ సలహాపై స్నానం మానేయండి. నీరు తగిలితే గాయం ఇన్ ఫెక్షన్ కు గురవుతుంది. గాయం మరింత నొప్పి పెడుతుంది. బిగువైన దుస్తులు ధరించకండి. కాటన్ గుడ్డలు ధరించండి.
డ్రెసింగ్ - సిజేరియన్ గాయాన్ని ప్రతివారం తప్పక డ్రెసింగ్ చేయించాలి. డ్రసింగ్ గాలి బాగా ఆఢేట్లు చేయాలి. స్నానం తర్వాత గాయాన్ని కూడా గాలితో ఆరబెట్టండి. గాయం వీలైనంత పొడిగా వుండేలా చూడండి.
మెల్లగా నడవండి - సిజేరియన్ అయిన కొద్దిరోజులకు మెల్లగా నడవటం మొదలుపెట్టండి. ఇది చాలా అవసరం. అయిదు లేదా ఆరు వారాలవరకు పొట్ట కండరాలు అధికంగా సాగటం ప్రమాదకరం. మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకొని మెల్లగా అయిదు లేదా ఆరు నిమిషాలు నడవండి.
ఆహారం - ఆహారంలో విటమిన్ సి అధికంగా వుండే ఆహారం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు. బ్రక్కోలి, ఆకు కూరలు, మొలకెత్తిన విత్తనాలు, పచ్చి బఠాణీలు, ఆరెంజ్ లు, బెర్రీలు, ద్రాక్ష, అప్రికాట్ వంటి విటమిన్ సి కల ఆహారాలు తీసుకోండి, నూనెలు, మసాలా దినుసులు కనీసం మూడు వారాలపాటు నిలిపివేయండి.
సరైన జాగ్రత్తలు తీసుకుంటే, సిజేరియన్ డెలివరీ తర్వాత కోలుకోవటం తేలిక, త్వరగానూ వుండగలదు. గాయం తగ్గటానికి కనీసం అయిదు నుండి 8 వారాలు పడుతుంది.

English summary

Postnatal Care for A Cesarean Delivery | సిజేరియన్ తర్వాత జాగ్రత్తలు!

After a C-section, a lot of rest is advised. It may take quite a while for the surgery wound to heal and the pain to subside. It is very crucial for the new mother to take care of herself, during this period. Boldsky tells you about some of the things that should be completely avoided after a Cesarean delivery.
Desktop Bottom Promotion