For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవానంతరం మలబద్ధకం నివారణకు తీసుకోవల్సిన ఆహారాలు..!

|

మహిళలలు గర్భం దాల్చిన వెంటనే శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి స్త్రీ గర్భం ధరించిన తర్వాత మరియు ప్రసవానంతరం లేదా ప్రసూతి రక్షణ తీసుకోవడం అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉంది. మలబద్దక సమస్య గర్భినీస్త్రీలకు సహజం. ఇది గర్భిణీగా ఉన్నప్పుడు ఆమె తీసుకొనే మందుల వల్ల శరీరంలో హార్మోనుల అసమతుల్యత వల్ల ఇలా జరగవచ్చు. ఈ సమస్య ప్రసవానంతరం కూడా కనిపిస్తుంది. ఈ సమస్య ప్రసవానంతరం చాలా బాధకలిగిస్తుంది.

ఇటువంటి సమస్య ఉన్నప్పుడు పాలిచ్చే తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చాలా మంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఈ సమస్యను అలాగే పట్టుకొని పసిపిల్లలకు పాలు పట్టడం బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ సమస్య తల్లిలో కూడా అనేక ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ప్రసవానంతరం చాలా మంది పురాతన పద్దతులు ఉపయోగించి తగినటువంటి పోషకాహారన్ని తీసుకోలేకపోతున్నారు. పాలు, ద్రవాహారాలకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి ప్రస్తు కాలాన్ని బట్టి ప్రసవం తర్వాత తల్లి ప్రోషకాహారం చాలా మంచిది.

ప్రసవాతనంతరం తల్లి కొన్ని హెల్తీ పోస్ట్ నేటల్ డైట్ తీసుకోవాలి. మరియు ప్రతి రోజూ తీసుకొనే ఆహారంతో తగినన్ని న్యూట్రీషియన్స్ పొందే టటువంటి ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్దకంతో పాటు ఇతర ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు. నీరు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి. అటువంటివి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేయబడుతుంది. దాంతో మలబద్దక సమస్యను నిరోధిస్తుంది. మలబద్దకాన్ని నిరోధించే అటువంటి ఆహారాలు మరికొన్ని...

ప్రసవం తర్వాత మలబద్దకాన్ని నివారించే ఆహారాలు..!

దిల్ ఆకలు(డిల్ లీవ్స్): కర్రీ లేదా సూపుల్ ఈ దిల్ లీవ్స్ లేకుండా తయారు చేయలేరు. దిల్ లీవ్స్ వల్ల తల్లిలో పాలు బాగా పడుతాయి. కానీ జీర్ణం కూడా సులభంగా అవుతుంది. దాంతో జీర్ణక్రియకు సహాయపడే ప్రేగును ఉద్దీపనచేస్తుంది. దాంతో మలబద్దకం నిరోధించబడుతుంది.

ప్రసవం తర్వాత మలబద్దకాన్ని నివారించే ఆహారాలు..!

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: ప్రసవానంతరం పాలిచ్చే తల్లులకు విటమిన్స్ ను అంధించడంతో పాటు జీర్ణ శక్తిని పెంచడానికి ఆకుకూరలు మరియు సలాడ్స్ బాగా సహాయపడుతాయి. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ సులభంగా జీర్ణం అయ్యి జీవక్రియలను క్రమబద్దం చేస్తాయి.

ప్రసవం తర్వాత మలబద్దకాన్ని నివారించే ఆహారాలు..!

జీర్ర మరియు నెయ్యి: బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కు మలబద్దకం నిరోధించడానికి ఇది ఒక అద్భుతమైన హోం రెమడీ. రెండు చెంచాలా నెయ్యిలో రెండు చెంచాలా జీలకర్ర వేసి వేగించి పౌడర్ చేసి, రైస్ తో మిక్స్ చేసి తినడం వల్ల జీర్ణం బాగా అవుతుంది. మలబద్దకాన్ని నిరోధిస్తుంది.

ప్రసవం తర్వాత మలబద్దకాన్ని నివారించే ఆహారాలు..!

పండ్లు: బెర్రీస్ మరియు బనానా వంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తగు మోతాదులో బ్రేక్ ఫాస్ట్ సమయంలో మరియు ఈవెనింగ్ స్నాక్ గాను తీసుకోవడం వల్ల జీర్ణక్రియం సక్రమంగా జరగడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

ప్రసవం తర్వాత మలబద్దకాన్ని నివారించే ఆహారాలు..!

ఆమ్లా(ఉసిరికాయ) జ్యూస్: బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ లో మలబద్ధకాన్ని నిరోధించడానికి ఆమ్లా జ్యూస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ప్రేగు కదలికలను మరియు దీర్ఘకాల మలబద్దాకాన్ని మరియు ఫైల్స్ ను నియంత్రిస్తుంది.

ప్రసవం తర్వాత మలబద్దకాన్ని నివారించే ఆహారాలు..!

బార్లీ: ధాన్యాలు లేదాతృణధాన్యాలు, బహుళ ధాన్యాలతో తయారు చేసే బార్లీ మలబద్దకాన్ని నివారించడానికి ఒక ఆరోగ్యకరమైన ఆహారం ఈ బార్లీ. అంతే కాదు ఇది కొవ్వు రహిత ప్రత్యామ్నాయం.

ప్రసవం తర్వాత మలబద్దకాన్ని నివారించే ఆహారాలు..!

డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్: స్నాక్ టైమ్ గుంపెడు ఎండు ద్రాక్ష, ఖర్జూరం, లేదా ఎండిన క్రాన్ బెర్రీస్ లేదా ఆపిల్స్ లేదా ఒక చెంచా నిండు ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్, పండ్లోతో మిక్స్ చేసిన పెరుగును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మలబద్దకాన్ని నిరోధిస్తుంది.

ప్రసవం తర్వాత మలబద్దకాన్ని నివారించే ఆహారాలు..!

హైడ్రేషన్: శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడం అందరికీ చాలా అవసరం. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా ఎక్కువగా దాహానికి గురిఅవుతారు కాబట్టి 3-4మంచినీళ్ళు మరియు 2గ్లాసులు కొబ్బరి నీళ్ళు త్రాగడం చాలా ఆరోగ్యకరం ఇది శరీరాన్ని హైడ్రేషన్ లో(చర్మాన్ని చల్లగా, తేమగా)ఉంచి బౌల్ మూమెంట్ సక్రమంగా ఉండేందుకు సహాయపడుతాయి.

ప్రసవం తర్వాత మలబద్దకాన్ని నివారించే ఆహారాలు..!

ఉడికించిన ఓట్ మీల్: ఓట్ మీల్ ల్లో అధికంగా ఫైబర్ ఉంది. మరియు దీన్ని ఉడికించడం ద్వారా. ఇది తినడం వల్ల అతి సులభంగా జీర్ణఅయ్యేలా చేసి మలబద్దకాన్ని నిరోధిస్తుంది.

ప్రసవం తర్వాత మలబద్దకాన్ని నివారించే ఆహారాలు..!

పెరుగు: పెరుగు శరీరాన్ని చల్లబర్చడం మాత్రమే కాదు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను లేకుండా రక్షణ కల్పిస్తుంది. రూమ్ టెంపరేచర్ లో అరకప్పు పెరుగు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కు ఇవ్వడం వల్ల మలబద్దకాన్ని నిరోధిస్తుంది.

English summary

Foods To Prevent Postnatal Constipation | ప్రసవం తర్వాత మలబద్దకాన్ని నివారించే ఆహారాలు..!

Pregnancy in itself is a phenomenon that changes the biology of a woman's body. Postpartum or postnatal care is of utmost importance. Postnatal constipation is quite common since the drugs used in labour can contribute to slow digestion. Exerting more pressure to pass out can be really painful during the postnatal stage.
Story first published: Monday, March 25, 2013, 13:30 [IST]
Desktop Bottom Promotion