For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిజేరియన్ తరువాత చెయ్యాల్సిన, చెయ్యకూడని 12 పనులు

By Sindhu
|

డెలివరీ సహజంగా అయితే శిశువు జననం తేలిక, సురక్షితం. సిజేరియన్ కంటే కూడా సహజ జననంలో మహిళలు త్వరగా తమ పూర్వపు శారీరక రూపం పొందగలరని డాక్టర్లు కూడా చెపుతారు.

సిజేరియన్ ఆపరేషన్ ప్రభావం స్త్రీలందరిలో ఒకేలాగ ఉండదు. అందువల్ల వారు కోలుకోవడానికి పట్టే సమయం కూడా వేరు వేరుగా ఉంటుంది.

సిజేరియన్ ఆపరేషన్ అయ్యాకా చెయ్యాల్సిన చెయ్యంకూడనివేమిటో చూద్దామా.

12 Important Dos and Don’ts After your Caesarean: Pregnancy Tips in Telugu
నెప్పి:

నెప్పి:

సరైన నెప్పి తగ్గించే మందులు(పెయిన్ కిల్లర్స్ )ఇవ్వకపోతే సిజేరియన్ ఆపరేషన్ తరువాతా నెప్పి వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ నెప్పి వస్తోంటే మీకు ఆ మందులు ఇచ్చారో లేదో కనుక్కోండి.

ఎపీడ్యూరల్

ఎపీడ్యూరల్

ఎపీడ్యూరల్(వెన్ను కి ఇచ్చే మత్తు మందు) ఇచ్చాకా ఎప్పుడు కదలచ్చో మీ నర్సు ని అడగండి.మీకు దగ్గు వచ్చినప్పుడు ఆపరేషన్ అయిన భాగాన్ని ఎలా పట్టుకుని తగ్గితే మీకు నెప్పి పెద్దగా తెలీదో చెప్తారు.

MOST READ:ఇతర నూనెల కంటే వేరుశెనగ నూనెలో గొప్ప ప్రయోజనాలు...

నడక:

నడక:

సిజేరియన్ అయాకా అటూ ఇటూ తిరగడం కష్టమే. అలా అని అస్సలు నడవడం మానద్దు. కాస్త దూరమైనా సరే ప్రయత్నించండి.మీరు ఎంత నడిస్తే

రక్త ప్రసరణ అంత బాగా జరిగి రక్తం గడ్డ కట్టే అవకాశం ఉండదు.

పిల్లలకి పాలు పట్టడం

పిల్లలకి పాలు పట్టడం

ప్రసవం తరువాత ఎంత త్వరగా పిలల్లకి స్తన్యం ఇస్తే అంత త్వరగా గర్భాశయం కుంచిస్తుంది.సిజేరియన్ ఆపరేషన్ అయినవాళ్ళు స్తన్యం ఇవ్వాలంటే పక్కకి తిరిగి పడుకోవడం, లేదా నర్సింగ్ కుషన్ పెట్టుకుని కూర్చోడం లాంటి భంగిమలు శ్రేష్టం.

బట్టలు

బట్టలు

సిజేరియన్ తరువాతా అనువైన బట్తలు ధరించండి.దీని వల్ల ఆపరేషన్ జరిగిన భాగం ఒరుసుకుపోకుండా ఉంటుంది.

.బెల్టు

.బెల్టు

సిజేరియన్ ఆపరేషన్ అయ్యాకా మీ పొట్ట చుట్టూ కొన్ని నెలలపాటు బెల్టు ఉపయోగించండి.దీనివల్ల మీరు అటూ ఇటూ కదిలినప్పుడు మీ సిజేరియన్ గాయం చీలకుండా ఉంటుంది.పైగా ఆపరేషన్ తరువాత పొట్ట సాగడాన్ని కూడా నివారిస్తుంది ఈ బెల్టు.

ఇంట్లో పనులు

ఇంట్లో పనులు

సిజేరియన్ ఆపరేషన్ తరువాత కోలుకోవడానికి కనీసం ఆరు వారాలు పడుతుంది. అందువల్ల పెద్ద పెద్ద బరువులెత్తడం లేదా ఇంటి పనులు లాంటివి చెయ్యకండి. ఇవి మీ ఆపరేషన్ గాయం మీద ఒత్తిడిని పెంచుతాయి. ఒకవేళ ఇంట్లో కాస్త పెద్ద పిల్లలుంటే మీరు పెద్దవారి సాయం తీసుకోండి. పిల్లల్ని ఎత్తుకోవడం లాంటివి కూడా మీ గాయాన్ని బాగా ప్రభావితం చేస్తాయి.

వ్యాయామం

వ్యాయామం

సిజేరియన్ ఆపరేషన్ అయ్యాకా మీలో మార్పు రావడం సహజం.మీరు మీ పూర్వ రూపుని సంతరించుకోవాలంటే వ్యాయామమే సరైన మార్గం.అలా అని వెంటనే జిమ్ము కి పరిగెత్తకండి.మొట్టమొదట చిన్న చిన్న కదలికలతో మొదలుపెట్టండి. ఊయలలో కాళ్ళు కదుపుతూ మెల్లిగా ఊగడం లాంటివన్నమాట.

MOST READ:అధిక బరువును తగ్గించే టాప్ 25 వెజిటేరియన్ ఫుడ్స్

సంభోగం

సంభోగం

మీ ఆపరేషన్ అయిన వెంటనే కలయిక లో పాల్గూనద్దు.మీ డాక్టరు ని కలిసి సలహా తీసుకుని మీరు మానసికం గా శారీరకంగా సిద్ధమయ్యాకే మీ భాగస్వామితో కలవండి. కావాలంటే మీ వారితో మనసువిప్పి మాట్లాడండి.

ఆహారం

ఆహారం

సిజేరియన్ అయిన తొలి రోజుల్లో నూనె పదార్ధాలు,కార్బోనేటెద్ పానీయాలు లేదా తింతే కడుపులో మందం గా అనిపించే పదార్ధాలకి దూరం గా ఉండడి.మీ అవయవాలన్నీ ఇంకా సున్నితం గా ఉన్నాయని పూర్తిగా కోలుకోలేదని గుర్తించండి.

డ్రైవింగ్

డ్రైవింగ్

మీరు కోలుకోవడానికి ఆరు వారాలు పడుతుందని ఈ ఆరు వారాలూ డ్రవింగ్ కి దూరమవ్వక్కర్లేదు.కానీ కొద్దిగా నెప్పి ఉంతే బహూశా మీరు డ్రైవింగ్ చెయ్యలేక పోవచ్చు.డ్రైవింగ్ లో అకస్మాత్తుగా వచ్చే కుదుపులు లేదా అకస్మాత్తుగా వేసే బ్రేకుల వల్ల మీరు గాయపడే అవకాశం ఉంది.అందువల్ల మీ డాక్టర్ ఓకే చెప్తేనే డ్రవింగ్ మొదలు పెట్టండి.

.డిప్రెషన్

.డిప్రెషన్

సిజేరియన్ అయ్యాకా డిప్రెషన్ మామూలే.మీకు కనుక మీ మనసు చిరాకుగా ఉంటే మీ డాకటరు లేదా మీ మనసుకి బాగా దగ్గరైన వారితో మాట్లాడండి.వారు ఏమనుకుంటారో అన్న సంకోచం తో మీ భావాలని దాచుకోక్కరలేదు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీ మొదటి బిడ్డ సిజేరియన్ ద్వారా పుడితే రెండో కానుపు కూడా సిజేరియనే అవ్వాలన్న నియమమేమీ లేదు ఈరోజుల్లో.అందువల్ల మీ డాక్టర్ తో మాట్లాడి కానుపు విషయం లో ఓ నిర్ణయం తీసుకోండి. గమనిక-పైన పేర్కొన్నదంతా పాఠకుల సమాచారం కోసం మాత్రమే.ఏమైనా సందేహాలుంటే మీ డాక్టరు ని సంప్రదించండి.

English summary

12 Important Dos and Don’ts After your Caesarean: Pregnancy Tips in Telugu

DeliveryThe effects of a c-section vary from one woman to the other and so does the recovery time. Here are some important dos and don’ts for you if you have just delivered a baby through caesarean.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more