For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ ను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

స్ట్రెచ్ మార్క్స్ నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తాయి. వీటిలో హానికరమైన కెమికల్స్ ఉండవు. బాడీలో స్ట్రెచ్ మార్క్స్ నివారించ

|

మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ అతి పెద్ద సమస్య. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రసవించిన తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది. ప్రసవించిన తర్వాత చర్మం సాగటం వల్ల స్ట్రెచ్ మార్క్స్ కనబడుతాయి.

బాడీలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుటకు వివిధ రకాల కారణాలున్నాయి. అందులో ఒకటి హార్మోనుల్లో మార్పులు, గర్భధారణ సమయంలో బెలీ వల్ల వచ్చే స్ట్రెచ్ మార్క్స్, ఎక్సెస్ వెయిట్ లాస్, లేదా వెయిట్ గెయిన్ వల్ల కూడా బాడీలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పుడుతాయి.

How To Treat Pregnancy Stretch Marks

కారణం ఏదైనా స్ట్రెచ్ మార్క్ శరీరం మీద చాలా ఇబ్బందికరంగా, అసహ్యంగా కబడుతుంటాయి. వీటిని తొలగించుకోవడం మంచిది. అందుకు కొంత శ్రమ మరియు ఓపిక , శ్రద్దపెడితే తప్పనిసరిగా ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ అయినా తొలగిపోతాయి.

స్ట్రెచ్ మార్క్స్ నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తాయి. వీటిలో హానికరమైన కెమికల్స్ ఉండవు. బాడీలో స్ట్రెచ్ మార్క్స్ నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

ఆముదం నూనె:

ఆముదం నూనె:

స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో ఆముదం నూనెను అప్లై చేయడం వల్ల చాలా సులభంగా స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి. స్ట్రెచ్ మార్క్స్ మీద ఆముదం నూనెను అప్లై చేసిన తర్వాత ఒక బాటిల్లో గోరువెచ్చని నీళ్ళు పోసి పొట్ట మీద అరగంట పాటు రోల్ చేయాలి. తర్వాత రిలాక్స్ అవ్వాలి. హాట్ వాటర్ మసాజ్ వాల్ల చర్మ రంద్రాలు తెరచుకుంటాయి. ఆయిల్ చర్మంలోకి బాగా ఇంకుతుంది. దాంతో ఫలితాలు ఎఫెక్టివ్ గా ఉంటాయి.

 పొటాటో జ్యూస్ :

పొటాటో జ్యూస్ :

స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడంలో పొటాటో జ్యూస్ ఒకటి. పొటాటోను చిన్న ముక్కలుగా కట్ చేసి, జ్యూసర్ లో వేసి రసం తియ్యాలి. ఈ రసాన్ని స్ట్రెచ్ మార్క్స్ మీద అప్లై చేయాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అప్లై చేసిన అరగంట తర్వాత స్నానం చేసుకోవచ్చు. లేదా తడిబట్టతో క్లీన్ చేసుకోవచ్చు.

విటమిన్ సి:

విటమిన్ సి:

విటమిన్ సి శరీరానికి అత్యవసరమైన పోషకాలలో ఒకటి విటమిన్ సి. విటమిన్ సి చర్మానికి కావల్సిన కొల్లాజెన్ మరియు సెల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. అలాగే రెడ్ అండ్ గ్రీన్ బెల్ పెప్పర్ ను , జామకాయ, కేల, పార్ల్సే, టర్నిప్స్, బ్రొకోలి వంటివి రెగ్యులర్ డైట్ లోతప్పనిసరిగా చేర్చుకోవాలి.

. షీబట్టర్ లేదా కోక బట్టర్ :

. షీబట్టర్ లేదా కోక బట్టర్ :

షీ బట్టర్ లేదా కోక బట్ట, రెండూ బెస్ట్ బట్టర్ . ఇవి స్ట్రెచ్ మార్క్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది కోక బీన్ నుండి తయారుచేస్తారు. షీ బట్టర్ ను కరెటే ట్రీ నుండి తయారుచేస్తారు. ఈ రెండింటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కొల్లాజెన్ ప్రొడక్షన్ కు సహాయపడుతుంది. చర్మంలో స్ట్రెచ్ మార్క్స్ ను త్వరగా మరియు ఫాస్ట్ గా నయం చేస్తుంది. చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. చర్మానికి తగిన తేమను అందిస్తుంది.

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ :

స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించడంలో ఎగ్ వైట్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మానికి రిజివేట్ చేస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడం మాత్రమే కాదు, చర్మం ఫ్రెష్ గా అందంగా కనబడేందుకు సహాయపడుతుంది. ఎగ్ బ్రేక్ చేసి, అందులోని వైట్ ను తీసుకోవాలి. ఎగ్ వైట్ కు కొద్దిగా నిమ్మరసం జోడించి బాగా మిక్స్ చేసి స్ట్రెచ్ మార్క్స్ మీద అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత ఎగ్ వైట్ పూర్తిగా డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుబ్రం చేసుకోవాలి.

అలోవెర:

అలోవెర:

అలోవెరలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది చర్మంను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది.ఫ్రెష్ అలోవెర జెల్ ను నేరుగా చర్మానికి అప్లై చేయాలి. నేచురల్ గా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

తేనె:

తేనె:

తేనెలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు,స్ట్రెచ్ మార్క్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. తేనెను నేరుగా ప్రభావితం ప్రాంతంలో అప్లై చేయాలి. కొద్దిగా తేనెను అప్లై చేసిన తర్వాత దాని మీద 20-30 నిముషాల పాటు వార్మ్ క్లాత్ ను కప్పాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తుడిచేసుకోవాలి. స్ట్రెచ్ మార్క్స్ మరింత ఎఫెక్టివ్ గా ..త్వరగా తగ్గాలంటే అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి.

English summary

How To Treat Pregnancy Stretch Marks

There are several causes that can lead to stretch marks on the skin and few among them are hormonal changes, stretching of the belly during pregnancy, excessive weight loss/gain etc. Read on...
Desktop Bottom Promotion