For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెలివరీ తర్వాత మహిళల శరీరంలో జరిగే ఆశ్చర్యకర మార్పులు..!

మీ శరీరంలో కూడా కొత్త మార్పులు ఎక్స్ పీరియన్స్ చేస్తారు. మీ శరీరం రికవర్ అవడానికి సమయం పట్టడమే కాకుండా.. కొత్త మార్పులు మీకు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తాయి.

By Swathi
|

ప్రెగ్నన్సీ టైంలో మహిళల శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి. అలాగే.. ప్రెగ్నన్సీ తర్వాత.. అద్భుతమైన గిఫ్ట్ మీ చేతుల్లోకి వస్తుంది. అప్పుడే.. మిరాకిల్ లా అనిపిస్తుంది. ఆ అనుభూతి, అనుభవం చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.

body changes

అయితే శరీరంలో మార్పులు కూడా అప్పుడే మొదలవుతాయి. అప్పుడే పుట్టిన మీ బిడ్డను ఎలా సంరక్షించుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి అనేదానిపై చాలా కీలకంగా వ్యవహరించాలి. మొదటి కొన్ని వారాలు.. ఎక్కువ సమయాన్ని పాలు ఇవ్వడానికే గడుపుతారు. డైపర్ మార్చడం వంటి పనుల్లో నిమగ్నమవుతారు.

అలాగే.. బేబీకి మీ మధ్య ఎమోషనల్ బాండ్ ఏర్పరచుకోవాలి. కానీ.. అలాగే మీ శరీరంలో కూడా కొత్త మార్పులు ఎక్స్ పీరియన్స్ చేస్తారు. మీ శరీరం రికవర్ అవడానికి సమయం పట్టడమే కాకుండా.. కొత్త మార్పులు మీకు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తాయి. మరి.. డెలివరీ తర్వాత మహిళల శరీరంలో జరిగే షాకింగ్ మార్పులేంటో చూద్దాం..

మూడ్ లో మార్పులు

మూడ్ లో మార్పులు

డెలివరీ తర్వాత 60 నుంచి 80 శాతం మహిళలు.. డిప్రెషన్ తో బాధపడతారు. మూడ్ లో మార్పులు రావడం, ఫీలింగ్స్ కోల్పోవడం, చిరాకు, ఆందోళన, కోపం, నిద్రలేమి వంటి రకరకాల సమస్యలు ఫేస్ చేస్తారు.

పెయిన్స్

పెయిన్స్

నార్మల్ డెలివరి సమయంలో.. బాగా ఒత్తిడి వల్ల.. చాలా నొప్పి ఉంటుంది. అలసట ఉంటుంది. పక్కటెముకలు, పొట్ట, వెన్నెముకలో.. చాలా నొప్పులను మహిళలు ఫేస్ చేస్తారు.

బ్రెస్ట్ పెయిన్

బ్రెస్ట్ పెయిన్

కొత్తగా తల్లైన మహిళలందరూ ఫేస్ చేసే ఆశ్చర్యకర సమస్యల్లో బ్రెస్ట్ పెయిన్ కూడా ఒకటి. బ్రెస్ట్ లో పాలు ఏర్పడటం వల్ల.. అవి హాట్ గా, నొప్పిగా, వాచినట్టు, సున్నితంగా మారతాయి.

వాజినాలో డ్రైనెస్

వాజినాలో డ్రైనెస్

చాలామంది మహిళలు.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. వాజినల్ డ్రైగా మారుతుంది. ఈ సమస్య చాలామంది మహిళలు.. ప్రెగ్నన్సీ టైంలో కూడా ఫేస్ చేస్తారు.

వాజినల్ బ్లీడింగ్

వాజినల్ బ్లీడింగ్

డెలివరీ తర్వాత.. చాలామంది మహిళలు ఫేస్ చేసే సమస్యల్లో వాజినల్ బ్లీడింగ్ ఒకటి. బ్లడ్ క్లాట్స్ మాదిరిగా ఏర్పడి.. బ్లీడింగ్ అవుతుంది. దీనివల్ల చాలా పెయిన్ ఉంటుంది.

బెల్లీ

బెల్లీ

బిడ్డ పుట్టిన తర్వాత.. పొట్ట మాత్రం ఫ్లాట్ అవుతుందనేది అపోహ మాత్రమే. డెలివరీ తర్వాత.. మహిళలు.. కొంత రౌండ్ బెల్లీని కలిగి ఉంటారు. ప్రెగ్నన్సీటైంలో పొట్ట, గర్భాశయం కొన్నినెలల పాటు స్ట్రెచ్ అయి ఉంటాయి. మళ్లీ ఇవి సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది.

సెక్స్ పై ఆసక్తి కోల్పోవడం

సెక్స్ పై ఆసక్తి కోల్పోవడం

బిడ్డ పుట్టిన తర్వాత మహిళ శరీరం రికవర్ అవ్వడానికి కొద్దిగా సమయం పడుతుంది. కాబట్టి, ప్రసవం తర్వాత కొన్ని రోజులు ఆమె సెక్సువల్ ఇంటర్ కోర్సు ఇష్టపడదు.

జుట్టు రాలడం

జుట్టు రాలడం

డెలివరీ తర్వాత.. చాలా జుట్టు రాలిపోతుంది. ఇది సాధారణంగా కనిపించే మార్పు. ప్రెగ్నన్సీ టైంలో.. చాలామంది మహిళల్లో హార్మోనల్ చేంజెస్ కారణంగా.. ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. డెలివరీ తర్వాత ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గిపోయి.. జుట్టు రాలడానికి కారణమవుతుంది.

కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

ప్రెగ్నన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ డెలివరీ తర్వాత కూడా.. ఉంటాయి. దీనివల్ల.. కాన్ట్సిపేషన్ సమస్య వస్తుంది. జీర్ణక్రియలో సమస్యలు రావడం వల్ల ఎక్కువగా కాన్ట్సిపేషన్ సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

రాత్రిళ్లు చెమట

రాత్రిళ్లు చెమట

శరీరంలో హఠాత్తుగా ఈస్ట్రోజెన్ లెవెల్ మార్పులు జరగడం వల్ల.. రాత్రిళ్లు శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వస్తుంటాయి. రాత్రిపూట ఎక్కువగా చెమట పట్టడం అనేది.. చాలా కామన్.

థైరాయిడ్స్

థైరాయిడ్స్

డెలివరీ తర్వాత.. థైరాయిడ్ గ్లాండ్ లో ఇన్ల్ఫమేషన్ వస్తుంది. దీనివల్ల 5 నుంచి 10 శాతం మహిళలు.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. థైరాయిడ్ సమస్యను ఫేస్ చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

తరచూ అలసట

తరచూ అలసట

కొత్తగా తల్లైన వాళ్లు అప్పుడే పుట్టిన బేబీ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఆమె వివిధ రకాలుగా పనిచేయాల్సి ఉంటుంది. దాంతో ఆమె ఎక్కువ అలసిపోతుంది. బేబీ ఏడ్చినప్పుడతంతా పాలు పట్టడం, రాత్రుల్లో అదనపు గంటలు నిద్రమేలుకోవడం వల్ల తల్లిలో అలసట వస్తుంది.

ఆకలి ఎక్కువగా ఉండటం

ఆకలి ఎక్కువగా ఉండటం

హార్మోనులు అసమతౌల్యత వల్ల, బేబీ ఫీడింగ్ వల్ల తల్లిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో హెల్తీ డైట్ తీసుకోవడం చాలా అసవరం.

English summary

Shocking Things that Happen to Your Body after Giving Birth

Shocking Things that Happen to Your Body after Giving Birth. During pregnancy, a woman’s body goes through lot of changes. Although the pregnancy is over and you’ve got the gift of a living.
Desktop Bottom Promotion