ఈ 7 కారణాల వల్లే తల్లిపాలలో రక్తం రావచ్చు..?

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

పిల్లలకు తల్లిపాలు చాలా మంచివి. ఇవి పిల్లల ఎదుగుదలకు కావాల్సిన అన్ని పోషకాలను అందిస్తాయి. కానీ, రోమ్ముపాలలో ఉపయోగంలేనివాటిని కూడా మీరు గుర్తించే కొన్ని సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్ధితులలో ఒకటి రొమ్ముపాలలో రక్తం కనిపించడం.

ఈ అనుభవంతో మీరు ఎక్కువగా బాధపడకండి. బిడ్డకు జన్మనిచ్చిన చాలామంది స్త్రీలలో ఇది చాలా సహజంగా కనిపిస్తుంది. సాధారణంగా, పాలలో రక్తం కొన్నిసార్లు తెలీకుండానే వెళ్ళిపోతుంది, అది అతి తక్కువ మొత్తంలో రావొచ్చు.

కొన్నిసార్లు రొమ్ముపాలు గులాబి, ఆరంజ్, ఎరుపు, ఊదా రంగులో కూడా మారడం చూడొచ్చు. ఆ రంగులో మార్పు అనేది పిల్లాడు రక్తాన్ని బైటికి ఉమ్మినపుడు లేదా పాలు బైటికి కారినపుడు మాత్రమే మనం గుర్తించగలము. ఆ సమయంలో, మీరు భయపడవచ్చు, కానీ మీరు కంగారు పడకండి ఇది చాలా సాధారణం.

మీ పిల్లాడి రక్షణకు మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. చాలా కేసులలో, మీరు తల్లిపాలను కొనసాగించవచ్చు.

సరైన రోగనిర్ధారణ మూలకారణం చికిత్సకు సహాయపడుతుంది కూడా, అది మీకు చాలా సౌకర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ, ఈ ఆర్టికిల్ లో, రొమ్ముపాలలో కనిపించిన రక్తానికి అవకాశం ఉండే 7 కారణాలను ఇక్కడ చూడవచ్చు:

చనుమొనలు పగలడం

చనుమొనలు పగలడం

చనుమొనలు పగలడం లేదా చనుమోనలలో పుండు వల్ల రొమ్ముపాలలో రక్తం రావడానికి కారణం కావొచ్చు. చనుమొనలు ఎలా పగులుతాయి? సాధారణంగా రొమ్ముపాలు తల్లి, బిడ్డ ఇద్దరికీ అసౌకర్యంగా ఉండదు. కానీ, బిడ్డ సరిగా పట్టుకోకపోతే, చనుమొనలు పగిలి, నొప్పులు వస్తాయి, కొన్ని సందర్భాలలో రక్తానికి ఇదే కారణం కావొచ్చు.

రస్టీ పైప్ సిండ్రోమ్

రస్టీ పైప్ సిండ్రోమ్

పేరుకు తగ్గట్లుగా, రస్టీ పైప్ నుండి వచ్చే నీరు రంగు మారడంలా ఉంటుంది. అదేవిధంగా, పాల రంగు బ్రౌన్ లేదా ఎరుపు రంగులోకి మారతాయి. పాలు కారినపుడు లేదా మీ బిడ్డ రక్తంతో కూడిన పాలను బైటికి పంపినపుడు మాత్రమే అది మనం గమనిస్తాము. అది కొన్నిరోజులలో తగ్గిపోతుంది, ఇది సాధారణంగా మొదటి డెలివరీ సమయంలో జరుగుతుంది.

పగిలిన లేదా పాడైన క్యాపిల్లరీలు

పగిలిన లేదా పాడైన క్యాపిల్లరీలు

కొన్నిసార్లు, రొమ్ములో ఉండే చిన్న నాళాలు దెబ్బతినోచ్చు లేదా పగలోచ్చు. సాధారణంగా, ఇది పాలు ఇచ్చే సమయంలో జరుగుతుంది. ఎక్స్ప్రేసింగ్ మిల్క్ అంటే పాలు తాగించకుండా పాలు తీయడం లేదా చేత్తో పాలు పిండడం వంటివి. కాబట్టి, పాలు పిండే సమయంలో రక్త నాళాలు దెబ్బతినకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

అంతర్గత పులిపిరిలు

అంతర్గత పులిపిరిలు

కొంతమంది స్త్రీలు పాల నాళాల కింద నిరపాయమైన కణితిలను కలిగి ఉంటారు. దీనివల్ల రక్తస్రావం కావొచ్చు, రొమ్ముపాలలో రక్తం ప్రవహించవచ్చు. సాధారణంగా, చనుమొనలు లేదా దాని పక్కన చిన్నచిన్న గడ్డల పెరుగుదల ఉంటుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించి అవి ప్రాణాంతకం కావని నిర్ధారించుకోండి.

మస్తిటిస్

మస్తిటిస్

మస్తిటిస్ అనేది పాలిచ్చే సమయంలో వచ్చే సాధారణ రకమైన రొమ్ము ఇన్ఫెక్షన్. ఇది పాలు ఇవ్వకపోయినా లేదా సరిగా పాలు తాగానపుడు జరుగుతుంది. ఉద్యోగం చేసే స్త్రీలు సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంటారు. అలాంటి కేసులలో, మీరు పాలు ఇచ్చేటపుడు రక్తంతో కలుషితమైన పాలను మీరు గుర్తించవచ్చు.

ఫైబ్రోసిస్టిక్ రొమ్ము

ఫైబ్రోసిస్టిక్ రొమ్ము

30 సంవత్సరాలు పైబడిన స్త్రీలలో ఇది సాధారణంగా కనపడుతుంది. ఇది ఒకటి లేదా రెండు రొమ్ముల్లో ఉండొచ్చు. కాబట్టి, 30 సంవత్సరాలు పైబడిన తరువాత బిడ్డకు జన్మనిచ్చే స్త్రీల రొమ్ముపాలు రక్తంతో కలుషితమై ఉంటుంది. వైద్యుడిని సంప్రదించడం మంచిది.

చనుమొనలు వంపుతిరిగే వ్యాధి

చనుమొనలు వంపుతిరిగే వ్యాధి

రొమ్ము లేదా చనుమోనలలో వంపుతిరిగే వ్యాధి అనేది కేవలం 2 శాతం మందిలో మాత్రమే కనిపించే అత్యంత సాధారణ వైద్య పరిస్ధితి. ఇలాంటి పరిస్ధితులలో, పాలు రక్తంతో కలుషితమవుతాయి. ఇదిచాలా అరుదైన పరిస్ధితి.

రక్తంతో కలిసిన రోమ్ముపాలకు ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి, మీరు ఈ పరిస్ధితితో అసౌకర్యంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి దీని గుర్తించి నిర్దారించుకోండి.

English summary

7 Reasons For Blood In Breast Milk

It is seen that the shades of breast milk sometimes vary from pink, orange, red and even brown. The change in the colour can be noticed only if you pump milk or the child spits blood. At that moment, you may get scared, but just relax it is very usual.
Story first published: Wednesday, June 14, 2017, 14:40 [IST]
Subscribe Newsletter