For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  చంటిపిల్లల్లో ప్రమాదవశాత్తూ విషప్రయోగాన్ని నివారించటం ఎలా

  By Deepthi T A S
  |

  పసిపిల్లలు మరియు చంటిపిల్లలు ఏదిపడితే అది నోటిలో పెట్టేసుకుంటారు.అది వారిలో సహజంగా ఉండే అసంకల్పిత చర్య వలన ఇలా జరుగుతుంది. ఇలా చేయటం వలన వారు తమ చుట్టూ ప్రపంచాన్ని ఫీల్ అవగలరు మరియు అర్థం చేసుకోగలుగుతారు.

  చూడటం, వినటం, ముట్టుకోవడం, ఫీలవడమేకాక రుచి చూసే ముఖ్యపద్ధతిలో కూడా ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది అవాంఛిత సంఘటనలు, ప్రమాదాలకి దారితీయవచ్చు. ఒక సర్వేలో తేలిందేమిటంటే చాలా మంది చంటిపిల్లలు అనుకోకుండా ప్రతిఏడాది ఇలా విషవస్తువుల బారిన ప్రమాదవశాత్తూ పడి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.

  accidental poisoning in childhood

  పిల్లలకి తమ రోజువారీ జీవితంలో అనేక రకాల వస్తువులను ఏదోఒకరకంగా తెలుసుకుంటూ ఉంటారు. ఇది ఇంట్లోనే కావచ్చు, తోట లేదా బయటకి వెళ్ళినపుడు ఎక్కడైనా కూడా కావచ్చు. విషపదార్థాలు అన్నిచోట్లా ఉంటాయి.

  తల్లిదండ్రులు ఈ రకంగా ప్రమాదవశాత్తూ పిల్లలు విషపదార్థాల బారిన పడకుండా వారిని దూరంగా ఉంచటమో లేదా వాటిని దూరంగా ఉంచటమో చేయవచ్చు. కానీ చాలాసార్లు ఈ వ్యూహం పనిచేయకపోవచ్చు. చాలాసార్లు మనం దీన్ని ఆపలేం కూడా.

  అందుకని, తల్లిదండ్రులకి నివారణ పద్ధతులు, విషప్రయోగం జరిగినప్పుడు దాని లక్షణాలు, ప్రమాదవశాత్తూ అలా జరిగితే ఏం చేయాలో తెలిసివుండాలి.

  ఈరోజు మనం ప్రమాదవశాత్తూ విషపదార్థాల ప్రభావం పడినప్పుడు లక్షణాలు, ఆ సమయంలో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసుకుందాం. వీటిని వీలైతే ఎలా నివారించవచ్చో కూడా చూద్దాం. అందుకని తెలుసుకోటానికి ఇది మొత్తం చదవండి.

  accidental poisoning in childhood

  1. ప్రమాదవశాత్తూ విషప్రభావానికి కారణమయ్యే వస్తువులు

  • ఇంటిని శుభ్రపర్చుకునే ఉత్పత్తులు
  • కాస్మెటిక్స్ మరియు మేకప్
  • మందులు మరియు ఇతర రకాల ట్యాబ్లెట్లు
  • పెయింట్
  • క్రిమిసంహారకాలు
  • సుగంధ్య ద్రవ్యనూనెలు
  • డియోడెరెంట్లు
  • బాత్ రూం సామాను ఆఫ్టర్ షేవ్ మరియు ఫర్ఫ్యూమ్స్
  accidental poisoning in childhood

  2. విషప్రయోగ లక్షణాలను గుర్తించడం

  మీ బిడ్డ హఠాత్తుగా అనారోగ్యం పాలైతే, ప్రమాదవశాత్తూ విషపదార్థాల జోలికి వెళ్ళాడేమో అని అనుమానించండి. ఏదన్నా విషపదార్థం తినేసాడేమో అన్పిస్తే ఈ కింది లక్షణాలను గమనించండి.

  • వాంతులు
  • లూజు విరేచనాలు/డయేరియా
  • అసాధారణ నిద్రమత్తు
  • కడుపులో నొప్పి
  • మీ బిడ్డ నోటిచుట్టూ మంట
  • వణుకు లేదా జ్వరం
  • తలనొప్పి
  • చిరాకు
  • శ్వాసలో బాధలు
  • ఆకలి లేకపోవటం
  • ఆహారం మింగటంలో సమస్యలు
  • చొంగ కారటం
  • చర్మంపై ర్యాషెస్
  • సీజర్స్
  • చర్మం మరియు పెదవులు నీలంగా మారటం
  accidental poisoning in childhood

  3...ప్రమాదవశాత్తూ విషప్రయోగం జరిగితే ఏం చేయాలి?

  మీ బిడ్డలో పైన చెప్పిన లక్షణాలలో కొన్ని కానీ, మొత్తం కానీ కన్పిస్తే, మీరు వెంటనే ఈ కింది స్టెప్స్ అనుసరించండి.

  • మీ బిడ్డ మింగేసిన ఆ పదార్థం ఏదో ముందు కనుగొనటానికి ప్రయత్నించండి. అలాగే అది ఎంత పరిమాణంలో తీసుకున్నాడో కూడా తెలుసుకోటానికి ప్రయత్నించండి.
  • బేబీని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళండి.
  • మీ బేబి తిన్న పదార్థం ఏంటో తెలిస్తే నమూనా కొంచెం తీసుకొని వెళ్ళండి. ఆ డబ్బాను కూడా వైద్యుడి వద్దకు తీసుకెళ్తే మంచిది. దీనితో డాక్టర్ సరైన చికిత్స అందించగలరు.
  • మీకు తెలిస్తే వైద్యుడికి సరిగ్గా ఎప్పుడు మీ బిడ్డ తిన్నాడో తెలియచేయండి.
  accidental poisoning in childhood

  4. ప్రమాదవశాత్తూ విషపదార్థాలు తినటం ఎలా నివారించవచ్చు?

  • మీ ఇంటిని ఒకసారి జల్లెడ పట్టండి. అస్సలు అవసరం లేని విషపదార్థాలు బయటపడేయండి. విషపదార్థాలు ఎప్పుడూ మూసి, లాక్ చేసి ఉంచండి. ఎప్పుడూ వాటిని కప్ బోర్డ్స్ లో, డ్రాయర్ లలో లేదా డబ్బాలలో మూతవేసే విధంగా పెట్టండి.
  • చిన్నపిల్లలకై ప్రత్యేకంగా డిజైన్ చేసిన తాళాలు ఎప్పుడూ చిన్నపిల్లలు తెరవలేని విధంగా వుండవని గుర్తుంచుకోండి. చిన్నపిల్లలు సులభంగా దాన్ని తెరిచే పద్ధతి నేర్చేసుకుంటారు లేదా మీరు తెరుస్తున్నప్పుడు చూసేస్తారు. అందుకని రిస్క్ పదార్థాలన్నీ మీ బిడ్డకి తప్పక దూరంగా ఉంచండి.
  • మీ మందులని ఎప్పుడూ చిన్నపిల్లలకి అందేవిధంగా పెట్టకండి. టేబుళ్ల మీద, కౌంటర్ టాప్ పైన , మీ బ్యాగులు, పర్సులలో ఉంచడం కూడా సురక్షితం కాదు.
  • విషపదార్థాలైన డిటర్జెంట్లు, శుభ్రపర్చే వస్తువులైన సబ్బులాంటివి ఆహారపదార్థాలుంచే రకపు డబ్బాలలో ఉంచకండి. పిల్లలు అలాంటి విషపదార్థాలను కూడా ఆహరం అనుకుని తినేస్తారు.వీటిని వాటికి సంబంధించిన డబ్బాలలో ఉంచటమే మంచిది.
  accidental poisoning in childhood
  • ఎప్పుడూ పిల్లలు వేసుకోవాలని మందు తియ్యగా ఉందనో, అదో చాక్లెట్ అనో మభ్యపెట్టకండి. దాన్ని తర్వాత వారు మీకు తెలియకుండా వేసేసుకోవచ్చు.
  • మీ మందులను ఎప్పుడూ పిల్లల కళ్లలో పడకుండా వేసుకోండి. మీ బేబీ మీరేదో పదార్థం తింటున్నారని గమనిస్తే, వారు మిమ్మల్ని అనుకరించటానికి ప్రయత్నిస్తారు. మీరు మద్యం లేదా పొగ తాగినప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది.
  • అతిథులు వచ్చినపుడు, వారి హ్యాండ్ బ్యాగులను పిల్లలకి అందని విధంగా పెట్టమని కోరండి.
  • మీరు ఎవరింటికైనా వెళ్తే,మీ బిడ్డను గమనిస్తూ ఉండండి. మీ కోసం మీకు ఆతిథ్యం ఇచ్చేవారు వారి ఇంటిని పసిపిల్లలకి అనుగుణంగా మార్చుకోలేరు కదా! అందుకని, మీ పిల్లలు ఎప్పుడూ మీ కనుసన్నల్లోనే ఉండేట్లు చూసుకోండి.

  English summary

  Prevent Accidental Poisoning In Toddlers

  Babies and toddlers tend to put everything into their mouths. It is an inbuilt reflex that makes the babies and toddlers do this. But many babies fall prey to accidental poisoning every single year. Here are some tips to prevent accidental poisoning in childhood.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more