For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6నెలల పాటు కేవలం తల్లిపాల వలన లాభాలు

|

బిడ్డకి జన్మనివ్వటం ప్రపంచంలోనే అన్నిటికన్నా అందమైన విషయం. స్త్రీలకు ఈ అద్భుతమైన శక్తి ప్రత్యేకంగా ఇవ్వబడింది.ఎందుకంటే కేవలం స్త్రీలలోనే బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు వచ్చే నొప్పిని భరించేశక్తి ఉంటుంది.

కడుపుతో ఉన్న 9నెలల సమయంలో, మనకెంతో సంతోషాలని మోసుకొచ్చే పాపాయి కోసం ఎంతో ఎదురుచూస్తాం. బేబీ పుట్టాక తనకి అన్నీ మేటివే ఇవ్వాలని, అందరికన్నా ఎక్కువ సంరక్షించాలని మనకి మనం ప్రామిస్ చేసుకుంటాం.

బిడ్డకు పాలిస్తున్న సమయంలో వక్షోజాలకు ఏం జరుగుతుంది

పాపాయి వచ్చేముందే మనం వారికి బట్టలు,దుప్పట్లు, డైపర్లు,బొమ్మలు మరియు వారిని సౌకర్యంగా వుంచే అన్ని వస్తువులను ముందే తయారుచేసి ఉంచుకుంటాం. కానీ బేబీకి అన్నిటికన్నా ముఖ్యమైనది తల్లిప్రేమ మరియు తను పుట్టగానే తల్లి పోషణ.

పాపాయి సరిగా ఆరోగ్యంగా ఎదగటానికి పోషణ అత్యవసరం.పిండంగా కడుపులో పడినప్పటి నుంచి, పాపాయి తల్లి నుంచి కావాల్సిన అన్ని పోషకపదార్థాలను తీసుకుంటుంది. కానీ పుట్టిన తర్వాత, తల్లిగా మీరే బేబీకి సరైన పోషణ ఉండేట్లా చూసుకోవాలి, ముఖ్యంగా మొదటి ఆరునెలల్లో మరింత ఎక్కువ. మన ముందు తరాలవారు పాపాయిలకి అన్నిరకాల పోషణనందించే మార్గాన్ని అనుసరించేవారు –అదే తల్లిపాలు.

తల్లిపాలంటే పాపాయికి తల్లి తన స్తన్యం నుంచి పాలను ఆహారంగా పట్టడం. పిల్లలు పుట్టినవెంటనే స్తనాలలో పాలు స్రవించటం మొదలవుతుంది.ఇవి పాపాయికి చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఈ పాలలో బిడ్డ ఎదగటానికి, సహజంగా రోగనిరోధక వ్యవస్థ బలపడటానికి అవసరమయ్యే యాంటీబాడీస్ మరియు ఎంజైములు ఉంటాయి.

కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈకాలం మహిళలు మార్కెట్లో దొరికే కృత్రిమ పాల పదార్థాలను ఎంచుకుంటూ పిల్లలకి పాలివ్వడం మానేస్తున్నారు. దీనికి కూడా చాలా కారణాలుండవచ్చు. కానీ గుర్తుంచుకోండి ఈ ఫార్ములా పదార్థాలు ఎప్పటికీ తల్లిపాలలో సహజంగా ఉండే పోషకాలకు ప్రత్యామ్నాయం కాలేవు.

శిశువుకు పాలుపట్టించడానికి సులభ చిట్కాలు

పురుటి సమయంలో ఒక స్త్రీ చాలా సహిస్తుంది. తీవ్ర మానసిక ఆందోళనకి గురవుతారు కూడా, దీనికి నిపుణుడిని సంప్రదించటం మంచిది. చాలామంది కొత్తగా తల్లులయిన వారికి తమ పాపాయిలకి పాలివ్వడం కూడా చాలా నొప్పితో కూడిన వ్యవహారమనే అపార్థం ఉంటుంది.

అందుకే ఈ పద్ధతికే చాలా మంది దూరంగా ఉంటారు. తల్లిగా పాలివ్వటం చాలా సహజమైన ప్రక్రియ, ఇది తల్లులకు తమ బిడ్డలతో బంధం పెంచుకునే అవకాశంగా కూడా ఉపయోగపడుతుంది. మీకు కొంచెం అసౌకర్యంగా అన్పించవచ్చు కానీ మీ బిడ్డ ఆరోగ్యకర జీవితం కోసం మీరు ఈ కొంచెం వెల చెల్లించాల్సి ఉంటుంది.

మొదటిసారి తల్లిపాలిస్తుంటే ఈ కింది సమస్యలు ఎదుర్కోవచ్చు మరియు వాటి ఉపశమనంకి చిట్కాలు కూడా చదవండి.

1.వాచిన, సున్నితంగా ఉండే స్తనాలు

1.వాచిన, సున్నితంగా ఉండే స్తనాలు

మొదటిసారి తల్లిగా పాలిస్తున్నప్పుడు ఎదుర్కొనే చాలా సాధారణమైన సమస్య ఇది. మీ స్తనాలు వరుసగా పాలను స్రవిస్తుండటంతో, అవి మీ బేబీకి ఎక్కువయిపోతాయి. అదనంగా వచ్చే పాలను పిండి మీ బిడ్డకి తరచూ తాగిస్తుండండి. ఇది మీ నొప్పిని తగ్గిస్తుంది.

2.పాపాయి సౌకర్యంగా ఉండకపోవటం

2.పాపాయి సౌకర్యంగా ఉండకపోవటం

మీకు, మీ పాపాయికి సరైన పొజిషన్ ఏదో తెలుసుకోటానికి కొంత సమయం పట్టవచ్చు.సాధారణంగా, కొంచెం వాలి ఉన్న పొజిషన్ బాగా ఉంటుంది ఇద్దరికీ. పైగా, పాప మీ స్తనంకి సరిగ్గా, దగ్గరలో ఉండేట్లు చూసుకోండి. అప్పుడే సులభంగా తను పాలను పీల్చుకోగలదు.

3.నిపిల్స్ పై నొప్పిపుట్టే ప్రదేశాలు

3.నిపిల్స్ పై నొప్పిపుట్టే ప్రదేశాలు

మీ నిపిల్స్ పైన ఎర్రని మచ్చలు కన్పించినట్లయితే, అవి మూసుకుపోయిన పాలగ్రంథులు. ఇది పాడయిన నిపుల్ లేదా స్తనంకి వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. స్తనాలను తరచుగా మసాజ్ మరియు పాపకి తరచూ పాలివ్వడం చేస్తుండండి.ఇది మీకు ఉపశమనం అందిస్తుంది.

4.చివర్న తెల్ల మచ్చలతో పాలగ్రంథుల్లో అడ్డుపడటం

4.చివర్న తెల్ల మచ్చలతో పాలగ్రంథుల్లో అడ్డుపడటం

మీరు మొదటిసారి తల్లిపాలిస్తున్నప్పటికీ అంతకుముందే మీ నిపుల్స్ మూసుకుపోవచ్చు. పాలు స్రవిస్తుంటాయి కానీ మీ పాపాయికి సరిపోవు. అందుకని నిపుల్ ను మెల్లగా పిండితే అది తెరుచుకుంటుంది. ఇలా పాలు ఎండిపోయి, మీరు పాలివ్వటానికి ప్రయత్నించినప్పుడు కూడా జరుగుతుంది. మెల్లగా ఆ ప్రాంతాన్ని మసాజ్ చేసి, కొంచెం ఆలివ్ నూనె రాయండి.

మీ బిడ్డకి తల్లిపాలివ్వటం వల్ల లాభాలు

మీ పాపాయి అత్యుత్తమ పోషణ తల్లిపాల ద్వారా లభిస్తుంది, వైద్యులు మీ బిడ్డకి తల్లిపాలకి ఎంత లాభదాయకమో చెబుతూనే ఉంటారు. నిజానికి బిడ్డ పుట్టకముందే స్త్రీలను మొదటి ఆరునెలలు తప్పనిసరిగా తల్లిపాలివ్వమని సూచింఛటం జరుగుతుంది.

ప్రతి సంవత్సరం, మొదటి పుట్టినరోజుకి చేరకముందే చాలామంది పసిపిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఈ సంఖ్యని కేవలం తల్లిపాలతో ఎంతో తగ్గించవచ్చు.అందుకని, వైద్యులు, కనీసం మొదటి ఆరునెలలపాటయినా తల్లిపాల ప్రాముఖ్యతని నొక్కి వక్కాణిస్తున్నారు.

మొదటి ఆరునెలల పాటు కేవలం తల్లిపాలు తాగటం వలన మీ బిడ్డకి వచ్చే లాభాలను చూడండి ;

1.అత్యుత్తమ పోషణ

1.అత్యుత్తమ పోషణ

తల్లిపాలలో బేబీ ఎదగడానికి అవసరమైన ఆరు పోషక గ్రూపులు,అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి. తల్లిపాలిస్తున్నప్పుడు మరే పోషకపదార్థం ఇవ్వాలసిన అవసరం లేదు.కనీసం నీరు కూడా ప్రత్యేకంగా అవసరం లేదు.

2.ఆరోగ్యమైన బేబీలు

2.ఆరోగ్యమైన బేబీలు

తల్లిపాలు తాగిన పసిపిల్లలు తక్కువగా అనారోగ్యం పాలవుతారు.ఎందుకంటే తల్లిపాలలో యాంటీబాడీస్ ఉంటాయి, పైగా అవి సులభంగా అరిగిపోతాయి. బిడ్డలో కోలిక్ నొప్పి, అజీర్తి రాకుండా కూడా చేస్తుంది.

3.చిన్నతనపు వ్యాధులనుంచి రోగనిరోధక శక్తి

3.చిన్నతనపు వ్యాధులనుంచి రోగనిరోధక శక్తి

6నెలల పాటు బేబీలు కేవలం తల్లిపాలు తాగటం వలన, వారు అనేక జీవనశైలి వ్యాధులైన మధుమేహం, స్థూలకాయం, చిన్నతనపు క్యాన్సర్లు, ఛాతీ ఇన్ఫెక్షన్లు మరియు ఆస్తమా నుంచి నిరోధకశక్తి కలిగిఉంటారు.

4.అధిక ఐక్యూ

4.అధిక ఐక్యూ

ఇటీవల అధ్యయనాల ప్రకారం తల్లిపాలు తాగిన బేబీలు జీవితంలో అధిక ఐక్యూను పెంపొందించుకుంటారు. తల్లిపాలలోని పోషకాలు మెదడును చురుకుగా చేసి,విశ్లేషణా శక్తిని పెంచి పెద్దయ్యాక అధిక ఐక్యూ వచ్చేలా చేస్తుంది.

పాలివ్వడం కేవలం పిల్లలకే కాదు, తల్లి ఆరోగ్యానికి కూడా మంచిదే.పాలివ్వడం వలన తల్లుల ఆరోగ్యానికి వచ్చే లాభాలు కూడా చూడండి.

1.పాలివ్వడం వలన మానసిక వత్తిడి మరియు పురిటి తర్వాత వచ్చే డిప్రెషన్ స్థాయిలు తగ్గుతాయి.

1.పాలివ్వడం వలన మానసిక వత్తిడి మరియు పురిటి తర్వాత వచ్చే డిప్రెషన్ స్థాయిలు తగ్గుతాయి.

కొత్తగా తల్లయిన వారు పురిటి తర్వాత డిప్రెషన్ కు సాధారణంగా గురవుతారు. కానీ ఇది పాలివ్వడం వలన తగ్గుతుంది. ఎందుకంటే పాలిస్తున్నప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వలన మానసిక వత్తిడి తగ్గి, రిలాక్సవుతారు. అది వచ్చే పాలను మరింత పెంచుతుంది కూడా. అందుకే తల్లికి, బిడ్డకి ఇద్దరికీ లాభదాయకమే.

2.తల్లులలో కాన్సర్లను నివారిస్తుంది

2.తల్లులలో కాన్సర్లను నివారిస్తుంది

అనేక అధ్యయనాలు, పరిశోధనలు తేల్చింది ఒకటే, పాలిచ్చే తల్లులు భవిష్యత్తులో వచ్చే రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్లకి రోగనిరోధక శక్తిని కలిగివుంటారు. పాలివ్వడం వలన స్తన కణజాలంలో వచ్చే ఆకార మార్పులే దీనికి కారణం కావచ్చు.

3. బరువు తగ్గటంలో సాయపడుతుంది

3. బరువు తగ్గటంలో సాయపడుతుంది

కొత్తగా తల్లయిన వారు తమ ప్రెగ్నెన్సీ అధిక బరువును తగ్గించుకోటానికి పాలివ్వడంకన్నా సులభమైన మార్గం లేదు. ఎందుకంటే పాలిస్తే అది కొవ్వు పేరుకోకుండా చేస్తుంది.

4. మెరుగైన గుండె ఆరోగ్యం

4. మెరుగైన గుండె ఆరోగ్యం

పాలిచ్చే తల్లులకి మంచి హృదయ ఆరోగ్యం ఉంటుందని తెలుసుకున్నారు. ఎందుకంటే వారిలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. పైగా, పాలివ్వడం వలన రక్తనాళాలు గట్టిపడకుండా, వాటిల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా నివారిస్తుంది.

English summary

Benefits Of Exclusive Breastfeeding For 6 Months

Check out the benefits of exclusive breastfeeding for 6 months.