శిశువుకి పాలిచ్చే సమయంలో బ్రా వేసుకోవడం సురక్షితమేనా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

చాలా మంది మహిళలను వేధించే ప్రశ్న ఏమిటంటే " పాలు ఇచ్చే సమయంలో బ్రా వేసుకోవచ్చా ? " ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభతరంగా మనకు దొరుకుతుంది. వక్షోజాలకు సరిపడినంత మద్దతునిస్తూ, అదే సమయంలో బ్రా వల్ల వాటికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

పాలు ఇచ్చే సమయంలో బ్రా వేసుకోవడం సురక్షితమేనా ? సురక్షితమే కానీ, సాధారణంగా వేసుకునేవి వేసుకోకూడదు. ఎందుకంటే ఆ దశలో వక్షోజాల పరిమాణం కొద్దిగా పెరుగుతుంది. ఆ సమయంలో తలెత్తే కొన్ని చిన్న చిన్న సమస్యలు అధిగమించడానికి చాలా జాగ్రత్తగా సరైన బ్రా ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.

బిడ్డకు పాలిస్తున్న సమయంలో వక్షోజాలకు ఏం జరుగుతుంది

రోజంతా దానినినే వేసుకొనిఉండాల్సి ఉంటుంది గనుక, ఆ సమయంలో బ్రా ఎంచుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అటువంటి సందర్భాల్లో పొరపాటున గనుక బ్రా ను తప్పుగా ఎంచుకున్నట్లైతే, అది పాల ఉత్పత్తి పై ప్రభావం చూపుతుంది. దీంతో ఆ తల్లులు మరింత మానసిక వేదనకు, ఆందోళనకు గురౌతుంటారు.

మహిళలు ఎప్పుడైతే పిల్లలకు పాలు ఇచ్చే దశలో ఉంటారో అటువంటి సమయంలో వివిధ రకాలైన మంచి బ్రాలను ఎంచుకోవాలి. ఆలా గనుక చేస్తే పాల యొక్క ఉత్పత్తి పై ఎలాంటి ప్రభావం చూపించదు. అంతేకాకుండా పాల ఉత్పత్తి అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, అందుచేత కొన్ని ప్రత్యేకమైన బ్రా లను ఎంచుకొని వాడవలసి ఉంటుంది.

తల్లి, బేబీకి పాలను ఇచ్చే సమయంలో చేయకూడని కొన్ని పనులు!

నిపుణులు ఏమని చెబుతున్నారంటే :

నిపుణులు ఏమని చెబుతున్నారంటే :

పాలు ఇచ్చే తల్లులు ఎవరైతే ఉన్నారో, అటువంటి వారు బ్రా కు కింది భాగంలో వైరు లేదా బాగా బిగుతుగా ఉండే వాటిని అస్సలు ఎంచుకోకండి అని సలహా ఇస్తున్నారు. ఎందుకు ఇలా చేయాలి అని మీరు ఆశ్చర్యపోతున్నారా?పాలు ఇచ్చే సమయంలో వక్షోజాలు సాధారణంగా కొద్దిగా మృదువుగా మారుతాయి. అటువంటి సమయాలలో కొన్ని రకాలైన బ్రాలు, కొన్ని చిత్రమైన సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అందుచేత అటువంటి వాటిని కనీసం పాలు ఇచ్చే సమయంలో అయినా అస్సలు వేసుకోకుండా ఉండటం మంచిది.

అసలు సమస్య ఏమిటంటే :

అసలు సమస్య ఏమిటంటే :

బ్రాలు క్రింద వైర్ లాంటిది ఉంటే అది వక్షోజాల పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? అటువంటి బ్రాలు వేసుకున్నప్పుడు అది మృదువైన వక్షోజాల పై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. దీని ఫలితంగా విపరీతమైన నొప్పి కలిగే అవకాశం ఉంది.

కొన్ని సందర్భాల్లో ఆ నొప్పి మరీ ఎక్కువైపోతుంది.అది ఎంతగా అంటే కనీసం నిద్ర కూడా పట్టనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. అంతే కాకుండా, అటువంటి బ్రా లు రోజంతా ఒక విధమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి మరియు అశాంతికి కూడా గురిచేస్తాయి.

మరొక సమస్యం ఏమిటంటే :

మరొక సమస్యం ఏమిటంటే :

పాలు ఇచ్చే దశలో వక్షోజాల పరిమాణం ఎన్నో మార్పులు చేర్పులకు లోనవుతాయి. పాలు ఇవ్వక ముందు పరిమాణం పెద్దవిగా ఉండొచ్చు, ఇచ్చిన తర్వాత వాటి పరిమాణం కొద్దిగా తగ్గిపోవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే పాల ఉత్పత్తి జరుగుతుందో అప్పుడు వక్షోజాలు పెరగడం జరుగుతుంది, ఇటువంటి భిన్న పరిస్థితుల్లో బ్రా క్రింద వైర్ ఉన్న వాటిని వేసుకోవడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి ఉంటుంది.

మాస్టిటిస్ ( స్త్రీల స్తనములకు సంబంధించినవాపు ) భారిన పడే అవకాశం :

మాస్టిటిస్ ( స్త్రీల స్తనములకు సంబంధించినవాపు ) భారిన పడే అవకాశం :

పాలు ఇచ్చే దశలో ఉన్నప్పుడు ఏ మహిళలు అయితే క్రింద వైర్ ఉన్న బ్రాలు వేసుకుంటారో అటువంటి వారు మాస్టిటిస్ భారిన పడే అవకాశం ఉంది. అందుచేతనే నిపుణులు ఇటువంటి బ్రా లను వాడకూడదని సూచిస్తున్నారు. పాలు ఇచ్చే దశలో మాస్టిటిస్ భారినపడితే అందులో నుండి బయటపడటం అంత సులభమైన విషయం ఏమి కాదు. ఎదుగుతున్న పిల్లలు ఉన్నప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యల భారిన పడకుండా అందుకు కావాల్సిన నిరోధక చర్యలు తీసుకోవడం ఉత్తమం.

ప్రసవం తర్వాత ఎటువంటి బ్రాలను వేసుకోవాలి :

ప్రసవం తర్వాత ఎటువంటి బ్రాలను వేసుకోవాలి :

ప్రసవించిన మహిళల కోసం ప్రత్యేకమైన బ్రాలను రూపొందించడం జరిగింది. వీటినే ఆంగ్లంలో మెటర్నిటీ బ్రాలు అంటారు. వీటిని గనుక వాడినట్లైతే ప్రసూతి మహిళకు ఎంతో ఉపశమనంగా ఉంటుంది మరియు ఎటువంటి అసౌకర్యం ఉండదు. అసలు నిజం ఏమిటంటే ఈ మెటర్నిటీ బ్రాలను సౌకర్యవంతంగా ఉండటం కోసమే వీటి తయారీలో చాలా మృదువైన పదార్ధాలను ఉపయోగించి రూపొందించడం జరిగింది.

దీనికి తోడు అవి ఎంతో సౌకర్యంవంతంగా, వక్షోజాలకు మద్దతుని ఇచ్చేలా మరియు అన్ని సమయాల్లో అనువుగా ఉండేలా రూపొందించారు. కానీ, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీకు గనుక మృదువైన చర్మం ఉన్నట్లయితే, మీ చర్మానికి సరిపడే పదార్ధాలతో తయారుచేసిన బ్రాలను ఎంచుకోవడం మంచిది. అలా గనుక చేస్తే మీకు ఎటువంటి సమస్యలు తలెత్తవు.

ఎందుకు మెటర్నిటీ బ్రాలని ఎంచుకోవాలి :

ఎందుకు మెటర్నిటీ బ్రాలని ఎంచుకోవాలి :

గర్భం దాల్చిన స్త్రీలలో వివిధ దశల్లో వక్షోజాల పరిమాణం ఎన్నో మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పాల ఉత్పత్తి జరుగుతుందో అటువంటి సమయంలో వక్షోజాల పరిమాణం వాటంతట అవే పెరుగుతాయి.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇటువంటి విభిన్న పరిస్థితుల్లో సాధారణ బ్రాలు వేసుకుంటే ఎంతో అసౌకర్యానికి లోను కావాల్సి వస్తుంది. ఇటువంటి సమయాల్లోనే మహిళలు వైద్యులను సంప్రదించి మెటర్నిటీ బ్రాలను వాడటం మొదలుపెడతారు.

మరొక ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే :

మరొక ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే :

ఆందోళన కలిగించే అసలు విషయం ఏమిటంటే, ఏ బ్రాలకైతే క్రింది భాగంలో వైర్ ఉంటుందో అటువంటి వాటిని వేసుకోవడం వల్ల అది రక్తప్రసరణ పై ప్రభావం చూపిస్తుంది మరియు రక్తం గడ్డ కట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటి వల్ల అది పాల ఉత్పత్తి పై ప్రభావం చూపిస్తుంది. కానీ, కొంతమంది చెబుతున్నది ఏమిటంటే, ఈ బ్రాలు వాడటం వల్ల అవి పాల ఉత్పత్తి పై ప్రభావం చూపిస్తాయి మరియు తక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ, పిల్లలను పెంచేటప్పుడు కొద్దిగా సురక్షిత మార్గాలను ఎంచుకోవాలి కాబట్టి అందులో భాగంగా వీటిని వాడకూడదు అని చెబుతున్నారట.

ఎప్పుడు నిషేధించాలంటే ?

ఎప్పుడు నిషేధించాలంటే ?

ప్రసవం జరిగిన తర్వాత మొదటి ఆరు నెలలు క్రింద వైర్ ఉన్న బ్రాలను వేసుకోకపోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకు ఇలా చెబుతున్నారంటే, మొదట ఆరు నెలల్లో హార్మోన్ల పరిస్థితుల వల్ల పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుందట. ఆరు నెలల తర్వాత పాల ఉత్పత్తి అనేది పుట్టిన శిశువు యొక్క అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుందట.

ఏమి చేయాలి :

ఏమి చేయాలి :

మీరు గనుక క్రింద వైర్ ఉన్న బ్రాను వాడుతున్నట్లైతే ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకోండి. అది మీకు సౌకర్యవంతంగా ఉందా లేదా అసౌకర్యంగా ఉందా ? అసౌకర్యంగా ఉన్నట్లయితే వాటిని వాడటం పూర్తిగా నిషేధించండి. వాటిని వాడటం వల్ల అది పాల ఉత్పత్తి పై ఏమైనా ప్రభావం చూపిస్తుంది అని మీకు అనిపిస్తోందా? అలా గనుక మీరు భావిస్తే క్రింద వైర్ ఉన్న బ్రాలను పూర్తిగా నిషేధించండి మరియు మెటర్నిటీ బ్రాలను ఎంచుకోండి. ఈ విషయంలో మీరు మీ యొక్క అనుభవాల ప్రకారమే ముందుకు నడిచి నిర్ణయాలు తీసుకోండి.

మీకు ఏది బాగా పనికొస్తుంది ?

మీకు ఏది బాగా పనికొస్తుంది ?

చివరిగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీకు ఏదైతే బాగా సహాయపడుతుంది మరియు ఏది మీ అవసరాలకు అస్సలు పనికి రాదు అనే విషయాలను గుర్తుంచుకొని అందుకు అనుగుణంగా సరైన బ్రాలను ఎంచుకోండి. మీకు ఏది సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ఏది మీ యొక్క భుజాలు మరియు వక్షోజాల పై అధిక ఒత్తిడి పెంచడం లేదు, ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని మీకు తగిన బ్రాలను ఎంచుకోండి. దీనికి తోడు అది మీ యొక్క రక్త ప్రసరణ పై కూడా ప్రభావం చూపకుండా ఉండేలా చూసుకోండి. మరిన్ని చిట్కాల కోసం దగ్గరలోని వైద్య నిపుణులను కలవండి.

English summary

Bra During Breastfeeding | Is It Safe To Wear A Bra During Breastfeeding? | Is It Safe To Wear A Bra During Nursing?

One question that bothers many nursing women is: “Should I wear bra during breastfeeding?” Well, the answer to this question is simple. Read this!
Story first published: Sunday, October 22, 2017, 13:00 [IST]
Subscribe Newsletter