For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ ఫీడింగ్ కి గుడ్ బై చెప్పగానే తల్లుల్లో కలిగే మార్పులు

పిల్లలకు పాలివ్వటమనేది సృష్టిలోనే తల్లిని పరవశింపచేసే అత్యుత్తమ దశ. ఎంతో మంది తల్లులు ఈ విషయంలో తమ ఆనందాన్ని చాటుకుంటూ ఉంటారు. పిల్లలకు పాలివ్వటంలో తాము పొందే ఆనందం అనిర్వచనీయమని చెబుతూ ఉంటారు.

|

పిల్లలకు పాలివ్వటమనేది సృష్టిలోనే తల్లిని పరవశింపచేసే అత్యుత్తమ దశ. ఎంతో మంది తల్లులు ఈ విషయంలో తమ ఆనందాన్ని చాటుకుంటూ ఉంటారు. పిల్లలకు పాలివ్వటంలో తాము పొందే ఆనందం అనిర్వచనీయమని చెబుతూ ఉంటారు.

తల్లి గర్భంలోనే శిశువు ఊపిరి పోసుకున్నా శిశువుకి పాలివ్వటం చేతనే మాతృత్వపు ఆనందాన్ని రుచి చూశామని చాలా మంది తల్లులు అభిప్రాయపడుతున్నారు.

changes that happen when we stop breastfeeding

అయితే, పిల్లలకు పాలివ్వటమనే ప్రక్రియకు అలవాటు పడటానికి తల్లి ఎన్నో విధాలా ప్రయత్నిస్తుంది. పళ్ళు అప్పుడప్పుడే రావటం మొదలైన శిశువులు తల్లిపాలను త్రాగే క్రమంలో తల్లిని కొరికేస్తూ ఉన్నా ఆ నొప్పిని తట్టుకుంటూ శిశువుకి పాలివ్వటంలో ఆనందాన్ని వెతుక్కుంటుంది మహిళ. ఈ విధంగా, తల్లుల్లో పిల్లలకు పాలిచ్చే దశలో శారీరక అలాగే మానసిక అంశాలు చోటుచేసుకుంటాయి.

అలాగే, ఒక దశ రాగానే, పిల్లలకు తల్లిపాలను త్రాగే అలవాటును మాన్పించాలి. ఈ దశలో తల్లి మరిన్ని ఇబ్బందులకు గురవుతుంది. ఈ దశలో ఎన్నో రకాల భావోద్వేగాలకు లోనవుతుంది.

ఈ రోజు, అటువంటి దశలో పాలిచ్చే తల్లి ఎటువంటి శారీరక అలాగే మానసిక మార్పులకు గురవుతుందో తెలుసుకుందాం.

బ్రెస్ట్స్ సెన్సిటివ్ గా మారతాయి

బ్రెస్ట్స్ సెన్సిటివ్ గా మారతాయి

బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లుల బ్రెస్ట్స్ అనేవి అత్యంత సున్నితంగా మారతాయి. పాలు త్రాగుతూ పిల్లలు బ్రెస్ట్స్ ని కొరుకుతూ ఉంటారు. ఆ నొప్పిని అధిగమిస్తూనే పాలను అందించాలనే తాపత్రయంతో తల్లి ఇవన్నీ తట్టుకుంటుంది. దాంతో, రానురానూ బ్రెస్ట్ ఫీడింగ్ తల్లుల బ్రెస్ట్స్ అనేవి సున్నితంగా మారతాయి. సున్నితం అనే మాట కూడా ఇక్కడ తక్కువే.

బ్రెస్ట్ ఫీడింగ్ ని ఆపగానే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని మీరు భావించవచ్చు. అయితే, అది మీ అపోహ మాత్రమే. బ్రెస్ట్ లోని సెన్సిటివ్ నెస్ తగ్గడానికి మరికొంత సమయం అదనంగా పడుతుంది.

మాస్టిటిస్ ఫై పోరాటం

మాస్టిటిస్ ఫై పోరాటం

ఎంతో మంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ ని ప్రారంభించిన దశలో మాస్టిటిస్ తో పోరాడాల్సి వస్తుంది. బ్రెస్ట్ లో రక్తముతో కిక్కిరిసిన కణజాలములు అలాగే పాలు నిల్వఉండటం వలన మాస్టిటిస్ సంభవిస్తుందని అంటారు. అయితే, బ్రెస్ట్ ఫీడింగ్ ని ఆపేసిన తరువాత కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. దాంతో, బ్రెస్ట్స్ అనేవి నొప్పిగా ఉంటాయి. అప్పుడప్పుడూ, వణుకుతో కూడిన జ్వరాన్ని కూడా మీరు గమనించవచ్చు.

ఆకస్మిక హార్మోన్ల మార్పులు

ఆకస్మిక హార్మోన్ల మార్పులు

శిశువుకి బ్రెస్ట్ ఫీడింగ్ ని అందిస్తున్న సమయంలో చాలా మంది తల్లుల్లో ఓవులేషన్ ప్రక్రియ జరగదు. బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేయగానే, శరీరం తిరిగి ఓవులేషన్ కి సిద్ధం అవుతుంది. అందుచేత, శరీరంలో ఆకస్మిక హార్మోనల్ మార్పులు సంభవిస్తాయి. అందువలన, బ్రెస్ట్స్ అనేవి నొప్పిగా అలాగే సున్నితంగా ఉంటాయి. అలాగే, భావోద్వేగ మార్పులు కూడా శరీరంలో కలిగే హార్మోనల్ మార్పుల వలన సంభవించినవే.

బ్రెస్ట్ ఫీడింగ్ ని ఆపేసినా శిశువు సాంత్వన కోసం మీ వద్దకు రావచ్చు

బ్రెస్ట్ ఫీడింగ్ ని ఆపేసినా శిశువు సాంత్వన కోసం మీ వద్దకు రావచ్చు

బ్రెస్ట్ ఫీడింగ్ స్టేజ్ ని పూర్తి చేసినప్పటికీ శిశువు మీ వద్దకు సౌకర్యం కోసం వస్తూ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి వారి మొదటి ఆహారం మీ నుంచే లభించింది కాబట్టి శిశువు తరచూ మీ బ్రెస్ట్స్ వద్దకు వచ్చి సాంత్వన చెందటానికి ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు మీకిది ఇబ్బందిగా ఉండవచ్చు. అప్పుడు వారి దృష్టిని సున్నితంగా మరల్చాలి. అలా, వారి దృష్టిని పూర్తిగా మరల్చవచ్చు.

బ్రెస్ట్స్ సాగిపోతాయి

బ్రెస్ట్స్ సాగిపోతాయి

గర్భం దాల్చినదగ్గర నుంచి బ్రెస్ట్ ఫీడింగ్ దశ వరకూ జరిగే మార్పుల వలన మీ బ్రెస్ట్స్ అనేవి సాగిపోతాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు బ్రెస్ట్ కి చెందిన లిగమెంట్లతో పాటు కనెక్టింగ్ టిష్యూలు సాగిపోతాయి. ఇవి, తిరిగి ఇదివరకటి సాధారణ స్థితికి చేరుకోవడం జరగదు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు పాలతో మీ బ్రెస్ట్స్ నిండి ఉండడం వలన ఈ మార్పులు మీకు కనపడవు. బ్రెస్ట్ ఫీడింగ్ ని ఆపేయగానే, ఈ మార్పులు మీకు కనిపిస్తాయి. మీ బ్రెస్ట్స్ సాగిపోయాయన్న విషయం మీకర్థం అవుతుంది.

పాలు ఇంకడానికి సమయం పడుతుంది

పాలు ఇంకడానికి సమయం పడుతుంది

బ్రెస్ట్ ఫీడింగ్ ని ఆపగానే పాలు తయారవడం ఆగిపోతుందని మీరనుకోవచ్చు. అయితే, ఈ ప్రక్రియ కాస్త సమయం తీసుకుంటుంది. బ్రెస్ట్ లోని పాలు ఎండిపోవడానికి కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు పట్టవచ్చు.

బ్రెస్ట్స్ లీక్ అవుతాయి

బ్రెస్ట్స్ లీక్ అవుతాయి

పాలివ్వడం ఆపేయగానే కొంతకాలం వరకు మీ బ్రెస్ట్స్ నుంచి పాలు ఆకస్మాత్తుగా లీక్ అవుతూ ఉంటాయి. ఇందువలన, మీరు కొంచెం అసౌకర్యానికి గురికావచ్చు. దీని దృష్టిలో పెట్టుకుని మీరు జాగ్రత్తగా ఉండవచ్చు.

బ్రెస్ట్ ఫీడింగ్ ని మిస్ అవుతారు

బ్రెస్ట్ ఫీడింగ్ ని మిస్ అవుతారు

బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నంత కాలం తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ తో కలిగిన సమస్యల నుంచి విముక్తి కోసం ఎప్పుడెప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ని ఆపాలా అనే ఆలోచనతో ఉంటారు. ఐతే, ఒక్కసారి బ్రెస్ట్ ఫీడింగ్ ను ఆపేసిన తరువాత బ్రెస్ట్ ఫీడింగ్ లోని అసలు ఆనందం అర్థమవుతుంది. తమ శిశువుతో తమకున్న ప్రత్యేకమైన బాండ్ గుర్తొచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ ని మిస్ అవుతారు.

విశ్రాంతి లభిస్తుంది

విశ్రాంతి లభిస్తుంది

బ్రెస్ట్ ఫీడింగ్ ని ఆపేశారంటే మీరు తెల్లార్లూ ఎప్పుడుపడితే అప్పుడు శిశువుకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి నిద్రలేచే అవసరం ఉండదు. అందువలన, మీకు కావలసినంత విశ్రాంతి లభిస్తుంది. ఇదివరకటి కంటే ఎంతో ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు. సరైన నిద్ర లభించడం చేత ఉదయాన్నే త్వరగా మేల్కొంటారు.

బరువులో మార్పులు

బరువులో మార్పులు

బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నంత కాలం ఆకలి ఎక్కువగా వేస్తుంది. అయితే, బ్రెస్ట్ ఫీడింగ్ కు ధన్యవాదాలు తెలుపుకోవాలి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే సమయంలో అధిక కేలరీలు తీసుకున్నా కూడా మీరు అధిక బరువు పెరగరు. కొంత మంది మహిళలైతే బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో బరువు తగ్గామని కూడా చెప్తూ ఉంటారు. అయితే, బ్రెస్ట్ ఫీడింగ్ దశ పూర్తవగానే మీ బరువులో మార్పు మొదలవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ దశ పూర్తయిన తరువాత కూడా అదే విధమైన ఆహారపుటలవాట్లు కొనసాగితే అధిక బరువు సమస్యకు గురయ్యే ప్రమాదం ఎక్కువ.

భావోద్వేగాల సమ్మేళనం

భావోద్వేగాల సమ్మేళనం

బ్రెస్ట్ ఫీడింగ్ దశ పూర్తవగానే, మీరు భావోద్వేగాల సమ్మేళనంగా మారతారు. తరచూ, ఒకదానితో ఒకదానికి సంబంధంలేని భావోద్వేగాలకు గురవుతారు. హార్మోన్ల పెరుగుదల వలన ఈ మార్పు సంభవిస్తుంది. కొత్తగా లభించిన స్వతంత్రం వలన మీరు అధిక ఉత్సాహానికి గురికావచ్చు. అయితే, కొందరిలో డిప్రెషన్ కూడా కనిపించవచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

English summary

changes that happen when we stop breastfeeding | changes that a woman faces when she stops breastfeeding

When the time comes to wean the baby off of the breast milk, the mother faces new challenges. From the emotional issues to the physical after-effects, it is like going through it all over again.
Desktop Bottom Promotion