పాలిచ్చే తల్లులు తప్పకుండా తీసుకోవల్సిన ఆహారాలు..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ప్రసవం తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ సమయం చాలా ముఖ్యం. బేబీ పెరిగే కొద్ది, తల్లులు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. . తల్లి తీసుకునే ఆహారాల మీద తగిన జాగ్రత్తలు అవగాహన కలిగి ఉండాలి. బ్రెస్ట్ మిల్క్ ను పెంచడంలో కొన్ని ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ పెరుగుతాయి. కొత్తగా తల్లైన వారు హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ల్యాక్టింగ్ సమస్యలుండవు. కొంత మంది మహిళల్లో బ్రెస్ట్ మిల్క్ సరిపడా ఉండకపోవడంతో బిడ్డకు పాలు సరిపోవడం లేదని ఎక్కువ ఆందోళనకు గురి అవుతుంటారు. అయితే అందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రసవం తర్వాత సరైన ఫుడ్స్ ను ఎంపిక చేసుకుని తీసుకుంటే తల్లిలో పాలు బాగా పడుతాయి. దాంతో బేబీ పెరుగుదలకు గ్రేట్ గా సహాయపడుతుంది..

అయితే ప్రసవించిన తర్వాత, కొత్తగా తల్లైన వారు మొదటి తీసుకునే ఆహారాల గురించి గైనకాలజిస్ట్ ను తప్పనిసరిగా కలవాలి. బ్రెస్ట్ మిల్క్ ను పెంచే అటువంటి ఫుడ్స్ కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి. తల్లి తీసుకునే ఆహారాల గురించి డాక్టర్ సరైన సలహాలనిస్తుంటారు. బ్రెస్ట్ మిల్క్ ను పెంచే కొన్ని రకాల ఆహారాలు ఈక్రింది విధంగా...

హెల్తీ వెజిటేబుల్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.: కొత్తగా తల్లైన వారు బ్రెస్ట్ మిల్క్ ను ఉత్పత్తి చేసే బాటిల్ గార్గ్ వంటి ఆహారాలను తీసుకోవాలి. అటువంటి హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మొదట బ్రెస్ట్ మిల్క్ ను పెంచుతుంది. . ఇలాంటి హెల్తీ వెజిటేబుల్స్ తినడం వల్ల పాలు ఉత్పత్తిని పెంచుతుంది.

సాల్మన్ :

సాల్మన్ :

సాల్మన్ ఫిష్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి పాలిచ్చే తల్లులకు గొప్పగా సహాయపడుతాయి. సాల్మన్ ఫిస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హార్మోన్ సమస్యలను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి .

ఆకు కూరలు:

ఆకు కూరలు:

ఆకుకూరల్లో క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లు అధికంగా ఉంటాయి. ఆకుకూరలు తల్లి బిడ్డకు క్షేమం. ఇది అనిమిక్ ల్యాక్టేటిక్ మదర్స్ కకు గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియా నుండి త్వరగా కోల్కొనేందుకు సహాయపడుతుంది.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

క్యారెట్స్ ల్యాక్టింగ్ మదర్స్ కు గొప్పగా సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగితే చాలు అద్బుతంగా పనిచేస్తుంది. న్యూట్రీషియన్స్ ను సప్లై చేస్తుంది,.

సోంపు

సోంపు

సోంపు పాలిచ్చే తల్లులకు చాలా హెల్తీ ఫుడ్ . ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి,కొత్తగా తల్లైన వారిలో సోంపు తప్పనిసరిగా చేర్చుకోవాలి.

బీరకాయ

బీరకాయ

లాక్టింగ్ మదర్స్ ను హైడ్రేషన్ లో ఉం, అద్బుత ఆహారం బీరకాయ. ఇది పాల యొక్క క్వాలిటీని పెంచుతుంది

వెల్లుల్లి

వెల్లుల్లి

బ్రెస్ట్ మిల్క్ పెంచడంలో గార్లిక్ (వెల్లుల్లి)గ్రేట్ గా సహాయపడుతుంది. వెల్లుల్లిని వివిధ రకాల వంటల్లో జోడించాలి . బ్రెస్ట్ మిల్క్ సప్లై చేయడంలో ఇది ఒక బెస్ట్ ఫుడ్ . వెల్లుల్లి ఘాటైన వాసన ఉండటం వల్ల దీన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు , కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

శెనగలు:

శెనగలు:

శెనగల్లో ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. విటమిన్ బి, క్యాల్షియం కూడా అధికంగా ఉండటం వల్ల ల్యాక్టింగ్ మదర్స్ కు గొప్పగా సహాయపడుతుంది.

ఆస్పరాగస్ :

ఆస్పరాగస్ :

ఆస్పరాగస్ లో విటమిన్ కె మరియు ఎలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కొన్ని రకాల హార్మోన్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. తల్లిలో మిల్క్ ప్రొడక్షన్ ను పెంచుతుంది.

నల్ల నువ్వులు :

నల్ల నువ్వులు :

నల్ల నువ్వులు మరియు నల్ల జీలకర్ర రెండూ గ్రేట్ గా సహాయపడుతాయి. పాల ఉత్పత్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

మునగక్కాయ

మునగక్కాయ

మునగకాయలో క్యాల్షియం, ఐరన్ లు అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకతను పంెచి పాలిచ్చే తల్లులకు గ్రేట్ గా సహాయపడుతుంది.

నీళ్ళు మరియు జ్యూస్ లు:

నీళ్ళు మరియు జ్యూస్ లు:

తల్లి ఆరోగ్యంగా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే హైడ్రేషన్ కంపల్సరీ, అందుకు తగిన నీళ్ళు, జ్యూస్ లు తాగడం , వాటర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోవడం మంచిది. వీటివల్ల తల్లకి తక్షణ ఎనర్జీతో పాటు, పాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

English summary

Foods Good For Lactating Mothers

Nursing mothers do get confused about what to eat in that stage. Well, it is not so complicated. Firstly, eating healthy foods is important and then eating foods that stimulate lactation can help.
Story first published: Tuesday, February 21, 2017, 12:00 [IST]
Subscribe Newsletter