ప్రసవం తర్వాత కోలుకోటానికి సాయపడే ఆహారపదార్థాలు

By: Deepti
Subscribe to Boldsky

తల్లవటం అనే అనుభవం మిగతా అన్నిటికన్నా భిన్నమైనది, పోలిక లేనిది. ఒక యువతి తల్లిగా మారినపుడు, అది కూడా ఆమె తల్లి అవాలని కలలు కన్నప్పుడు, ఆమె జీవితం సంపూర్ణం అవుతుంది.

కానీ ప్రసవం పద్ధతి మానవ శరీరంపై చాలా కఠినంగా ఉంటుంది. శారీరక, భావోద్వేగ, హార్మోనల్ మార్పులు, స్త్రీ శరీరంలో గర్భసమయంలో చాలా అధికంగా ఉంటాయి.

ప్రసవంలో కలిగే నొప్పి, వేదన ప్రపంచంలోని ఈ నాటి వరకు ఉన్న అన్ని నెప్పులకన్నా ఎన్నోరెట్లు అధికమైనది. ఒక బిడ్డకు జన్మనివ్వటం శరీరానికి చాలా అపాయకరమైన విషయం.

గర్భవతిగా ఉన్నప్పుడు, కాబోయే తల్లి బిడ్డకు మంచి ఆహారపదార్థాలు తింటుంది. తన బిడ్డకు హానికరమైనవి ఏవైనా అస్సలు తీసుకోదు. బిడ్డ పుట్టాక, తల్లి తన గూర్చి తను శ్రద్ధ తీసుకోవాలి.

ప్రసవానంతరం మలబద్ధకం నివారణకు తీసుకోవల్సిన ఆహారాలు..!

శరీరం చాలా అలసిపోయి ఉంటుంది, తిరిగి పుంజుకోవటానికి కొంత సమయం పడుతుంది. తల్లి అన్నిరకాలు తేరుకోడానికి చాలా విశ్రాంతి అవసరం.

తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన బిడ్డను సంరక్షించగలదు కదా. సరియైన పోషకవిలువలున్న ఆహారం ఎంతో అవసరం. ఈ వ్యాసంలో మేము కొత్తగా తల్లి అయిన వారికి అవసరమైన ఆహార పదార్థాల గూర్చి, వాటి పోషక విలువల గురించి పొందుపరిచాం. ఇవి క్రమం తప్పకుండా తీసుకొని మిమ్మల్ని మీరు మళ్ళీ పుంజుకునేట్లా చేయండి.

ఓట్స్

ఓట్స్

ఓట్స్ లో కార్బొహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్ మరియు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ లో ఉండే పీచు పదార్థం మిమ్మల్ని మలబద్ధకానికి దూరం చేస్తుంది. ఓట్లను పోరిడ్జ్ లా, ఖిచిడి లేదా ఉప్మాలా చేసుకుని తినవచ్చు. పళ్ళ ముక్కలు, డ్రై ఫ్రూట్ల వంటివి కూడా కలిపి తీసుకోండి.

పసుపు

పసుపు

పసుపు ప్రాచీనకాలం నుండి చికిత్సల్లో భాగంగా ఉంటూ వస్తోంది. అది గాయాలు మాన్పటంలో వాపు తగ్గించి, నివారణగా ఉండటంలో సాయపడుతుంది. విటమిన్ సి, బి6 వంటి పోషకాలు కలిగిఉంది. ఇందులో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటివి కూడా ఉన్నాయి. భారత వంటకాలలో ఎలానో పసుపు వాడతారు. కానీ మంచి ఫలితాల కోసం ఒక చెంచాడు పసుపు పాలను మరిగించి, గోరువెచ్చగా తాగండి. కావాలంటే కొంచెం తేనె, పంచదార వేసుకోవచ్చు.

ప్రసవం తర్వాత మహిళ ఖచ్చితంగా తీసుకోవల్సిన ఇండియన్ ఫుడ్...!

అల్లం లేదా ఎండిన అల్లం

అల్లం లేదా ఎండిన అల్లం

ఎండబెట్టిన అల్లం లేదా తాజా అల్లం పొడి గర్భం తర్వాత వాడుకకి చాలా మంచిది. వాపులు తగ్గించే దాని గుణం బిడ్డ పుట్టాక చాలా ఉపయోగపడుతుంది. శొంఠి లడ్డును కొత్త తల్లులకు పెడతారు. మీ భోజనంలో కూడా కొంచెం అల్లం పొడి వేసుకుని ప్రయత్నించవచ్చు.

పప్పుధాన్యాలు

పప్పుధాన్యాలు

పప్పుధాన్యాలలో ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. శాకాహారులు నిజానికి మాంసాహారంలో దొరికే ప్రొటీన్ కి ప్రత్యామ్నాయంగా వీటిని వాడతారు. పప్పులు, సూపులు, హల్వా వంటి స్వీట్లు తయారు చేసుకోవచ్చు. కంది లేదా పెసరపప్పు కొత్త తల్లులకు (వాటి సులభ అరుగుదల వల్ల) ఎంతో మంచివి.

బ్రెస్ట్ మిల్క్ ను పెంచే పవర్ ఫుల్ ఫుడ్స్...

వాము

వాము

వామును సాధారణంగా ప్రసవం తర్వాత ఆహారదినుసుగా వాడతారు. ఇది మలబద్ధకాన్ని, అజీర్తిని, గ్యాస్ ను తొలగిస్తుంది. తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది. గర్భాశయం కుచించుకుని ఇంతకు ముందు స్థితికి రావటానికి సాయపడుతుంది. బ్యాక్తీరియా, ఫంగల్ వ్యాధులకు కూడా వ్యతిరేకం. మీ పరోటాలు, హల్వాలకు వాము జతచేయండి. వివిధ కూరలలో రుచికోసం కూడా వేస్తారు. కొంతమంది కొత్త తల్లులు వాముని నీటిలో వేసి మరగించి ఆ నీరును నేరుగా కోలుకోవటానికి తాగుతారు.

English summary

Foods That Help In Recovering After A Childbirth

There are certain foods that must be consumed after childbirth. These are the most nutritious foods that a mother should have after delivery.
Story first published: Friday, July 7, 2017, 10:12 [IST]
Subscribe Newsletter