మీ బిడ్డ బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా తాగుతుంటే ఏమవుతుంది?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

రొమ్ముపాలు తాగే సమయంలో, మనలో ఆందోళన కలుగుతుంది. ఎక్కువ అంటే ఎంత? శిశువుకు ఇచ్చే పాల పరిమాణం ఎంత? బిడ్డ పాలు ఎక్కువగా తాగితే ఏమవుతుంది?

ఈరోజుల్లో పిల్లలు ఎక్కువగా ఊబకాయంతో బాధపడుతున్నారు కాబట్టి చిన్నప్పటి నుండే పిల్లలకు ఊబకాయం వస్తుందేమో అనే బాధతో అనేకమంది స్త్రీలు కలత చెందుతున్నారు.

బ్రెస్ట్ మిల్క్ పెంచడానికి ఇక్కడున్నాయి నేచురల్ టిప్స్!

తల్లి పాలిచ్చే సమయంలో ఎక్కువగా పాలు వినియోగం అవ్వడం సాధ్యపడదు అని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ, మీ బిడ్డ సాధారణం కంటే ఎక్కువ పాలు తాగుతుంటే, మీకు సహాయపడే కొన్ని విషయాలను ఇక్కడ ఇవ్వబడ్డాయి.

మీ బిడ్డ పాలు ఎక్కువగా తాగుతుంటే ఏమవుతుంది?

మీ బిడ్డ పాలు ఎక్కువగా తాగుతుంటే ఏమవుతుంది?

సరే, మొదటి సంకేతం పాలు ఉమ్మేయడం. పాలు తాగేటపుడు మీ బిడ్డ పాలు ఉమ్మేస్తే, కడుపు నిండింది అని అర్ధం.

ఎప్పుడూ ఇలాగే జరుగుతుందా?

ఎప్పుడూ ఇలాగే జరుగుతుందా?

మీ బిడ్డ ఆరోగ్యకరమైన బరువుతో, బాగున్నట్టు కనిపిస్తూ పాలు ఉమ్మేయడం అనేది అధికంగా పాలు తగినట్టు గుర్తు కాదు. మీ బిడ్డ పాలు తాగినప్పుడల్లా పాలను ఉమ్మేస్తుంటే మాత్రమే, మీరు కంగారు పడాల్సిన అవసరం ఉంది.

తల్లి పాల నుండి పిల్లలకు హాని కలిగించే ఆహారాలకు దూరం...

అది శరీర బరువు మీద ప్రభావం చూపిస్తుందా?

అది శరీర బరువు మీద ప్రభావం చూపిస్తుందా?

అవును, ఎక్కువ పాలు తాగడం వల్ల బిడ్డ బరువు పెరుగుతాడు. కానీ మీ బిడ్డ పెద్దయ్యాక ఊబకాయానికి గురవుతాడేమోనని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సమయానుకూలంగా వారి ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి కాబట్టి. అదికాకుండా, రొమ్ము పాలలో ఊబకాయాన్ని అరికట్టే లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి!

ఏమి చేయాలి?

ఏమి చేయాలి?

మీ బిడ్డ పాలు కోరినప్పుడల్లా, ఎక్కువ పాలు తాగుతాడేమోనని భయపడకుండా పాలు ఇవ్వండి.

తరువాత ఏమి జరుగుతుంది?

తరువాత ఏమి జరుగుతుంది?

కొంతమంది పిల్లల్లో ఎక్కువ పాలు తాగడం వల్ల కొవ్వు పెరగవచ్చు, కానీ వారు పెరుగుదల ప్రారంభమైన తరువాత నడవడం, ఆడడం, పరిగెట్టడం చేస్తారు కాబట్టి క్రమంగా అధిక క్యాలరీలు కరిగి అధిక బరువు తగ్గుతారు.

వైద్యుడిని సంప్రదించే అవసరం ఉందా?

వైద్యుడిని సంప్రదించే అవసరం ఉందా?

మీ బిడ్డ ఎక్కువ పాలు తాగుతున్నాడు, వాంతులు ఎక్కువగా చేసుకుంటున్నాడు అనుకుంటే, వైద్యుడిని సంప్రదించి ఏమి చేయాలో తెలుసుకోవడం మంచిది.

English summary

What If Your Baby Drinks Too Much Of Breast milk?

Overfeeding During Breastfeeding,Is overfeeding a baby unhealthy? During the breastfeeding stage, one concern may surely crop up. How much is too much? Is overfeeding unhealthy?
Story first published: Thursday, September 21, 2017, 19:00 [IST]