Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ప్రసవం తర్వాత తల్లి తప్పనిసరిగా తీసుకోవల్సిన 5 ఆహారాలు..!
సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చాక బాలింతలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే పెడతారు. ఆ సమయంలో జీర్ణమైన ఆహారం మాత్రమే శిశువుకు పాలుగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ సమయంలో బాలింతలు తగు జాగ్రత్తులు పాటిస్తూ తీసుకునే ఆహారం పుష్టికరంగా, ఆరోగ్యవృద్దికరంగా ఉండేలా చూసుకోవాలి. ప్రసవం జరిగిన తొలిరోజుల్లో ఎక్కువగా పులుపు, కారం, మసాలాలను తీసుకోకూడదు. గర్భవతిగా ఉన్నప్పుడే కాదు, ప్రసవం తర్వాత కూడా కొత్తగా తల్లి అయిన స్త్రీలకు నియమిత ఆహారం ఎంతో అవసరం. శిశువు జన్మించిన ఆరు నెలల వరకూ తల్లిపాలే శిశువులకు పోషకాహారం. శిశువు తాగే పాలు తేలికగా జీర్ణించుకుని ఆరోగ్యవంతంగా దినదినాభివృద్ది చెందాలంటే తల్లి తగిన జాగ్రత్తలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. దీంతో తల్లీ, బిడ్డల ఆరోగ్యం చక్కగా ఉంటుంది.
గర్భధారణ సమయంలో, గర్భిణి స్త్రీ ఆరోగ్యంగా ఉండటానికి, సురక్షితంగా ప్రసవించడం కోసం కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటారు. అయితే, ప్రసవించిన వెంటనే కొత్త తల్లిలో కొత్త కొత్త కోరికలు మొదలవుతాయి. ఈ కోరికలు ముఖ్యంగా వారు తినే ఆహారం మీద ఎక్కువ. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో దూరమైన ఆహారాలను ఎక్కువగా ఇష్టపడుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రసవం తర్వాత ఈ క్రింది లిస్ట్ అవుట్ చేసిన ఆహారాలను తీసుకోవచ్చు.
కొత్తగా తల్లైన వారు గుర్తుంచుకోవల్సిన ఒక ముఖ్యమైన విషయం, ప్రసవం తర్వాత ఏ ఆహారం తీసుకొన్న సరే, మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం వల్ల స్టొమక్ అప్ సెట్ లేదా వికారానికి దారితీస్తుంది. కాబట్టి, ప్రసవం తర్వాత కొత్త తల్లి తీసుకోవల్సి కొన్ని ఉత్తమ ఆహారాలు క్రింది స్లైడ్ లో ఇవ్వబడ్డాయి, వాటిని పరిశీలించి తల్లిబిడ్డ సురక్షింతంగా ఉండేలా మితంగా తీసుకోవాలి.

ఓట్స్
ఓట్స్ లో కార్బొహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్ మరియు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ లో ఉండే పీచు పదార్థం మిమ్మల్ని మలబద్ధకానికి దూరం చేస్తుంది. ఓట్లను పోరిడ్జ్ లా, ఖిచిడి లేదా ఉప్మాలా చేసుకుని తినవచ్చు. పళ్ళ ముక్కలు, డ్రై ఫ్రూట్ల వంటివి కూడా కలిపి తీసుకోండి.

పసుపు
పసుపు ప్రాచీనకాలం నుండి చికిత్సల్లో భాగంగా ఉంటూ వస్తోంది. అది గాయాలు మాన్పటంలో వాపు తగ్గించి, నివారణగా ఉండటంలో సాయపడుతుంది. విటమిన్ సి, బి6 వంటి పోషకాలు కలిగిఉంది. ఇందులో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటివి కూడా ఉన్నాయి. భారత వంటకాలలో ఎలానో పసుపు వాడతారు. కానీ మంచి ఫలితాల కోసం ఒక చెంచాడు పసుపు పాలను మరిగించి, గోరువెచ్చగా తాగండి. కావాలంటే కొంచెం తేనె, పంచదార వేసుకోవచ్చు.
ప్రసవం తర్వాత మహిళ ఖచ్చితంగా తీసుకోవల్సిన ఇండియన్ ఫుడ్...!

అల్లం లేదా ఎండిన అల్లం
ఎండబెట్టిన అల్లం లేదా తాజా అల్లం పొడి గర్భం తర్వాత వాడుకకి చాలా మంచిది. వాపులు తగ్గించే దాని గుణం బిడ్డ పుట్టాక చాలా ఉపయోగపడుతుంది. శొంఠి లడ్డును కొత్త తల్లులకు పెడతారు. మీ భోజనంలో కూడా కొంచెం అల్లం పొడి వేసుకుని ప్రయత్నించవచ్చు.

పప్పుధాన్యాలు
పప్పుధాన్యాలలో ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. శాకాహారులు నిజానికి మాంసాహారంలో దొరికే ప్రొటీన్ కి ప్రత్యామ్నాయంగా వీటిని వాడతారు. పప్పులు, సూపులు, హల్వా వంటి స్వీట్లు తయారు చేసుకోవచ్చు. కంది లేదా పెసరపప్పు కొత్త తల్లులకు (వాటి సులభ అరుగుదల వల్ల) ఎంతో మంచివి.
బ్రెస్ట్ మిల్క్ ను పెంచే పవర్ ఫుల్ ఫుడ్స్...

వాము
వామును సాధారణంగా ప్రసవం తర్వాత ఆహారదినుసుగా వాడతారు. ఇది మలబద్ధకాన్ని, అజీర్తిని, గ్యాస్ ను తొలగిస్తుంది. తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది. గర్భాశయం కుచించుకుని ఇంతకు ముందు స్థితికి రావటానికి సాయపడుతుంది. బ్యాక్తీరియా, ఫంగల్ వ్యాధులకు కూడా వ్యతిరేకం. మీ పరోటాలు, హల్వాలకు వాము జతచేయండి. వివిధ కూరలలో రుచికోసం కూడా వేస్తారు. కొంతమంది కొత్త తల్లులు వాముని నీటిలో వేసి మరగించి ఆ నీరును నేరుగా కోలుకోవటానికి తాగుతారు.



Click it and Unblock the Notifications











