For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లిపాలిచ్చే దశలో తాగే వెజిటేబుల్ జ్యూస్ పిల్లల ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తుందా?

|

సాధారణంగా, చాక్లెట్లు తినడం అంటే ఇష్టమైన పిల్లలు ఆరోగ్యకరమైన కూరలవంటివి తినడానికి అసహ్యించుకుంటారు. నిజానికి, ఒకవేళ మీరు వారికి క్యారట్ రసం తీసిపెడితే, దాన్ని వారు ముట్టుకోకపోవచ్చు కూడా.

నిజానికి,చాలామంది తల్లులు తమ పిల్లలు మంచి ఆరోగ్యకర ఆహారం తినాలనుకుంటారు. కానీ ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం పిల్లలు పుట్టిన కొత్తల్లో పాలిచ్చే తల్లులు ఒకవేళ కూరగాయల రసం తాగే అలవాటు కలిగి ఉంటే భవిష్యత్తులో పిల్లలకి ఈ సమస్య రాదని తేలింది.

బరువు తగ్గడానికి రోజూ ఉదయం పరగడపు తీసుకోవల్సిన 7 రకాల జ్యూసులు..!బరువు తగ్గడానికి రోజూ ఉదయం పరగడపు తీసుకోవల్సిన 7 రకాల జ్యూసులు..!

ఈ పరిశోధనల ప్రకారం తల్లులు పాలిచ్చేదశలో కూరగాయల రసాలు తాగే అలవాటు ఎక్కువుంటే పిల్లలు కూడా భవిష్యత్తులో ఆరోగ్యకరమైన తిండినే తినడానికి మొగ్గుచూపుతారు. ఇవిగో మరిన్ని వాస్తవాలు.

తల్లిపాల దశలో కూరగాయల రసం ఎలా సాయపడుతుంది

తల్లిపాల దశలో కూరగాయల రసం ఎలా సాయపడుతుంది

తాజా కూరగాయలు తినటం వలన తల్లిపాల రుచి మెరుగవుతుంది. ఇది బిడ్డ ఘనపదార్థాలు తినటం మొదలుపెట్టినపుడు,తనకి కూరగాయలపై ఇష్టం పెరిగేట్లా చేస్తుంది. అతను లేదా ఆమె కూరలను ఆరోగ్యకరమని భావిస్తారు.

పరిశోధకులు ఈ ముగింపుకి ఎలా వచ్చారు?

పరిశోధకులు ఈ ముగింపుకి ఎలా వచ్చారు?

పాలిచ్చేదశలో ఉన్న 100 మంది స్త్రీలను ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. శాస్త్రవేత్తలు వారిని బృందాలుగా విభజించారు. ఒక బృందం కూరగాయల రసం తాగితే మరోబృందం తాగలేదు. వారికి ఇచ్చిన రసాలు క్యారట్ రసం, బీట్ రూట్ మరియు ఆకుకూరల రసాలు.

బిడ్డల ఆసక్తి ఎలా మారింది?

బిడ్డల ఆసక్తి ఎలా మారింది?

8నెలల తర్వాత, పిల్లలు ఇక ఘనపదార్థాలు తినే స్థాయికి వచ్చాక, వారికి అనేక ఆహారాలు అందించారు. కూరలు ఎక్కువతిన్న తల్లుల బిడ్డలు క్యారట్ రుచి ఉన్న సెరియల్స్ ను ఇష్టపడితే, ఇతర పిల్లలు సాదా సెరియల్స్ ఎంచుకున్నారు.

పిల్లల ఎంపికపై ప్రభావం చూపినదేంటి?

పిల్లల ఎంపికపై ప్రభావం చూపినదేంటి?

తల్లిపాల దశలోనే పిల్లల ఇష్టాలపై ప్రభావం పడింది. తల్లిపాలలో కూరల రుచి కలిసినప్పుడు, వారికి కూరగాయలంటే ఆసక్తి పెరిగింది.

వెజిటబుల్ జ్యూస్ తో అసలైన ఆరోగ్యంవెజిటబుల్ జ్యూస్ తో అసలైన ఆరోగ్యం

చంటిపిల్లలు ఆహారాన్ని ఎలా అనుభవిస్తారు?

చంటిపిల్లలు ఆహారాన్ని ఎలా అనుభవిస్తారు?

చంటిబిడ్డ ఎప్పుడూ తల్లికి ఇష్టమైన ఆహారాల ద్వారానే మొదటిసారి రుచిని అనుభవిస్తుంది. ఎలా? గర్భం సమయంలో,తల్లి ఏది తింటే, అదే బిడ్డ వద్దకు వెళ్తుంది.తల్లి పాలిచ్చేదశలో కూడా తల్లి ఏది తింటే, అదే తల్లిపాల రుచిని కూడా ప్రభావితం చేస్తుంది.

ఈ అధ్యయనం చెప్తోందేమిటి?

ఈ అధ్యయనం చెప్తోందేమిటి?

ఈ అధ్యయనం తల్లిపాల రుచి భవిష్యత్తులో బిడ్డ ఆహార ఎంపిక, ఇష్టాలను ప్రభావితం చేయవచ్చని చెప్తోంది.తల్లితినే ప్రతి పదార్థం తన రుచిని 8గంటల పాటు తల్లిపాలలో కలిగించవచ్చు.ఈ రకంగా ఆ రుచి భవిష్యత్తులో పిల్లల ఆహారపు అలవాట్లను ప్రభావితం చేయవచ్చు.

English summary

Vegetables During Breastfeeding

A study claims that the baby tends to becomes a healthy eater if the mother had the habit of drinking vegetable juices during the breastfeeding stage.
Desktop Bottom Promotion