Just In
- 54 min ago
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- 4 hrs ago
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- 9 hrs ago
Today Rasi Palalu 28January 2023: ఈ రోజు తులారాశి వారికి అకస్మిక ధనలాభం
- 17 hrs ago
ఈ 5 రాశుల వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు..మాటలతో చిత్రహింసలకు గురిచేస్తారు
బిడ్డకు పాలిస్తున్న సమయంలో వక్షోజాలకు ఏం జరుగుతుంది
పాలిచ్చే దశలో వున్నప్పుడు వక్షోజాలలో అనేక మార్పులు వస్తాయి. వాటి పరిమాణం గర్భవతిగా ఉన్నప్పుడు లేదా పాలిచ్చే దశలోనో పెరుగుతుంది.
ఈ సమయంలో కలిగే అన్ని మార్పులకి ఒకే కారణం ఉంటుంది. తల్లి తన బిడ్డకి సరైన పోషణ ఇవ్వటానికే ఆ మార్పులు సంభవిస్తాయి.
పాలిచ్చే దశలో ఉన్న తల్లులలో జరిగే మార్పులు తెలుసుకోండి.

గర్భం దాల్చినపుడు వక్షోజాలలో కొన్ని మార్పులు
గర్భం దాల్చినపుడు వక్షోజాలలో కొన్ని మార్పులు జరుగుతాయి. మొదటగా చనుమొనల చుట్టూ చిన్నగడ్డల్లా వస్తాయి. ఆ ప్రదేశంలో చర్మం కూడా నల్లగా మారుతుంది. దీని ఉద్దేశం బిడ్డ చనుమొనలను గుర్తించడానికే.
బ్రెస్ట్
మిల్క్
ను
పెంచే
పవర్
ఫుల్
ఫుడ్స్...

చనుమొనల చుట్టూ ఈ చిన్నచిన్న గడ్డలు
చనుమొనల చుట్టూ ఈ చిన్నచిన్న గడ్డలు ఎందుకు రూపొందుతాయంటే వాటి నుంచి ఒక నూనెలాంటి పదార్థం స్రావమయ్యి, చనుమొనలు పొడిబారకుండా చూస్తాయి.

వక్షోజాల నుంచి ఉమ్మనీరు మాదిరి వాసన రావటం
పాలిచ్చే సమయంలో జరిగే మరొక మార్పు వక్షోజాల నుంచి ఉమ్మనీరు మాదిరి వాసన రావటం మొదలవుతుంది. ఈ వాసన వలన బిడ్డ చనుమొన వద్దకు సులువుగా చేరతాడు.

మరి పాలు ఎక్కడినుండి వస్తాయి?
మరి పాలు ఎక్కడినుండి వస్తాయి? వక్షోజాలలో సన్నని సంచీల మాదిరి అనేక గ్రంథులు ఉంటాయి. ప్రోలాక్టిన్ అనే హార్మోన్ శరీరానికి పాలను ఉత్పత్తి చేయమని ఆదేశిస్తుంది.

ప్రోలాక్టిన్ ఉత్తేజితమయ్యాక, పాలు వస్తాయి
మొదటగా, కేవలం కొలొస్ట్రం ఉత్పత్తి అవుతుంది. అందులో అధిక ప్రొటీన్ ఉండి పాలలాగా కన్పిస్తుంది. ప్రోలాక్టిన్ ఉత్తేజితమయ్యాక, పాలు రావటం మొదలవుతుంది.
బ్రెస్ట్
మిల్క్
పెంచడానికి
ఇక్కడున్నాయి
నేచురల్
టిప్స్!

మొదటి దశలో వక్షోజాలలో మంటగా అన్పిస్తుంది
మొదటి దశలో వక్షోజాలలో మంటగా అన్పిస్తుంది. తర్వాత మెల్లిగా పోతుంది. కొందరు స్త్రీలలో పాలిచ్చే దశలో కూడా కొంచెం గుచ్చుకుంటున్నట్టుగా అన్పిస్తుంది.