బిడ్డకు పాలిస్తున్న సమయంలో తల్లి శరీరంలో జరిగే మార్పులేంటో తెలుసా

Posted By: Deepti
Subscribe to Boldsky

పాలిచ్చే దశలో ఉన్న తల్లుల వక్షోజాలలో అనేక మార్పులు వస్తాయి. వాటి పరిమాణం గర్భవతిగా ఉన్నప్పుడు లేదా పాలిచ్చే దశలోనో పెరుగుతాయి.

ఈ సమయంలో కలిగే అన్ని మార్పులకి ఒకే ఉద్దేశ్యం ఉంటుంది. తల్లికి తన బిడ్డకి సరైన పోషణ ఇవ్వటమే.

అయితే ఇదిగో తెలుసుకోండి, పాలిచ్చే దశలో ఉన్న తల్లులలో జరిగే మార్పులు తెలుసుకోండి.

వాస్తవం #1

వాస్తవం #1

గర్భం దాల్చినపుడు వక్షోజాలలో కొన్ని మార్పులు జరుగుతాయి. మొదటగా చనుమొనల చుట్టూ చిన్నగడ్డల్లా వస్తాయి. ఆ ప్రదేశ చర్మం కూడా నల్లగా మారుతుంది. దీని ఉద్దేశం బిడ్డ చనుమొనలను గుర్తించడానికే.

వాస్తవం #2

వాస్తవం #2

చనుమొనల చుట్టూ ఈ చిన్న చిన్న గడ్డలు ఎందుకు రూపొందుతాయంటే వాటి నుంచి ఒక నూనెలాంటి పదార్థం స్రావమయ్యి, చనుమొనలు పొడిబారకుండా చూస్తాయి.

వాస్తవం # 3

వాస్తవం # 3

పాలిచ్చే సమయంలో జరిగే మరొక మార్పు వక్షోజాల నుంచి ఉమ్మనీరు మాదిరి వాసన రావటం మొదలవుతుంది. ఈ వాసన వలన బిడ్డ చనుమొన వద్దకు సులువుగా చేరతాడు.

వాస్తవం # 4

వాస్తవం # 4

మరి పాలు ఎక్కడినుండి వస్తాయి? వక్షోజాలలో సన్నని సంచీల మాదిరి అనేక గ్రంథులు ఉంటాయి. ప్రోలాక్టిన్ అనే హార్మోన్ శరీరానికి పాలను ఉత్పత్తి చేయమని ఆదేశిస్తుంది.

వాస్తవం # 5

వాస్తవం # 5

మొదటగా, కేవలం కొలొస్ట్రం ఉత్పత్తి అవుతుంది. అందులో అధిక ప్రొటీన్ ఉండి పాలలాగా కన్పిస్తుంది. ప్రోలాక్టిన్ ఉత్తేజితమయ్యాక, పాలు రావటం మొదలవుతుంది.

వాస్తవం #6

వాస్తవం #6

మొదటి దశలో, వక్షోజాలలో మంటగా అన్పిస్తుంది. తర్వాత మెల్లిగా పోతుంది. కొందరు స్త్రీలలో పాలిచ్చే దశలో కూడా కొంచెం గుచ్చుకుంటున్నట్టుగా అన్పిస్తుంది.

వాస్తవం # 7

వాస్తవం # 7

పాలిచ్చే దశలో కొందరు స్త్రీల కడుపులో సంకోచం వల్ల నెప్పిగా అన్పిస్తుంది. ఇది ఆక్సిటోసిన్ వల్ల కావచ్చు.

English summary

7 Things Happens To Breasts During Breastfeeding

Published: Tuesday, May 30, 2017, 16:37 [IST] Subscribe to Boldsky There could be many changes in the breasts during the breastfeeding stage. The size could increase either during the pregnancy or during the breastfeeding stage.