పాపాయి జన్మించిన తరువాత పాపాయితో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వలన కలిగే లాభాలు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మీ మొట్టమొదటి శిశువుతో ఉండే అనుబంధం నిర్వచించలేనిది. పాపాయిని మొదటి సారి ముద్దాడటమనేది మరపురానిది. ఈ సందర్భం, మీ పాపాయికి అలాగే మీకు గల బంధాన్ని మరింత పెంచుతుంది. అలాగే పాపాయి ఆరోగ్యానికి కూడా ఇది మంచిది.

పాపాయితో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని రీసెర్చ్ లు చెబుతున్నాయి.

పాపాయితో తల్లితండ్రులకున్న బాండింగ్ అనేది పెరగడానికి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉపయోగకరంగా ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు తల్లీబిడ్డల అనుబంధం మరింత రెట్టింపవుతుంది. శిశువు ఆరోగ్యానికి కూడా ఇది మంచి చేస్తుంది.

అసలీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఏమిటి? ఇదెందుకు ముఖ్యపాత్ర పోషిస్తుంది?

స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే ఏమిటి?

స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే ఏమిటి?

స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే పాపాయి జన్మించిన వెంటనే పాపాయి తల్లి లేదా తండ్రి అప్పర్ బాడీ (నేకెడ్) పై పాపాయిని బోర్లా పడుకోబెట్టుకోవడం. ఇలా చేయడం వలన శిశువుతో పాటు తల్లి కూడా త్వరగా కోలుకుంటుంది.

తల్లి బేర్ బ్రెస్ట్ అనేది నవజాతశిశువును రిలాక్స్ చేసేందుకు ఉపయోగపడే ప్లాట్ ఫార్మ్. వెచ్చటి ఉపశమనాన్ని అందించే తల్లి బేర్ బ్రెస్ట్ వద్ద పాపాయి అపరిమితమైన సౌఖ్యాన్ని పొందుతుంది. బయటి ప్రపంచంలోకి ప్రవేశించిన ఒత్తిడిని తగ్గించుకుని ప్రపంచానికి అలవాటు పడేందుకు ఈ విధానం తోడ్పడుతుంది.

తక్షణ క్లినికల్ ట్రీట్మెంట్ అవసరం లేనంతవరకు జన్మించిన వెంటనే కనీసం ఒక గంట పాటు తల్లి బ్రెస్ట్ వద్ద పాపాయి సేదదీరడం మంచిదని రీసెర్చ్ లు చెబుతున్నాయి.

స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వలన కలిగే లాభాలు?

స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వలన కలిగే లాభాలు?

తల్లీ బిడ్డలకు ఉపశమనం కలుగుతుంది.

శిశువు యొక్క హార్ట్ రేట్ అలాగే బ్రీతింగ్ మెరుగుపడుతుంది.

డైజెషన్ మెరుగవుతుంది

శిశువు టెంపరేచర్ నియంత్రణలో ఉంటుంది

శిశువు చర్మం తల్లి వద్ద నున్న ఫ్రెండ్లీ జెర్మ్స్ తో అలవాటు పడి సహజ రక్షణ వ్యవస్థను సిద్ధం చేసుకోగలుగుతుంది

ఫీడింగ్ బిహేవియర్ అనేది స్టిములేట్ అవుతుంది

బ్రెస్ట్ ఫీడింగ్ ను మెరుగుపరిచే హార్మోనల్ ఏజెంట్స్ విడుదల మెరుగవుతుంది

టెంపరేచర్ ను నియంత్రణలో ఉంచుతూ, ఇన్ఫెక్షన్స్ పై పోరాడుతూ, ప్రీటెర్మ్ ఇంఫ్యాన్ట్స్ లో వచ్చే కాంప్లికేషన్స్ ను తగ్గిస్తుంది

దీనినే కంగారూ ట్రీట్మెంట్ అని కూడా అంటారు

దీనినే కంగారూ ట్రీట్మెంట్ అని కూడా అంటారు

కంగారూ కేర్ అంటే ఏంటి?

స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ను కంగారూ కేర్ అని కూడా అంటారు. అయితే, ప్రీమెచ్యూర్ ఇంఫ్యాన్ట్స్ విషయంలో కంగారూ కేర్ అని వాడతారు.

నియోనాటల్ ట్రీట్మెంట్ యూనిట్స్ అనేవి పిల్లల పరిస్థితిని బట్టి మారతాయి. కంగారూ కేర్ ను మాత్రం ప్రీమెచ్యూర్ బేబీ సెక్యూర్ గా ఉందని నిర్దారించుకున్న తరువాత ఆచరిస్తారు. హాస్పటల్ నుంచి త్వరగా డిశ్చార్జ్ అవడానికి ఈ పద్దతిని పాటించాలని అడ్వార్టైజ్ చేస్తూ ఈ మెథడ్ కున్న ఇంపార్టెన్స్ ను తెలియచేస్తూ ఉంటారు.

పేరెంటింగ్ విషయంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తల్లి తండ్రులకు ఇవ్వడానికి కంగారూ కేర్ అనేది సమర్థవంతమైన పాత్ర పోషిస్తుంది. శిశువుతో తల్లిదండ్రులకు బాండింగ్ ని పెంచడం ద్వారా పేరెంటింగ్ లోని మెళకువలను తెలియచేస్తుంది ఈ పద్దతి.

స్కిన్ టు స్కిన్ మరియు మొదటి బ్రెస్ట్ ఫీడ్

స్కిన్ టు స్కిన్ మరియు మొదటి బ్రెస్ట్ ఫీడ్

మొట్టమొదటి బ్రెస్ట్ ఫీడ్ దగ్గరినుంచి పాపాయిలు ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ ను ఫాలో అవడం జరుగుతుంది. శిశువులందరూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరు మాత్రం ప్రతి ఫీడింగ్ కి మధ్యలో ఎక్కువ సమయం తీసుకోవచ్చు. కొంతమంది అతి కొద్ది సమయంలోనే బ్రెస్ట్ ఫీడ్ ను ఆశించవచ్చు.

స్కిన్ టు స్కిన్ అనేది శిశువులు తల్లి పాల ద్వారా సాంత్వన పొందే ప్యాటర్న్ ని ప్రోమోట్ చేస్తుంది. జన్మించిన మరుక్షణమే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ను అందుకున్న వాళ్ళు ఎక్కువ కాలం తల్లిపాలను పొందారని తెలుస్తోంది.

ఈ విధానమేంటంటే:

ఈ విధానమేంటంటే:

శిశువు జన్మించిన వెంటనే ఏడుస్తుంది.

ఆ తరువాత రిలాక్స్ అవడం ప్రారంభించి ఈ ప్రపంచంలో ఇమడడానికి ప్రయత్నిస్తుంది.

అప్పుడు మేలుకుంటుంది.

చేతులు, భుజాలు, తలను కదపడం ప్రారంభిస్తుంది.

శిశువు కదలికలు మెరుగై తల్లి బ్రెస్ట్ కు దగ్గరగా చేరేందుకు తోడ్పడతాయి.

తల్లి బ్రెస్ట్ వద్దకు చేరాక శిశువు రెస్ట్ తీసుకుంటుంది. శిశువుకు ఆకలిగా లేకపోయినా తల్లి బ్రెస్ట్ వద్ద సాంత్వన పొందుతుంది.

తల్లిపాలను తాగేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుంది.

తల్లిపాలను తాగిన తరువాత నిద్రలోకి జారుకుంటుంది.

సిజేరియన్ తరువాత స్కిన్ టు స్కిన్ కి గల ప్రాముఖ్యత?

సిజేరియన్ తరువాత స్కిన్ టు స్కిన్ కి గల ప్రాముఖ్యత?

స్కిన్ టు స్కిన్ ని లిమిట్ చేసే ఫాక్టర్స్ అనేకం ఉన్నాయి. వాటిలో సిజేరియెన్ ఒకటి. బ్యాక్ అనాల్జేసియా తరువాత తల్లి సిజేరియన్ జరుగుతున్నప్పుడు ఆ తరువాత మెలకువగా ఉన్నా హాస్పటల్ వారు క్లినికల్ రీజన్స్ కి లోబడి స్కిన్ టు స్కిన్ ని పర్మిట్ చేయకపోవచ్చు.

సిజేరియన్ తరువాత సిజేరియన్ పాలసీల ప్రకారం ఏం చేస్తే తల్లీ బిడ్డలు క్షేమంగా ఉంటారో మీకు మీ వైద్యుల ద్వారా తెలుస్తుంది. వైద్య సలహాలను స్వీకరించి పాటిస్తే అంతా సంతోషంగా ఉంటుంది. ఈ సిజేరియన్ పాలసీలు వివిధ ప్రాంతాలకు వేరు వేరుగా ఉంటాయి.

కొన్ని సార్లు, తల్లి మెడికల్ గా అందుబాటులో ఉండకపోవచ్చు. తల్లి బలహీనంగా ఉండటం వలన కావచ్చు లేదా సాధారణ అనస్తేటిక్ వలన కావచ్చు. ఇటువంటి పరిస్థితులలో తండ్రి బిడ్డకు సాంత్వన కలిగేందుకు ముందడుగు వేయాలి. స్కిన్ టు స్కిన్ ద్వారా బిడ్డతో అనుబంధం పెంచుకునేందుకు బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నించాలి.

English summary

The benefits of skin-to-skin contact after birth

That first cuddle with your brand-new child is an enchanting time, but did you understand it’s additionally a crucial time for your health and the wellness of your newborn?There’s a lot of research to support the advantages of skin-to-skin call promptly after birth and beyond.It is claimed to influence positively on parent-baby bonding, breastfeeding and also child’s health.