For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ మూడు అలవాట్ల ద్వారా అమ్మ సంతోషంగా జీవిస్తుంది

  |

  దేవుడు ప్రతి చోటా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటూ ఉంటారు. అమ్మ పరిపూర్ణమైన అలాగే స్వచ్ఛమైన ప్రేమకు ప్రతినిథి. అమ్మ ప్రేమ మధురమైనది. నిర్వచించబడలేనిది. ఇంటికి సంబంధించిన వ్యవహారాలను ఒంటిచేత్తో నిర్వహించగలిగిన సత్తా అమ్మలకే సొంతం. అంతే కాదు, ఉద్యోగినిగా కూడా తమ పనిని సమర్థవంతంగా అమ్మలు నిర్వర్తించగలరని ఎన్నో అధ్యయనాలు తెలుపుతున్నాయి.

  మిగతా వారు దూరం పెట్టినా కూడా అమ్మ మాత్రం చెంతకు తీసుకుంటుంది. ఆమె ఉదారస్వభావం, ఆప్యాయత, కరుణ మరియు క్షమాగుణం మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి. నిజానికి, అమ్మని అలాగే అమ్మ ప్రేమనూ నిర్వచించడం చాలా కష్టం. ఇంట్లోని ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి వారికి అవసరమైనవి అందిస్తుంది. తన గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరచదు.

  These 3 Habits Aid Mothers In Living Happier and Longer

  కేవలం కొద్ది రోజుల ముందు, అమ్మ గురించి అందమైన క్యాప్షన్లు రాస్తూ అమ్మ ఫోటోలను పోస్ట్ చేయడంలో చాలా మంది నిమగ్నమయ్యారు. అమ్మ గురించి మిగతా రోజులలో పట్టించుకునేవారెవరైనా ఉన్నారా? కేవలం మదర్స్ డే ను అమ్మకు డేడికేట్ చేయాలా? ఈ రోజుల్లో టెక్ సేవీ వరల్డ్ లో మనం లీనమైపోయాము. కాబట్టి, కాసేపు కూర్చుని అమ్మతో మాట్లాడేందుకు కూడా సమయం ఉండటం లేదు. సరైన ఆహారాన్ని తీసుకుంటున్నారా మెడిసిన్ తీసుకుంటున్నారా అని అడిగే తీరిక కూడా ఉండటం లేదు.

  కాబట్టి, అమ్మకు ఖరీదైన కానుకలను అందించే బదులు, తాను ఈ మూడు అలవాట్లను పాటించేలా మనం జాగ్రత్త తీసుకుంటే అమ్మ సంతోషంగా అలాగే ఆరోగ్యకరంగా జీవనము సాగిస్తుంది.

  These 3 Habits Aid Mothers In Living Happier and Longer

  1. పోషకాహారాన్ని తీసుకోవాలి:

  సాధారణంగా ఏ ఇంట్లోనైనా అమ్మ తమ పిల్లలు తినగా మిగిలిన ఆహారాన్ని తీసుకుంటుంది. ఆహారాన్ని వేస్ట్ చేయడం ఆమెకి ఇష్టముండదు. అయితే ప్రతిసారి పిల్లలు తినగా మిగిలిపోయిన బర్గర్ లేదా పాన్ కేక్ ను తీసుకుంటే శరీరంలో అదనపు కేలరీలు పేరుకుని ఒబేస్ గా మారిపోతారు.

  పిల్లలు ఆహారం తీసుకునే తీరు పెద్దలు ఆహారాన్ని తీసుకునే తీరు కంటే కొంచెం విభిన్నంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించడం అత్యవసరం. పిల్లలు తరచూ ఎదో ఒకటి తింటూ ఉంటారు. వారు ఒకేసారి ఆహారాన్ని పూర్తిగా తీసుకోరు. వారి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చురుగ్గా ఉంటుంది. మనకు అంత తరచుగా ఆహారాన్ని తీసుకోవడం అవసరం లేదు. అందువులన, మనమేం తింటున్నాం, ఆహారానికి ఆహారానికి మధ్య ఎంత గ్యాప్ తీసుకుంటున్నామన్న విషయాన్ని మనం ట్రాక్ చేయాలి.

  అంతేకాక, మహిళలు పని ఒత్తిడిలో పడి ఆహారాన్ని తీసుకోవడంపై శ్రద్ధ కనబరచకపోవచ్చు. ఇదే అలవాటు కొన్నేళ్ల పాటు కొనసాగితే, శరీరంలో పోషకాహార లోపం ఏర్పడవచ్చు. అధ్యయనాల ప్రకారం మన శరీర పనితీరు సజావుగా ఉండేందుకు తగినన్ని పోషకాలు అవసరం. లేదంటే, అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

  అందువలన, ఉద్యోగం చేస్తున్న మహిళలైనా లేదా ఇంట్లోని ప్రతి ఒక్కరి బాధ్యతనూ స్వీకరిస్తున్న మహిళలైనా పోషకాహారాన్ని తీసుకోవడం ముఖ్యం. బ్రొకోలీ, ఆల్మండ్స్, ఎగ్స్, కాటేజ్, ఛీజ్, చికెన్ బ్రెస్ట్, లీన్ బీఫ్, ఫిష్, క్వినోవా మరియు ఓట్ మీల్ లో తగినంత ప్రోటీన్ లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

  These 3 Habits Aid Mothers In Living Happier and Longer

  2. వ్యాయామం తప్పనిసరి:

  అమ్మ ఇంట్లోని పనులతో బిజీగా ఉండటం వలన వ్యాయామానికి సమయం కేటాయించకపోవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించాలంటే, వ్యాయామానికి సమయాన్ని కేటాయించాలి. ఫిట్ గా యాక్టివ్ గా ఉండేందుకు వ్యాయామం తోడ్పడుతుంది. జిమ్ కు వెళ్లేందుకు మీ దగ్గర సమయం లేకపోతే ఇంట్లోనే వ్యాయామాన్ని చేయడానికి ప్రాధాన్యతనివ్వండి. తద్వారా, మీ కోర్ మజిల్స్ స్ట్రాంగ్ గా మారతాయి. అంతేకాక, మీరు జాగింగ్ కి లేదా మార్నింగ్ వాక్ కి వెళ్ళవచ్చు. ఏరోబిక్స్ ను చేసుకోవచ్చు. ఇవి కేలరీలను కరిగించి మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతాయి.

  These 3 Habits Aid Mothers In Living Happier and Longer

  3. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి:

  పోషకాహారాన్ని తీసుకోవడం, వ్యాయామాన్ని చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే, మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం. ప్రతి చిన్న విషయానికి అమ్మ కంగారు పడటం గమనిస్తూనే ఉంటాం. అటువంటి సమయంలో మనం ప్రశాంతంగా ఉండమని అమ్మకు చెప్పాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన వారు ప్రతిదానికి ప్యానిక్ అవడం జరుగుతుంది. రోజువారీ ఫుడ్ మెనూ గురించి అలాగే పిల్లల గ్రేడ్స్ గురించి, ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం గురించి ఇలా ఎన్నో విషయాల గురించి అమ్మ టెన్షన్ పడటం జరుగుతుంది.

  తల్లిగా, సోషల్ మీడియా ఎకౌంట్స్ లో టైమ్ స్పెండ్ చేసుకోవాలి. స్నేహితులతో బయటికి వెళ్ళాలి. కంప్లీట్ మేకోవర్ ను చేసుకోవాలి. డైలీ సీరియల్స్ ను చూడాలి. ఇవన్నీ మీ మనస్సును రిలాక్స్ చేసేందుకు తోడ్పడతాయి. పుస్తకాలను చదవటం, హ్యాండీక్రాఫ్ట్ చేయడం లేదా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవడం వంటివి కూడా మీకు ప్రశాంతతను అందిస్తాయి.

  వీటితో పాటు, శరీరాన్ని అలాగే మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. మీ పాపాయి కోసం నిద్రలోంచి మధ్యలో మేలుకోవల్సిన అవసరం ఉండవచ్చు. అప్పుడు, మీ పార్ట్నర్ తో పాపాయి పనిని షేర్ చేసుకోవచ్చు. అందరి గురించి ఆలోచించే అమ్మ సంతోషంగా ఉండాలంటే ఆమెకు అందరి సపోర్ట్ అవసరం కదా.

  మీ లైఫ్ స్టైల్ లో ఈ మార్పులకు స్థానాన్ని కేటాయించడం ద్వారా సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు. అమ్మతనంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవవచ్చు. అయితే, ఈ సమస్యలను సమర్థవంతంగా మేనేజ్ చేస్తేనే సూపర్ మామ్ గా మారే అవకాశం ఉంది. ఇప్పటినుంచైనా మీ అమ్మ గురించి మరింత శ్రద్దగా ఆలోచిస్తారు కదూ.

  English summary

  These 3 Habits Aid Mothers In Living Happier and Longer

  A mother is always busy working for her children and her family. In between, she often misses out to take care of her own self. But yes, you need to make sure that she has a healthy and happier life. There are 3 simple things she needs to follow: having a nutritious diet, exercise and keep her mind cool.
  Story first published: Saturday, May 19, 2018, 14:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more