Just In
- 36 min ago
గర్భధారణ సమయంలో చర్మ రంగు నల్లగా మారకుండా ఉండటానికి పరిష్కారం ఇక్కడ ఉంది
- 5 hrs ago
హెచ్చరిక! మీకు అకస్మాత్తుగా మీ నోటిలో ఇలాంటి సమస్య ఉందా? అప్పుడు అది కరోనా కావచ్చు ...
- 10 hrs ago
గురువారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది...!
- 21 hrs ago
నిద్రపోయే ముందు 2 లవంగాలను నమిలి గోరువెచ్చని నీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
Don't Miss
- News
దేవినేని ఉమకు భారీ ఊరట- అరెస్టు చేయొద్దన్న హైకోర్టు- విచారణకు ఓకే
- Sports
బ్యాట్స్‌మన్ X బౌలర్ మధ్యే యుద్దం.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లన్నీ అంతే: ధోనీ
- Automobiles
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
- Movies
‘అఖండ’తో చరిత్ర సృష్టించిన బాలకృష్ణ: సౌత్‌లోనే రెండో హీరో.. అడుగు దూరంలో కనీవినీ ఎరుగని రికార్డు!
- Finance
బిల్ గేట్స్ సహా వీరి మాట! బిట్ కాయిన్ మరింత పతనం? 20,000 డాలర్లకు పడిపోవచ్చు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పాలిచ్చే తల్లులకు ఆల్కహాల్ ఎందుకు హానికరం?
ప్రసవం తర్వాత నవజాత శిశువుకు అందివ్వగలిగే అత్యుత్తమ పోషకంగా తల్లి పాలు ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. క్రమంగా నవజాత శిశువుకు వరుసగా మొదటి ఆరు నెలలపాటు, ప్రత్యేకంగా తల్లి పాలను అందివ్వడం గురించి వైద్యులు ఎక్కువ ఒత్తిడి చేస్తుంటారు కూడా. దాని ప్రాముఖ్యత అంత గొప్పది మరి. తల్లి పాలు బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అన్నిరకాల పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, సహజ సిద్దంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది., క్రమంగా నవజాత శిశువుని అనారోగ్యాలకు, ఇన్ఫెక్షన్లకు వీలైనంత దూరంగా ఉంచగలుగుతుంది. అన్నింటిని మించి, బిడ్డ సరైన బరువును సాధించడానికి, నవజాత శిశువుల ఎదుగుదలకు అత్యావశ్యకమైన పారామీటర్ గా కూడా తల్లి పాలు సహాయపడుతాయి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
తల్లి పాలలో ఉండే పోషకాల మొత్తాలన్నీ తల్లి దేహం నుండే వస్తుందన్న విషయం అందరికీ తెలిసినదే. కావున, పాలిచ్చే తల్లులు వీలైనంత ఎక్కువగా పోషకాలను సంగ్రహించవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
మీరు బిడ్డకు పాలిచ్చే తల్లి అయితే, తల్లులు తీసుకోవలసిన పోషకాహారం గురించిన టన్నుల వ్యాసాలను చదువవలసి ఉంటుంది. అవగాహనా రాహిత్యం బిడ్డ శారీరిక, మానసిక ఎదుగుదల మీద ప్రభావం చూపగలవు. కావున, పోషకాలు అధికంగా ఉండే ఆహారాల జాబితా గురించి తెలుసుకోవడంతోపాటుగా, తల్లి పాలను ఇచ్చే దశలో మీరు పరిహరించాల్సిన కొన్ని విషయాల గురించి కూడా మీరు విధిగా తెలుసుకోవలసి ఉంటుంది. క్రమంగా మీరు పరిహరించవలసిన అంశాల జాబితాలో, మొట్టమొదటిగా ఉండేది ఆల్కహాల్ సేవించడం. ఇది మానసిక ఉల్లాసానికి దోహదపడినా, మీ బిడ్డ జీవితాన్ని మాత్రం అతలాకుతలం చేయగలదు. కావున పరిహరించక తప్పదు.
మీ ప్రసవానంతర కాలంలో మీరు బంధువుల దగ్గర నుండి శ్రేయోభిలాషుల వరకు అనేకమంది వ్యక్తుల సలహాలను తీసుకుంటూనే ఉంటారు. క్రమంగా మీ బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదల గురించిన అవగాహన మీకు కలుగుతుంది. ఈ క్లిష్టమైన ప్రసవానంతర కాలం, మానసిక సమస్యలను అధిగమించడానికి, మీకు ఇది వరకే అలవాటు ఉన్న ఎడల, మీ ఆలోచనలు ఆల్కహాల్ మీదకు వెళ్లేందుకు అవకాశాలు లేకపోలేదు. మరియు ఆల్కహాల్ సేవించడం ద్వారా మీరు సేదతీరిన అనుభూతికి లోనవడం కూడా జరుగుతుంటుంది. అయితే మీరు మీ బిడ్డకు తల్లి పాలను ఇస్తున్న ఎడల, ఎట్టిపరిస్థితులలో ఆల్కహాల్ను పరిహరించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. తాత్కాలిక ఉపశమనం కోసం, బిడ్డ భవిష్యత్తును అంధకారం చేయకండి.
ఆల్కహాల్ తల్లి పాలకు అనేక రకాల దుష్ప్రభావాలను జోడిస్తాయి. తల్లి, రొమ్ముపాలను ఇస్తున్న దశలో మద్యం సేవించడం మూలంగా కలిగే దుష్ప్రభావాలను గురించి తెలుసుకోవడానికి వ్యాసంలో ముందుకు సాగండి.

1. తల్లి పాల పరిమాణం తగ్గడానికి దారితీస్తుంది :
ప్రసవానంతరం మద్యం సేవించడం మూలంగా తల్లి పాల పరిమాణం 20% నుంచి 23% వరకు తగ్గవచ్చునని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. మీ బిడ్డ తల్లిపాలను స్వీకరించే దశలో ఉన్నప్పుడు, బిడ్డ పోషణకు ఏకైక వనరుగా ఉండే రొమ్ము పాల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని, జాగ్రత్తవహించవలసి ఉంటుంది. ఆల్కహాల్ తరచుగా తీసుకోవడం మూలంగా, ఆ ప్రభావం రొమ్ములోని పాల పరిమాణం మీద పడి, సరైన మోతాదులో బిడ్డకు చేరకపోవచ్చు. క్రమంగా అవసరమైన మోతాదులో పోషకాలు అందక, మీ బిడ్డ శారీరిక మరియు మానసిక ఎదుగుదల మీద ప్రభావాన్ని చూపగలదని గుర్తుంచుకోండి.

2. రొమ్ము పాల ద్వారా బిడ్డకు ఆల్కహాల్ నిక్షేపాలు ప్రసరించవచ్చు . .
తల్లి వినియోగించే మద్యంలో దాదాపు 0.5% నుండి 3% వరకు రొమ్ములోని పాల ద్వారా శిశువు శరీరంలోనికి వెళ్తుంది అని తెలుస్తుంది. ఈ ఆల్కహాల్ పరిమాణం చిన్నదిగా కనిపించినా, ఆ పసి ప్రాణానికి ఈ మొతాదులే ఎక్కువగా ఉంటాయని మరువకండి. ఆల్కహాల్ వినియోగం, కాలక్రమేణా నవజాత శిశువు మీద పెనుప్రభావాన్ని చూపవచ్చు, క్రమంగా శిశువు కాలేయం పాడైపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

3. తల్లి పాలలోని పోషక విలువలు తగ్గుదల :
తల్లి దేహంలోని ఆల్కహాల్ మోతాదులు, రొమ్ము పాలలోని పోషకాల శోషణను నిరోధిస్తుందని, క్రమంగా శిశువుకు అందవలసిన పోషక మొత్తాలలో అసమానతలు తలెత్తుతాయని చెప్పబడింది. వాస్తవానికి రొమ్ము పాలలో ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది., ఆల్కహాల్ రొమ్ము పాలలోని పోలేట్ తగ్గుదలకు కారణమవుతుంది.

4. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది :
నవజాత శిశువు యొక్క రోగ నిరోధక వ్యవస్థ, పుట్టిన తరువాత కూడా కొన్ని నెలలపాటు అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంటుంది. క్రమంగా వారు తమ తల్లి పాల నుండి అన్ని రకాల పోషకాలను, ప్రతిరోధకాలను, యాంటీ బాక్టీరియల్ తత్వాలను పొందగలుగుతారు. తద్వారా, వారికి ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే శక్తి లభిస్తుంది. రొమ్ము పాలలో ఉండే కొద్దిపాటి ఆల్కహాల్ కంటెంట్ కూడా, శిశువుకు సరైన మొత్తంలో యాంటీబాడీస్ చేరకుండా నిరోధిస్తుంది. క్రమంగా నవజాత శిశువు, ప్రారంభ దశలోనే అస్వస్థతలకు మరియు సంక్రామ్యతలకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇది అత్యంతప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు.

5. నవజాత శిశువుల్లో మెదడు ఎదుగుదల మీద ప్రభావం …
శిశువులు వారి జీవితం ప్రారంభ దశలోనే, అధిక మద్యం ప్రభావానికి గురవుతుంటే, వారు తమ తరువాతి దశలలో కాలేయ సమస్యలను ఎదుర్కోవడంతో పాటుగా, వారి మెదడు మీద కూడా గణనీయమైన ప్రభావం పడుతుందని చెప్పబడింది. మద్యం మెదడు కణాలను క్షీణింపజేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. క్రమంగా మెదడు ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం పడుతుంది.

6. నిద్రతో కూడిన సమస్యలు మరియు ఆహార సరళిలో ప్రతికూల మార్పులకు దారితీస్తుంది.
ఆల్కహాల్ తీసుకునే తల్లుల, రొమ్ము పాలను సంగ్రహించే పిల్లలు, అధిక నిద్రకు గురవడం, లేదా నిద్ర వేళలలో అసాధారణ మార్పులను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. దీనిని గాఢ నిద్రగా వ్యవహరిస్తుంటారు. శిశువుల ఎదుగుదలకు కంటి నిండా నిద్ర అనేది, కీలకపాత్రను పోషిస్తుంది. కానీ అధిక నిద్ర మెదడు ఎదుగుదల, జ్ఞాపకశక్తి, ఆలోచనా విధానం మొదలైన కీలక అంశాల మీద ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. క్రమంగా ఇది వారి సంపూర్ణ అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతుంది. అధిక నిద్ర వారి ఆహార సరళి మీద కూడా వ్యతిరేక ప్రభావాన్ని చూపవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మీరు తల్లి పాలను ఇస్తున్న దశలో మద్యం సేవిస్తున్నట్లయితే, ఆ బిడ్డకు నిద్ర మరియు ఆహార సరళి పూర్తిగా అస్తవ్యస్తం అవుతుంది.

7. మీకు బాధ్యతగా అనిపించకపోవచ్చు :
శిశువులకు వారి తల్లుల నుండి మద్దతు చాలా అవసరంగా ఉంటుంది. కాబట్టి వారు పుట్టిన తర్వాత కొన్ని నెలల సమయం వరకు, నవజాత శిశువు పట్ల శ్రద్ధను కలిగి ఉండడమనేది ఒక పెద్ద బాధ్యతగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక అనారోగ్యకర స్థితిలో ఉంటే మీరు మీ బిడ్డకు సరైన భాద్యతను అందివ్వలేకపోవచ్చు. క్రమంగా, మీ నవజాత శిశువు సంరక్షణా చర్యల పట్ల ఏమరపాటును కలిగి ఉండవచ్చు. కావున మద్యం సేవించాలనే కోరికకు స్వస్థి చెప్పడం మంచిది.

8. తల్లి పాల రుచిలో అసాధారణ మార్పులు :
ఆల్కహాల్ అనేది రొమ్ము పాల రుచిని మారుస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇది శిశువు తల్లి పాలను తక్కువగా సేవించడానికి కారణంగా మారవచ్చు. బిడ్డ పుట్టిన మొదటి కొన్ని నెలల వ్యవధి అత్యంత కీలకమైన దశగా ఉంటుంది, ఈ దశలోనే తల్లి పాల నుండి పోషకాలను, క్రమంగా రోగ నిరోధక శక్తిని పొందేందుకు వీలవుతుంది. శిశువు తల్లి పాలను తక్కువగా తీసుకోవడం మూలంగా, క్రమంగా శిశువు బరువు, మరియు శారీరిక, మానసిక ఆరోగ్య పరిస్థితుల మీద ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది.

9. ఆకస్మిక శిశు మరణాలకు కారణంగా ...
తల్లి పాలను ఇచ్చే దశలో ఆల్కహాల్ తరచుగా సేవించడం మూలంగా, శిశువు కాలేయం మీద ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇది ఆకస్మిక శిశు మరణాల అవకాశాలను పెంచవచ్చు. ఒక్కోసారి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారణంగా మారవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

10. నైపుణ్యాల అభివృద్ధిలో జాప్యం…
రొమ్ము పాలలో ఆల్కహాల్ ఉన్న కారణంగా బిడ్డల నైపుణ్యాల అభివృద్ధిలో ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే వారు తరచుగా మగత లేదా నిద్రమత్తులో ఉన్నట్లుగా భావిస్తారు, అయితే వారి దేహంలో చేరిన మద్యం మూలంగా ఎంత నిద్రపోయినా, చాలదు అన్నట్లుగానే ఉంటారు. అటువంటి శిశువులు బాహ్య ప్రపంచానికి ప్రతిస్పందించరు. మరియు క్రమంగా వీరి ఆలోచనా స్థాయిలు కూడా మందగిస్తుంటాయి. ఇది కాలానుగుణంగా మందబుద్దికి దారితీసే అవకాశాలు లేకపోలేదు.
కావున నవజాత శిశువుల సంరక్షణ విషయంలో ఏమరపాటు తగదని గుర్తుంచుకోండి. ఒక్కోసారి చిన్న చిన్న తప్పులే, దీర్ఘకాలిక సమస్యలను తీసుకుని రాగలవు. నవజాత శిశువు గాజుబొమ్మతో సమానం, అటువంటి బిడ్డకు తల్లే రక్షణ కవచాన్ని అందివ్వగలగాలి. అంతేకానీ, శిశువు అనారోగ్య పరిస్థితులకు కారణం కాకూడదు. ఈ మద్యనే జరిగిన ఒక సంఘటన ప్రకారం, తల్లి డిప్రెషన్ కంట్రోలింగ్ టాబ్లెట్స్ వేసుకున్న కారణంగా, తల్లి పాలు తాగిన శిశువు మరణాన్ని చవిచూడడం జరిగింది. అనగా తల్లి తీసుకునే ఆహారం, ఔషదాలు నెమ్మదిగా తల్లి పాల రూపంలో కొద్ది మోతాదులో అయినా శిశువుకు చేరుతాయని అర్ధం. కావున ఆల్కహాల్, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండడమే మేలని సూచించబడుతుంది. అంతేకాకుండా, మీరు అనుసరిస్తున్న మందులు వైద్యపర్యవేక్షణలోనే ఉన్నాయని ధృవీకరించుకోండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక మాతృత్వ, శిశు సంక్షేమ, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.