For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లిపాలకు ప్రత్యామ్నాయాలు!

By B N Sharma
|

Insufficient Lactation
కొత్తగా పుట్టిన పిల్లలకు తగినన్ని పాలు లేవని తల్లులు ఫిర్యాదు చేస్తూ వుంటారు. తల్లిపాలు పెంచటం కొంత కష్టమే! కనుక కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా పరిశీలించాలి. లేకుంటే బిడ్డకు పోషకాహార లేమి ఏర్పడుతుంది. కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తే....

1. బాటిల్ ఫీడింగ్ - తేలికైన ప్రత్యామ్నాయం బాటిల్ పాలు. బేబీలు తల్లి స్తనానికి, బాటీల్ పీకకు గల వ్యత్యాసాన్ని గమనించలేక ఇబ్బంది పడుతూంటారు. కనుక తల్లి బిడ్డకు బాటిల్ ను బిడ్డ పెదవులకు అందిస్తూ మెల్లగా అలవాటు చేయాలి.

2. కప్పుతో పట్టండి - బేబీ కప్పుతో కూడా తాగగలదు. పీకతో తాగలేని బేబీలు కొందరు కప్పుతో తాగించే అలవాటు చేయవచ్చు. పరి శుభ్రమైన పాలను కప్పులో పోసి బేబీకి పట్టవచ్చు. అయితే ఈ కప్పుకు ఒక కొమ్ము వుండి బిడ్డ పెదవులకు సరిపోయేలా వుండాలి. కొద్ది కొద్ది పాలను దానిలో పోస్తూ బిడ్డకు పట్టించాలి.

3. స్పూను లేదా వేలితో పాలు పట్టండి - కప్పుతో కూడా బిడ్డ తాగటానికి ఇబ్బందిపడితే చిన్నపాటి చెంచా లేదా పాలలో వేలు ముంచి పెదవులకు తాకిస్తూ అలవాటు చేయాలి. తర్వాత చెంచాతో కొద్ది కొద్దిగా పట్టాలి.

3. తగినన్ని పాలు తననుండి ఇవ్వలేని తల్లి ఈస్త్రోజన్ మరియు ప్రొజెస్టిరోన్ వైద్యంతో పాలను అధికం చేసే పద్ధతులను ఆచరించి తన బిడ్డకు పట్టి బంధాన్ని పెంచుకోవచ్చు.

4. పాలతో తయారైన ఘన ఆహారాలు మెత్తగా చేసినవి బిడ్డకు అందిస్తూ క్రమంగా బిడ్డను ఇతర పాల పదార్ధాలకు అలవాటు చేయవచ్చు. పాలు పట్టే తల్లులు కొద్దిపాటి వైద్యాలను చేయించుకొంటూ ఖచ్చితమైన ఆహార ప్రణాళికలు ఆచరించి కూడా తమ స్తనాల పాలను అధికం చేసుకొని బిడ్డకు పట్టవచ్చు.

English summary

Alternative Options For Insufficient Lactation | తల్లిపాలు తగినంత లేవా?

Breast Milk Recipes – Introducing solid foods and milky chews will gradually help baby to switch over from the breast feeding to other supplements. Also lactating mothers can undergo a few therapies and follow strict diet to increase the breast milk supply.
Story first published:Monday, September 19, 2011, 17:39 [IST]
Desktop Bottom Promotion