For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు గర్భవతులా? ఈ లక్షణాలు పరీక్షించండి!

|

Are You Pregnant? Check these Signs
శరీరంలో మార్పులు, రుతుక్రమం ఆగిపోటం మొదలైనవి గర్భం ధరించారనటానికి చిహ్నాలు. చాలామంది స్త్రీలు గర్భం ధరించిన చాలా రోజులవరకు కూడా కనీస లక్షణాలు గుర్తించలేరు. మరికొంతమంది వారి రుతుక్రమం ఆగిన కొద్ది వారాల వరకు కూడా తాము గర్భవతులమన్న విషయాన్ని గుర్తించలేరు. ఇటువంటి వారికి కొన్ని సూచనలు గా చెప్పాలంటే -

రక్తస్రావం: అండాశయ ఫలదీకరణ తర్వాత 8 లేదా 10 రోజులలో పింక్ లేదా బ్రౌన్ రంగులో లేదా కొద్దిపాటి లేదా అధికంగా రక్తస్రావం జరిగితే, ఈ చిహ్నాన్ని గర్భం ధరించినట్లు భావించవచ్చు. ఈ బ్లీడింగ్ జరిగే సమయంలో కొద్దిపాటి తిమ్మిర్లు కూడా కలుగవచ్చు.

ఆకలి: విపరీతమైన ఆకలి కలగటం కూడా గర్భవతులయ్యారనటానికి గుర్తే. అయితే, ఈ చిహ్నాన్ని గుడ్డిగా నమ్మవద్దు. ఇతర లక్షణాలు కనపడుతూంటే, ఇక గత చివరి సారి ఏ తేదీకి రుతుక్రమం అయిందో లెక్క వేసుకోండి.

చనుమొనలు నలుపుకు తిరగటం: చనుమొనలుచుట్టూ వున్న చర్మభాగం సాధారణంగా వుండవలసినదానికంటే నలుపు రంగుకు తిరిగితే గర్భవతి అయ్యారనటానికి అదీ ఒక నిదర్శనమే!

మెత్తగా లేదా ఉబ్బిన స్తనాలు: స్తనాలు ముట్టుకుంటే మెత్తగా అవడం గర్భధారణ చిహ్నమే. ఇక నొప్పి విషయానికి వస్తే పిరీయడ్స్ కు ముందరగా ఏరకమైన పెయిన్ వస్తూంటుందో అదే రకంగా వస్తూ గర్భం ధరించిన తదుపరి రోజులలో సర్దుకుపోతుంది.

పిరీయడ్స్ (రుతుక్రమం) ఆగిపోవటం: గర్భవతి అయ్యారనటానికి ఇది అతి సాధారణ లక్షణం. పిరీయడ్స్ రెగ్యులర్ గా వస్తూ, ఒక నెల ఆగిపోతే అది తప్పక గర్భధారణే! వెంటనే ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయించుకోండి.

ఉదయంపూట వికారంగా వుండటం: గర్భం ధరించిన కొద్ది రోజుల తర్వాత, మహిళలు వికారంగాను, కళ్ళు కొద్దిగా తిరగటంగాను భావిస్తారు. వాంతి చేసుకోవాలన్న భావన, కళ్ళు బైర్లు కమ్మటం వంటివి గర్భధారణ ఖచ్చితమని తేల్చేస్తుంది. ఈ లక్షణాలు సాధారణంగా ఉదయపు వేళలో నిద్ర లేచిన తర్వాత ఏర్పడతాయి.

తరచుగా మూత్ర విసర్జన, రుచి తెలియకపోవుట: మామూలు కంటే తరచుగా మూత్రం చేయటం నోరు రుచిని కోల్పోవటం గర్భ ధారణకు సూచనలే. పని ఏమీ లేకుండానే అలసి పోవటం, పొట్టలో కొద్దిపాటి నొప్పి లేదా మెలికలు తిరిగినట్లుండటం కూడా గర్భధారణ సూచనలే.

రతి కార్యక్రమం తర్వాత కొన్ని రోజులకు ఈ రకమైన గర్భధారణ లక్షణాలు కనిపిస్తే, రుతుక్రమం అయిన తేదీ నుండి లెక్క వేసుకోండి, వెంటనే ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయించుకోండి.

English summary

Are You Pregnant? Check these Signs | మీరు గర్భవతులా? ఈ లక్షణాలు పరీక్షించండి!

If any such symptoms of conception are occurring after several days of intercourse then start counting form the last period date and get a pregnancy test done immediately.Tender or swollen breasts: the breasts tender towards touch is a pregnancy symptom. The pain is similar to the one which occurs before the periods but with time the pain reduces during the later stages of pregnancy.
Story first published:Friday, August 12, 2011, 10:18 [IST]
Desktop Bottom Promotion