For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమస్యలు తెచ్చిపెట్టే పండ్లు!

By B N Sharma
|

Avoid These Fruits During Pregnancy
పండ్లు తింటే ఆరోగ్యం అంటారు. కాని సమస్యలు తెచ్చిపెట్టే పండ్లు కూడా వుంటాయి. ప్రత్యేకించి మహిళలు గర్భవతులుగా వున్నపుడు కొన్ని పండ్లు తినరాదు. అవేమిటో ఇపుడు పరిశీలిద్దాం.

బొప్పాయి: గర్భవతులు బొప్పాయి పచ్చిగా వున్నపుడు తింటే గర్భ విచ్ఛిన్నం లేదా త్వరిత ప్రసవానికి దోవతీస్తుంది. అయితే బొప్పాయి పూర్తి పండు దశలో తింటే అందులోని విటమిన్ సి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలకు పాలు పడాలంటే...పూర్తిగా పండిన బొప్పాయి పండు లో తేనె కలిపి తింటే పుష్కలమైన పాలు పడతాయి. అంతే కాదు పండు గర్భవతులలో వచ్చే గుండె మంట, మలబద్ధకం వంటి సమస్యలు కూడా పోగొడుతుంది. అయినప్పటికి, సురక్షిత ప్రసవాలకుగాను గర్భవతులుగా వున్నపుడు బొప్పాయిని పూర్తిగా వదిలేయటమే మంచిదని కూడా నిపుణులు చెపుతారు.

నల్ల ద్రాక్ష: వైద్యులు గర్భవతులుగా వున్నపుడు, ప్రత్యేకించి గర్భిణీ మొదటి త్రైమాసికంలో నల్లద్రాక్ష తినవద్దని సలహా ఇస్తారు. దీనికి కారణం నల్లద్రాక్ష శరీరంలో పుట్టించే వేడి గర్భంలోని శిశువుకు మంచిది కాకపోవటమే.

పైన్ ఆపిల్స్: గర్భవతులుగా వున్నపుడు పైన్ ఆపిల్స్ కూడా వదిలేయాలి. ఈ పండులో బ్రొమెలైన్ అధికంగా వుంటుంది. ఇది గర్భాశయాన్ని శుభ్రం చేసి త్వరిత ప్రసవానికి లేదా విచ్ఛిన్నానికి దోవతీస్తుంది. మొదటి త్రైమాసికంలో అసలు తీసుకోరాదు.

గర్భవతులు ఏ ఇతర పండ్లు తీసుకున్నప్పటికి వాటిని బాగా కడిగి ఏ రకమైన క్రిములు లేవని నిర్ధారించుకొని తినటం మంచిది. లేదంటే వ్యాధులకు అతి త్వరగా గురయ్యే ప్రమాదముంది.

English summary

Avoid These Fruits During Pregnancy | సమస్యలు తెచ్చిపెట్టే పండ్లు!

It is very important to avoid unwashed and unpasteurized fruits or vegetables during pregnancy. This will prevent the pregnant woman from getting infections from thermoplastics. Caution in your diet will help in having a healthy and safe delivery. Avoid these fruits during pregnancy and stay safe.
Story first published:Tuesday, August 30, 2011, 10:13 [IST]
Desktop Bottom Promotion