For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముద్దుగా, బొద్దుగా బిడ్డ పుట్టాలంటే......!

By B N Sharma
|

Must Have Nutritious Prenatal Juices!
తల్లి కాబోయే మహిళలు పుట్టబోయే తమ బిడ్డకు మంచి పోషకాహారాన్నందించాలి. ప్రతి రోజూ ఒక గ్లాసెడు పండ్ల రసం తాగితే అది మీరు ఆహారంలో తీసుకోవాల్సిన విలువలన్ని ఇస్తుంది. చెడు ఫలితాలు ఏమీ లేని విటమిన్లు, మినరల్స్ అన్నీ అందుతాయి. గర్భవతిగా వున్నపుడు తీసుకోవాల్సిన వెజిటబుల్స్, పండ్ల రసాలు మొదలైనవి పరిశీలిద్దాం!

సాధ్యమైనంతవరకు ఎరువులు, పురుగుమందులు వేయకుండా వున్న ఆహార పదార్ధాలను, విషపూరిత పదార్ధాలున్న ఆహారాలను వదలండి. టాక్సిక్ ఆహారాలు బేబీ ఎదుగుదలను, మెమొరీని అరికడతాయి. తాజా పండ్లు, కూరగాయల రసాలు తాగండి. కడుపులోని బిడ్డకు పోషక విలువలు కల ఆహారం అందుతుంది. వైద్యుని సలహాపై కొన్ని విటమిన్లు కూడా వాడవచ్చు. టీ లేదా కాఫీ తాగే వారైతే, వీటికి బదులు పండ్ల రసాన్ని తాగండి. శరీరానికి అవసరమైన నీరు లభించటమే కాక పోషకాలు కూడా అందుతాయి.

ఉదయపు వేళ వికారం తగ్గటానికిగాను అల్లం రసం తీసుకోండి. దీని వలన పొట్టలోని గ్యాస్ పోయి పేగులు విశ్రమిస్తాయి. జీర్ణక్రియ సాఫీగా వుండి హాయిగా వుంటుంది. అల్లాన్ని జ్యూసులలో కూడా కలుపుకోవచ్చు. అరటి పండ్ల రసాన్ని తాగండి. ఇందులో విటమిన్ బి 6 వుంటుంది. ఇది కొత్త ఎర్రకణాలను, యాంటీబాడీలను పుట్టిస్తుంది. బేబీ బ్రెయిన్ కు నరాల వ్యవస్ధకు అరటిపండు బాగా పని చేస్తుంది. గర్భవతి చివరి దశలో కనుక కేరట్ రసం తాగుతూంటే అది బేబీకి కామెర్లవంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. కేరట్ జ్యూస్ ను అరటి, టొమాటో మొదలగు ఇతర అనువైన రసాలతో కూడా కలుపుకొని తాగవచ్చు.

ఆరోగ్యకరమైన, పోషక విలువలు కల ఈ పండ్ల రసాలు గర్భవతి తాగితే ఆమెకు కావలసిన విటమిన్లు, కడుపులోని బిడ్డ ఎదుగుదలకు కావలసిన పోషకాలు లభిస్తాయి.

English summary

Must Have Nutritious Prenatal Juices! | ముద్దుగా, బొద్దుగా బిడ్డ పుట్టాలంటే......!

Carrot juice if consumed during the last few weeks of pregnancy reduces the chances of jaundice in the baby. You can mix carrot juice with banana, spinach, tomato or broccoli during pregnancy to add more nutrition to it.
Story first published:Wednesday, September 21, 2011, 10:24 [IST]
Desktop Bottom Promotion