Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
గర్భవతికి వైద్య పరీక్షల షెడ్యూల్ అవసరమా?

మొదటి పరీక్ష అయిన తర్వాత నుండి 4 నుండి 6 వారాలలోపు రెండవ పరీక్ష చేయించాలి. 30 వారాల గర్భం అయిన తర్వాత ప్రతి రెండు లేదా మూడు వారాలకొకసారి పరీక్ష చేయించాలి. 36వ వారం గర్భవతిగా అయినపుడు ఇకనుండి ప్రతి వారం లేదా పదిహేను రోజులకొకసారి కాన్పు అయ్యేటంతవరకు పరీక్షలు చేయించాలి. మొదటి పరీక్ష ప్రాధాన్యత - గర్భవతి అయ్యి ఎన్ని రోజులయిందనేది అల్ట్రాసౌండ్ తో లెక్కిస్తారు. రక్త పరీక్ష చేసి బ్లడ్ గ్రూప్ నిర్ణయిస్తారు. కుటుంబంలోని కాన్పుల చరిత్ర పరిశీలిస్తారు. గర్భవతికి అవసరమైన విటమిన్లు మొదలైనవి ఎలా వాడాలి ఏం వాడాలి అనేది సలహానిస్తారు. తర్వాతి పరీక్షలో గర్భవతి బరువు, రక్తపోటు, బేబీ గుండె చప్పుడు పరీక్షిస్తారు. బేబీ ఎదుగుదల పరిశీలిస్తారు.
మూడవ త్రైమాసికంలో.....వైద్య పరీక్షలు తరచుగా వుంటాయి. ఈ సమయంలో చాలామంది మహిళలు సమస్యలు ఎదుర్కొంటారు. ఒక్కొక్కపుడు అనుకున్న దానికంటే ముందుగానే డెలివరీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. గర్భవతి మహిళకు కాన్పు ముందు, కాన్పు తర్వాత కూడా వైద్య పరీక్షలు చాలా అవసరం. డాక్టర్ తో తరచుగా సంప్రదించండి. డాక్టర్ కు మీ పరిస్ధితి వివరించటానికి వెనుకాడవద్దు. సరైన వైద్య పరీక్షలతో గర్భవతి దశను ఆనందించండి.



Click it and Unblock the Notifications
