For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల జననం! నీటిలో సురక్షితం, సుఖవంతం....!

By B N Sharma
|

Water Births: Are They Safe?
ఆధునిక వైద్య చరిత్రలో ఆడవారిని నీటిలో కాన్పు చేయించటాలు ఒక కొత్త తరహా ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాయి. పాతకాలంనాటి కాన్పుల పద్ధతులే మరోమారు జీవం పోసుకుంటున్నాయి. ఈ నీటి కాన్పులు అనాది కాలంలో జరిగినవే. ఇపుడు కొత్తగా సైంటిస్టులు వీటికి ఆధునికతలను జోడించి వాటి ప్రయోజనాలు వివరిస్తున్నారు. అనాది కాలంలో మహిళకు కాన్పు సమయంలో వచ్చే నొప్పులను తగ్గించటానికి గాను నీటిలో ప్రసవం చేయించేవారు. చరిత్ర పరిశీలిస్తే, చాలా జననాలు ఒకప్పుడు నీటిలో జరిగేవని తెలుస్తోంది. దీనికిపుడు శాస్త్రీయత జోడించారు మన వైద్యరంగ నిపుణులు. పాతకాలంలో అమెరికా దేశ నాగరికతలలో నీటి కాన్పులు పిల్లలు పుట్టటానికి సహజమైనవిగా వుండేవి.

ప్రయోజనాలు పరిశీలిస్తే....
కాన్పుల నొప్పులు- ఈ ప్రక్రియలో మహిళను నులివెచ్చని వేడికల నీటిటబ్ లో వుంచి శరీర మర్దనలు, ఆరోమా ధిరపీలు, లాఫింగ్ గ్యాస్ వదలటం మొదలగు వాటి ద్వారా ఆమెకు నొప్పులు తెలియకుండా చేస్తారు.

వెన్ను నొప్పి రాదు- సాధారణంగా తల్లులయ్యే మహిళలు వెన్ను నొప్పితో బాధపడుతూంటారు. వేడినీటి వినియోగం, శారీరక మర్దనల వలన చక్కటి ఉపశమనం మహిళకు లభించి వెన్ను నొప్పి మాయమవుతుంది.

శ్వాసకు సహకరిస్తుంది - కాన్పు నొప్పులలో మహిళకు ఎంతో అలసట, ఆందోళన కలిగి వుంటాయి. శ్వాస మారుతుంది. వేడి నీరు, ఆరోమా వైద్యం మహిళను చక్కటి దీర్ఘ శ్వాసలు తీసుకునేలా చేస్తుంది. దీనితో ఆమె కండరాలకు అవసరమైన కదలికలు ఏర్పడతాయి.

బిడ్డకు ఆహ్లాదం - కాన్పు తర్వాత బయటకు వచ్చిన బేబీ సహజ సిద్ధమైన నీటిలో బయటపడటం వలన తల్లి గర్భంలో వున్న ద్రవాలనుండి బయటపడి పరిశుభ్రత అనుభూతి పొందుతుంది.

నీటి కాన్పు వలన నష్టాలు:
నీటి కాన్పు తల్లికి, బిడ్డకు ఎంత సురక్షితమనేది చర్చనీయాంశమే. బిడ్డ నీరు తాగేస్తే? పెద్ద ఉపద్రవమే. తల్లి శరీరంనుండి నోరు తెరిచి ఏడుస్తూ బయటపడే బిడ్డ ఎంతో కొంత నీరు తాగేస్తుంది. అదే నీటిలో తల్లి రక్తం, ఇతర పదార్ధాలు వుండి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి.

బిడ్డ మునిగితే? ఆధుని వైద్యం అంతవరకు రానివ్వకపోవచ్చు.
నీటిలో వున్న తల్లి ప్రసవసమయంలో ఎంత రక్తాన్ని బయటకు స్రవిస్తోందో తెలియని పరిస్ధితి. నీరు తరచుగా మార్చటం కూడా కుదరని పనే. సాదారణం కన్నా అధికంగా బ్లడ్ పోతే నీరు మార్చాల్సిందే. గత అయిదారేళ్లుగా నీటి కాన్పులు, డాక్టర్లు, మహిళలు, వైద్య నిపుణులు అందరూ ఆమోదిస్తూనే వున్నారు. కనుక భవిష్యతుత్లో వీటికి మంచి ఆదరణ లభించి మరింత సురక్షితం, సుఖవంతం కాగలవని భావించవచ్చు.

English summary

Water Births: Are They Safe? | పిల్లల జననం! నీటిలో సురక్షితం, సుఖవంతం....!

Water births are the new fad in the medical industry. Every one is talking about this supposedly natural child birth method that has been resurrected from the past. Yes its true. Water births are not something scientists came up with at the spur of the moment.
Story first published:Friday, August 19, 2011, 14:27 [IST]
Desktop Bottom Promotion