For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీలో తల వెంట్రుకలు రాలకుండా...!

By B N Sharma
|

Ways To Cure Prenatal Hair Loss!
గర్భవతిగా వున్నపుడు మహిళకు అనేక మానసిక, శారీరక మార్పులు వస్తాయి. బరువు పెరగట, వికారం, నిద్ర సరిగా లేకుండుట, తరచు ఆందోళనలు, మొదలైనవన్ని మహిళ ఎదురొ్కంటుంది. వీటికి కారణం శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పు. వాటిల్లో అతి సాధారణమైంది మహిళకు వెంట్రుకలు ఊడిపోవటం. సాధారణంగా వెంట్రుకలు ఊడటానికి కారణం విటమిన్లు చాలినన్ని శరీరానికి అందక పోవడం, ఫోలిక్ యాసిడ్ లోపించడం. కనుక గర్భవతి దశలో వెంట్రుకలు ఊడకుండా పరిష్కారం ఏమిటన్నది పరిశీలిద్దాం...

ఫోలిక్ యాసిడ్ అందించండి - ప్రెగ్నెన్సీ సమయంలో వెంట్రుకలు ఎదుగుదల చూపుతాయి. అయితే అదే సమయంలో జుట్టు రాలిపోవటం కూడా జరుగుతుంది. దీనికిగాను ఆహారంలో ఫోలిక్ యాసిడ్ చేర్చితే అది బేబీ ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. ఫోలిక్ యాసిడ్ ఆకుకూరలు, బీట్ రూట్, మొలకెత్తిన విత్తనాలు, బ్రక్కోలి, బీన్స్, నిమ్మజాతి పండ్లలో అధికంగా వుంటుంది.

గర్భవతిగా తీసుకోవలసిన విటమిన్లు- గర్భవతులకు ప్రత్యేకించి తయారు చేస్తారు. వీటిలో ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ కూడా వుంటాయి. కనుక ఆహారాన్ని సమతుల్యం చేయాలంటే విటమిన్లు వాడాలి.

ఐరన్ - ఐరన్ అధికంగా వుండే పండ్లు కూడా వెంట్రుకలు రాలకుండా తోడ్పడతాయి. రక్తప్రసరణ పెంచి కొత్త వెంట్రుకల కణాలను పెంచుతాయి. బీన్స్, గోంగూర, రాగి, మెంతులు, మొలకలు, కేరట్ సోయా బీన్స్, బాదం, మొదలైనవి ఐరన్ అధికంగా గల పదార్ధాలు.

కాల్షియం - తినే ఆహారాలలో కాల్షియం అధికంగా వుంటే మహిళకు వ్యాధులు రావు. ఆరోగ్యకరమైన శరీరానికి, తల జుట్టుకు కాల్షియం అధికంగా వుండే పాల ఉత్పత్తులు, చేపలు, బీట్ రూట్, ములక్కాడలు, పచ్చటి ఆకు కూరలు గర్భవతి దశలో పుష్కలంగా తినాలి.

English summary

Ways To Cure Prenatal Hair Loss! | ప్రెగ్నెన్సీలో తల వెంట్రుకలు రాలకుండా...!

Prenatal vitamins: These are specially formulated multivitamins for the expecting and nursing mothers. It is a rich supplement of nutrients like folic acid, calcium and iron, therefore balancing these deficiencies in the pregnant woman's diet. The prenatal vitamins consists of vitamins and minerals which cures prenatal hair loss.
Story first published:Monday, October 17, 2011, 14:49 [IST]
Desktop Bottom Promotion