For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను అందుకు రెడీగా వున్నానా?

By B N Sharma
|

What To Do After Pregnancy Test Is Positive?
నేను అందుకు సిద్ధంగా వున్నానా? నా శరీరం అందుకు సహకరిస్తుందా? ఈ విషయం అతనికెలా చెప్పాలి? అనేవి ప్రతి మహిళ తాను గర్భవతి అయిన తర్వాత ఎదుర్కొనే ప్రశ్నలు. అంతే కాదు కొంతమేరకు ఆందోళన పడటం కూడా సహజమే. అటువంటపుడు మహిళ పరిస్ధితిని ఏ రకంగా చక్కదిద్దుకోవాలో పరిశీలించండి!

రక్త పరీక్ష - గర్భం ధృవ పరచుకునేటందుకై రక్త పరీక్ష చేయించండి. గైనకాలజిస్టు ను సంప్రదించి కొన్ని సలహాలను తీసుకోండి. సమస్యలేవైనా వుంటే రక్త పరీక్షలో వెల్లడవుతాయి.

ఒకరికొకరు అభినందించుకోండి - గర్భం ధరించారని తెలియంగానే పురుషుడు కూడా సంతోష పడతాడు. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. సహకరించుకోండి. పురుషులు పైన పడుతున్న భాధ్యతలకు భయపడతాడు. గర్భాన్ని కొనసాగించాలనుకుంటే ఇద్దరూ ఆనందంగా కొనసాగండి.

వేక్సినేషన్ - చలికాలమైతే గర్భవతులకు ఫ్లూ, ఇతర ఇన్ ఫెక్షన్లు వచ్చి బిడ్డకు సోకే ప్రమాదముంది. కనుక వేక్సినేషన్ చేయించండి.

మానసికంగా రెడీ అవండి - మహిళలకు గర్భం ధరించడమంటే ఎంతో ఒత్తిడి. డెలివరీ ఎలా అవుతుందోనన్న భయం వుంటుంది. బేబీ భవిష్యత్తు, భాధ్యతలు అన్నీ ఆమెకు సమస్యగా వుంటాయి. ఆహారం, ఆరోగ్యం, వ్యాయామాలు మొదలైనవి ప్రాధాన్యత పొదుతాయి. కుటుంబంలో మరో మెంబర్ వస్తున్నారన్న ఆనందం తో పాటు జంటల మధ్య అనురాగం కూడా పెరుగుతుంది.

English summary

What To Do After Pregnancy Test Is Positive? | అతనికెలా చెప్పాలి?

Prepare mentally: For a woman, getting pregnant can be very stressful. Tensions of the delivery, baby's future and responsibilities can frighten her also. Its time to be careful about your diet, exercise and health concerns. You have to prepare mentally that a new member is going to come to the family and the unknown fact is, after a baby, the love between couples increases more!
Story first published:Saturday, November 19, 2011, 10:13 [IST]
Desktop Bottom Promotion