Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
గర్భిణీ తీసుకోవలసిన ఓ దివ్వ ఔషదం: ఆరెంజ్ జ్యూస్

ఇందులో ప్రతి 100మి.గ్రాపండులో 60మి.గ్రా. విటమిన్ సి'ఇస్తుంది. సీజన్ మెదట్లో ఈ పండులో విటమిన్ ‘సి' శాతం ఎక్కువగా ఉంటుంది. సీజన్ చివర్లో తగ్గుతుంది. అంతే కాదు నారిం. పండులో విటమిన్ ‘ఎ' పొటాషియమ్ , కాల్షియం, ఫాస్ఫరస్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. సోడియం శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బిపి ఉన్నవారికి మంచిది. అలాగే డయాబెటిస్ ఉన్న వారు కూడా దీన్నీ తీసుకోవచ్చు. రోజూ ప్రొద్దున్నే ఆరంజ్ జ్యూస్ (పరగడుపున) తీసుకుంటే ఇది ఒక మంచి టానిక్ లా పనిచేస్తుంది. అరుగుదల పెంచుతుంది. జలువు, ఆర్థరైటీస్, జ్వరం వున్నవారికి ఆరంజ్ జ్యూస్ మంచి ఉపయోగకారి, ఆరంజ్ తొక్కలోని నూనె(త్రేన్పు)లను అరికడుతుంది. ఆరంజ్ తో మీరు సులభంగా చేసుకోవడానికి ఇక్కడ రెండు వంటకాలు...
ఆరెంజ్ క్రీమ్ : ఆరెంజ్ పండ్లు: 6, క్రీమ్(పాలమీగడ): 1కప్పు, తేనె: 1టేబుల్ స్పూన్
తయారు చేయు విధానం: ఆరెంజ్ పండ్లను శుభ్రంగా కడగాలి, పీలర్ తో తొక్కని కాస్తంత చెక్కుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక చెంచాడు వస్తే సరిపోతుంది. ఆరెంజ్ తొనలని వలిచి ఒక గాజు గిన్నెలో సర్థండి, క్రీమ్ తో తేనె, ఆరెంజ్ పీల్ కలిపి సర్ధివుంచిన తొనలపై వేయండి. అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత తీసుకోవాలి. ఇది శక్తిని, కాల్షియంను, విటమిన్ ‘సి', ఫోలిక్ యాసిడ్ ఇతర ఖనిజ లవణాలను ఇస్తుంది. అలసి ఇంటికి వచ్చినప్పుడు, ప్రయాణానికి ముందర, పెరిగే పిల్లలకు, వయసు మళ్ళిన వారికి ఆడవారికి చాలా మంచిది.
నిలవ ఆరెంజ్ తొక్కలు: నారింజ తొక్కలు : ఒక కప్పు, పంచదార: అరకప్పు, ఆరెంజ్ ఎసెన్స్: చిటికెడు
తయారు చేయు విధానం: ఆరెంజ్ తొక్కలను శుభ్రంగా కడిగి కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి. నీరు లేకచుండా పంచదారతోపాటు, ఎసెన్స్ కలిపి పొయ్యి మీద పెట్టాలి. చెక్క గరిటెతో కలియబెడుతూ వుండాలి. మరీ పొడిగా అయితే కొద్దిగా నీళ్ళు పోయండి. నీరంతా ఇంకిపోయే వరకూ ఉడికించండి. చల్లారిన తర్వాత శుభ్రమైన సీసాలో నిలువ చేసుకోవచ్చు. దీన్ని బ్రెడ్, చపాతీతో తింటే రుచిగా ఉంటుంది. ఆరెంజ్ తొక్కలో బయోప్లెమొనాయఇడ్స్ పెల్టిస్ వుంటాయి. ఇవి కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతాయి.



Click it and Unblock the Notifications
