Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
గర్భిణీ స్త్రీల కొరకు ప్రత్యేకమైన సమ్మర్ స్పెషల్ జ్యూసులు...!
గర్భాధారణ సమయంలో మీరు ఏదైతే తింటారో అవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అయితే ప్రెగ్నెన్సీని ఎక్స్ పెక్ట్ చేసే వారైతే ఏది తినాలి, ఏది తినకూడదు..ఏదీ త్రాగాలి ఏది తాగకూడదని ఆలోచించాలి. ఉదా: గర్భిణీ స్త్రీలకోసమైతే ఫొల్లెట్ రిచ్ ఫుడ్స్ అనేకం ఉన్నాయి. ఈ ఫొల్లెట్ రిచ్ ఫుడ్ కడుపులో పిండం ఆరోగ్యంగా పెరుగుటకు బాగా సహాయపడుతుంది. అయితే పండ్ల విషయంలో మాత్రం ఆరోగ్యకరమైన పండ్లు కొన్ని మాత్రమే తినవచ్చని గర్భిణీ స్త్రీలకు తెలుసు. హెల్తీ ఫ్రూట్స్ ను ప్రెగ్నెన్సీ పీరియడ్ లో అధికంగా తీసుకోవాలి.
అలాగే పండ్లతో తయారు చేసే ఫ్రూట్ జ్యూసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మరియు తగినన్ని న్యూట్రీషియన్స్ ను అందిస్తాయి. ప్రస్తుతం సమ్మర్ సీజన్ లో మాములు మనుషులతో పాటు గర్భిణీ స్త్రీలు హైడ్రేషన్ కలిగి ఉండటం చాలా అవసరం. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఫ్లూయిడ్స్ అంటే జ్యూసులు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ వల్ల బయటపడవచ్చు. ఈ వేసవికాలంలో చాలా వరకూ ఎక్కువ మంది డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. ఇది సమ్మర్ లో సర్వ సాధారణం. గర్భిణీ స్త్రీలలో మరో వైరల్ హెల్త్ ప్రాబ్లెమ్ మలబద్దకం సమస్య. మరి ఇటువంటి అన్ని సమస్యలను నివారించడానికి ఫ్రూట్ జూసులు బాగా సహాయపడుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలోని విషాలను మరియు ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించి శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది.
కాబట్టి చల్లగా ఉండే కూల్ డ్రింక్స్, సోడాలకు తాగడం కన్నా(గర్భిణీ స్త్రీలకు హాని కలిగించే)కొన్ని హెల్తీ సమ్మర్ జ్యూసులను తాగడం గర్భిణీ స్త్రీలకు శ్రేయస్కరం. మరి ఆ హెల్తీ జ్యూసులేంటో ఒకసారి చూద్దాం...

వాటర్ మెలోన్(పుచ్చకాయ జ్యూస్: ఈ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ లో నీరు అధికంగా ఉంటుంది. కాబట్టీ ఎటువంటి ఆందోన లేకుండా పుచ్చకా జ్యూసును గర్భిణీ స్త్రీ తీసుకోవచ్చు.

స్వీట్ లైమ్ జ్యూస్: స్వీట్ లైమ్ జ్యూస్ శరీరానికి చల్లదనాన్ని కలిగించడంతోపాటు, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది మరియు గర్భణీస్త్రీలను అధికంగా బాధించే వాంతులు మరియు వికారాన్ని నివారిస్తుంది.

లో ఫ్యాట్ మిల్క్: ఈ పాల ఉత్పత్తులు గర్భిణీ స్త్రీలకు చాలో ఆరోగ్యకరమైనవి. డైరీప్రొడక్ట్స్ లో కాల్షియం మరియు శరీరానికి అవసరమయ్యే ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి గర్భాధారణ సమయంలో ప్రతిరోజూ పాలు తాగడం చాలా అవసరం.

క్యారెట్ జ్యూస్: క్యారెట్ జ్యూస్ లో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు క్యారెట్ జ్యూస్ చర్మ మరియు జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గర్భిణీ స్త్రీ క్యారెట్ జ్యూస్ త్రాగడం వల్ల గర్భాధారణ సమయంలో మరియు ప్రసవం తర్వాత చర్మ మరియు కేశాల్లో వచ్చే సమస్యలను నివారించగలుగుతారు.

నిమ్మరసం: నిమ్మరసం మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. ఇంకా ఇది శరీరంలోని విషాలను బయటకు పంపుటకు మరియు మార్నింగ్ సిక్ నెస్ ను తొలగించడానికి నిమ్మరసం బాగా సహాయపడుతుంది.

పుదీనా జ్యూస్: గర్బిణీ స్త్రీ తాగేటటువంటి ఆరోగ్యకరమైన జ్యూస్ ఇది. పుదీనా ఆకులు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. ఇంకా వేవిళ్ళను, కడుపులో వికారాన్ని సహజంగానే నివారిస్తుంది.

అవొకాడో జ్యూస్: గర్బిణీ స్త్రీ తీసుకొనేటటువంటి మరో హెల్తీ జ్యూస్ అవొకాడో జ్యూస్. అవొకాడోలో ఉండే పొటాషియం కంటెంట్ బేబీ పెరుగుదల మరియు అభివృద్ధికి బాగా సహాయపడుతుంది.

బనానా జ్యూస్: అరటి పండులో ఉండే పోషకాంశాలను పక్కన పెడితో గర్భిణీ స్త్రీ తీసుకోవల్సినటువంటి హెల్తీ ఫ్రూట్ జ్యూస్ ఇది. అరటిపండు శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపబడుతుంది. ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్ ను నయం చేస్తుంది. దాంతో జీర్ణక్రియ సవ్వంగా పనిచేస్తుంది.

మామిడి జ్యూస్: వేసవి అంటే మామిడి సీజన్. అయితే గర్భిణీ స్త్రీలు మామిడి పండ్లను, మామిడి జ్యూసుల తీసుకోకూడదని చాలా కధనాలున్నాయి. అయితే, మామిడి పండును అధికంగా కాకుండా గర్భధారణ సమయంలో మామిడి జ్యూస్ లేదా మిల్క్ షేక్ వంటివి తాగవచ్చు. మీకు తాగవచ్చా? లేదా అన్నది మీ డాక్టర్ ను సంప్రదించవచ్చు.

కీర దోసకాయ జ్యూస్: ఈ కీరదోసకాయ జ్యూస్ శరీరానికి చల్లదాన్ని అందించడంతో పాటు శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు ఈ హెల్తీ మరియు లోక్యాలరీస్ కలిగిన జ్యూస్ ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications
