For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో రక్తస్రావానికి కారణం ఏమిటి ?

By Super
|

గర్భధారణ సమయంలో మొదటి త్రైమాసికంలో యోని రక్తస్రావం తరచుగా సంభవించవచ్చు. అయితే ఈ రక్తస్రావం సాధారణం మరియు ఎటువంటి సమస్యలను కలిగి ఉండదు. రక్తస్రావం గర్భం ధరించిన రెండవ మరియు మూడవ త్రైమాసికంలో సంభవిస్తే మాత్రం కొన్ని తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక రక్తస్రావం అనేక కారణాల వలన కూడా సంభవించవచ్చు.

యోని రక్తస్రావం కలగటానికి కొన్ని రకాల అంటువ్యాధులు,ఒత్తిడి సంబంధిత హార్మోన్ల మార్పులు మరియు అక్రమ లైంగిక సంబంధం వంటి కారణాలు ఉండవచ్చు.

What Bleeding During Pregnancy Means

రక్తస్రావం అనేది గర్భం యొక్క మొదటి సగం సమయంలో గమనిస్తే దాని వలన ఈ క్రింది సమస్యలు సంభవించవచ్చు: -

1. గర్భస్రావం

రక్తస్రావం అనేది గర్భస్రావం యొక్క సంకేతం అని చెప్పవచ్చు. అయితే గర్భస్రావం ఆసన్నమైందని అర్ధము కాదు. కొన్ని అధ్యయనాల ప్రకారం మహిళలలో ప్రారంభ గర్భంలో 20-30% వరకు రక్తస్రావం కొంత అనుభవంలోకి వస్తుంది. అయితే ఈ రక్తస్రావం వలన సగం మహిళలలో గర్భస్రావం జరగదు. కానీ ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

2. గర్భసంచికి బయట పిండం ఏర్పడుట

గర్భసంచికి బయట పిండం ఏర్పడుట అంటే గర్భాశయం బయట ఎక్కడైనా ఆ ఇంప్లాంట్ గర్భధారణలు జరగవచ్చు. గర్భసంచికి బయట నాళంలో పిండం ఏర్పడుట ఎక్కువగా జరుగుతుంది. గర్భసంచికి బయట పిండం ఏర్పడటం అనేవి గర్భస్రావాలు కంటే తక్కువగా జరుగుతాయి. ఇది సుమారు 1 నుంచి 60 గర్భధారణలలో ఒకటి చోటుచేసుకోవచ్చు.

3. మోలార్ గర్భం

ప్రారంభ రక్తస్రావం మోలార్ గర్భధారణకు ఒక అరుదైన కారణంగా ఉండొచ్చు.తరచుగా దీనిని ఒక "మోల్" గా సూచిస్తారు. మోలార్ అంటే గర్భ పిండానికి బదులుగా అసాధారణ కణజాలం అభివృద్ధి చెందుతుంది. దీనిని గర్భధారణ ట్రోపోబ్లాస్టిక్ వ్యాధి (GTD) గా కూడా సూచిస్తారు.

రక్తస్రావం అనేది గర్భం యొక్క రెండోవ సగం సమయంలో గమనిస్తే దాని వలన ఈ క్రింది సమస్యలు సంభవించవచ్చు: -

1. ప్రసవానికి ముందు మావి

గర్భాశయ గోడ నుండి లేదా డెలివరీ సమయంలో యోని స్రావం నుండి మాయ వేరుపడటం సంభవించవచ్చు. గర్భిణీ స్త్రీలలో ఈ సమస్య 1% మాత్రమే ఉంటుంది. ఇది సాధారణంగా గర్భధారణ చివరి 12 వారాల సమయంలో ఏర్పడుతుంది.

2. మావి మనోవికారం

మావి గర్భాశయంలో తక్కువగా ఉన్నప్పుడు మావి మనోవికారం ఏర్పడుతుంది. అప్పుడు గర్భాశయమును పాక్షికంగా లేదా పూర్తిగా కవర్ చేస్తుంది. ఇది ప్రమాదకరమైనది మరియు తక్షణ శ్రద్ధ అవసరం. ఇది 200 గర్భాలలో ఒకటి సంభవిస్తుంది. సాధారణంగా రక్తస్రావం నొప్పి లేకుండా జరుగుతుంది.

3. ముందుగా డెలివరీ

యోని రక్త స్రావం డెలివరీ సంకేతంగా ఉండవచ్చు. కొన్ని వారాల ముందే డెలివరీ,మ్యూకస్ బయటకు రావటం జరగవచ్చు. సాధారణంగా రక్తం యొక్క ఒక చిన్న మొత్తంతో మ్యూకస్ రూపొందించబడింది. ఇది ముందుగా సంభవించి,ముందుగా డెలివరీ అయితే వెంటనే మీ వైద్యునికి చూపించాలి.

రక్తస్రావం హానికరముగా ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఒకవేళ మీకు రక్తస్రావం ఉంటే కనుక తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి:-

1. మీకు రక్తస్రావం ఉంటే మీరు ఎల్లప్పుడూ ఒక ప్యాడ్ లేదా ప్యాంటీ లైనర్ ధరించాలి. మీరు ఎదుర్కొంటున్న రక్తస్రావం ఏ రకం మరియు ఎంత రక్త స్రావమో మానిటర్ చేయవచ్చు.

2. యోని ప్రాంతంలో కాటన్ లేదా ఇతర ఇంకే మెటీరియల్ పెట్టటం లేదా యోని ప్రాంతంలో ఏదైనా పిచికారి చేయటం లేదా మీరు రక్తస్రావం ఎదుర్కొనే సమయంలో లైంగిక సంబంధం వంటివి చేయకూడదు.

3. మీరు పైన పేర్కొన్న లక్షణాలను ఎదుర్కొంటుంటే సాధ్యమైనంత త్వరగా మీ వైద్యుడిని సంప్రదించాలి.

English summary

What Bleeding During Pregnancy Means

During Pregnancy vaginal bleeding can occur frequently in the first trimester. This bleeding is normal and does not have any problems. But if the bleeding occurs in the second and third trimester of pregnancy, there might be chances of some serious complications.
Story first published: Thursday, November 14, 2013, 17:56 [IST]
Desktop Bottom Promotion