For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిజేరియన్ కంటే నార్మల్ డెలివరీ బెటర్ అనడానికి గల 8 కారణాలు

By Super
|

చాలామంది కాబోయే తల్లులు ఈమధ్య నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ వైపే మొగ్గుతున్నారు.దీనికి కారణాలనేకం.అందులో ముఖ్య కారణం సిజేరియన్ లో నొప్పు పడక్కరలేకపోవడం.పైగా కావాల్సిన రోజు కావాల్సిన సమయాన్ని ఎన్నుకుని సిజేరియన్ చేయించుకోవచ్చు.

కానీ నార్మల్ డెలివరీ యే మంచిది. ఎందుకో తెలుసా?

ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం:

ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం:

శిశువులకి నార్మల్ డెలివరీ యే ఆరోగ్యకరం.ఇలా పుట్టిన పిల్లలలో శ్వాశ కోస సంబంధిత వ్యాధులైన టీ.ఎన్.ఎన్.(ట్రాన్సియెంట్ టకిప్నియా ఆఫ్ నియోనేట్) లాంటి వ్యాధులు తక్కువ.నార్మల్ డెలివరీ అప్పుడు జరిగే సంకోచాల వల్ల శిశువు ఊపిరితిత్తుల నుండి ద్రవాలు బయటకి వచ్చెస్తాయి.ఈ సంకోచాలు ఎపీనెఫ్రైన్ అనే హార్మోను ని కూడా విడుదల చేస్తాయి.ఈ హార్మోను శిశువు ఊపిరితిత్తులనుండి ద్రవాలు బయటకి పంపిచ్చడం లో సహాయపడుతుంది.అందువల్ల శిశువు సరిగా ఊపిరి తీసుకోగలదు.

పల్మోనరీ హైపర్ టెన్షన్(పీ పీ హెచ్ ఎన్) వచ్చే అవకాశాలు తక్కువ:

పల్మోనరీ హైపర్ టెన్షన్(పీ పీ హెచ్ ఎన్) వచ్చే అవకాశాలు తక్కువ:

నార్మల్ డెలివరీ ద్వారా పుట్టిన పిల్లలలో పర్సిస్టెంత్ పల్మోనరీ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.ఈ వ్యాధి లో నవజాత శిశువు ఊపిరి తిత్తులలోకి రక్త ప్రసరణ లేక శరీర అవయవాలకి సరైన మోతాదులో ఆక్సిజన్ అందదు

అలర్జీ రియాక్షన్స్ తక్కువ:

అలర్జీ రియాక్షన్స్ తక్కువ:

నార్మల్ డెలివరీ ద్వారా పిల్లలు పుట్టినప్పుడు వారు వచ్చే యోని మార్గం లో ఉపయోగమైన బాక్టీరియా ప్రభావానికి గురికావడం వల్ల వారిలో ఆస్తమా వంటి అలర్జీ రియాక్షన్స్ తక్కువగా ఉంటాయి.

కోపతాపాలు:

కోపతాపాలు:

కొన్ని పరిశొధనల ప్రకారం సిజేరియన్ ద్వార బయటకి వచ్చిన పిల్లలో కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణం గా కడుపులో ఉన్న శిశువు బయటకి ఎప్పుడు రావాలో నిర్ణయించుకుంటుంది. అలా కాకుండా బలవంతం గా వారిని సిజేరియన్ ద్వారా బయటకి తీస్తే వీరు షార్ట్ టెంపర్ కలిగి ఉంటారు.

తల్లుల ఆరోగ్య సమస్య:

తల్లుల ఆరోగ్య సమస్య:

సిజేరియన్ చేసేటప్పుడు తల్లి వెన్నెముక కి ఇచ్చే మత్తు మందు వల్ల సిజేరియన్ అయిన చాలా సంత్సరాలవరకూ ఆ ప్రభావం ఉంటుంది.పిల్లలని ఎత్తుకోవడం లేదా బరువులెత్తడంలో సంస్యలు ఎదురుకావచ్చు.నార్మల్ డెలివరీ వల్ల తల్లి లో రక్త స్రావం, రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలని నివారించవచ్చు.

పిల్లలకి తల్లిపాలు అందడం లో ఆలశ్యం:

పిల్లలకి తల్లిపాలు అందడం లో ఆలశ్యం:

సిజేరియన్ తరువాత తల్లి మత్తు మందు ప్రభావం లో ఉంటుంది. అందువల్ల పుట్టిన బిడ్డ కి వెంటనే పాలు ఇవ్వలేదు. అందుకే చాలా ఆసుపత్రులు డబ్బాపాలు పడతాయి శిశువులకి. నార్మల్ డెలివరీ లో ఈ సమస్య త్లెత్తదు అందువల్ల నార్మల్ డెలివరీ ఖచ్చితం గా లాభదాయకం.

తల్లి త్వరగా కోలుకుంటుంది:

తల్లి త్వరగా కోలుకుంటుంది:

నార్మల్ డెలివరీ ద్వారా బిడ్డను కన్న తల్లి అతి త్వరగా కోలుకుని నడవగలిగి ఉంటుంది. ఇంకా బిడ్డ ని ఎత్తుకోవడం,ఇంటి పనులు ,ఇతర దైనందిన చర్యలకి ఇబ్బంది కలగదు. కారు డ్రైవింగ్ కూడా చెయ్యగలదు.

హెర్నియా అవకాశం:

హెర్నియా అవకాశం:

సిజేరియన్ ఆపరేషన్లు వరుసగా జరగడం వల్ల తల్లి పొత్తికడుపు కండరాల శక్తి సన్నగిల్లడమే కాకుండా తరువాతి కాలం లో హెర్నియా వచ్చే అవకాశం ఉంది.ఇది ఆవిడ సంతానోత్పత్తి అవకాశలని సన్నగిల్లచేస్తుంది. నార్మల్ డెలివరీ లో ఈ సమస్య ఉండదు.

నార్మల్ డెలివరీ వల్ల ఇన్ని లాభాలున్నా ఒకోసారి అనుకోకుండా తలెత్తే ఆరోగ్య సమస్యల వల్ల సిజేరియన్ తప్పకపోవచ్చు. అందువల్ల కాబోయే తల్లిగా మీ గైనకాలజిస్టు ని కలిసి మీకు మీ బిడ్డ కి ఏది క్షేమమో తెలుసుకుని నిర్ణయం తీసుకోండి.

English summary

8 Reasons Why a Normal Delivery is a Better Option for You: Pregnancy tips in Telugu

Many would-be mothers nowadays are opting for a c-section over the normal vaginal delivery. Reasons are many. The most popular of them are not having to go through the pains of a normal birth and also having the option to choose a specific birth date and birth time for the child.
Desktop Bottom Promotion