For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలకు కొబ్బరి బోండాం వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు...

By Super
|

కొబ్బరి బోండాం సాధారణ వ్యక్తులకు మాత్రమేకాదు, గర్భిణీలకు కూడా ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుందంటే మీరు ఆశ్చర్యపడక తప్పదు?అవును, ఎందుకంటే కోకనట్ వాటర్ లో పొటాసియం మరియు ఎలాక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇందులో విటమిన్స్, క్యాల్షియం, మరియు మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. తాజా పరిశోధనల ప్రకారం ఫ్రెష్ గా ఉండే కొబ్బరినీళ్ళను ఏవిధంగా తీసుకొన్న ఆరోగ్యానికి చాలా లాభం. ముఖ్యంగా ఎముకలను బలోపేతం చేయడానికి, బరువు కంట్రోల్ చేయడానికి, హార్మోన్ ఉత్పత్తికి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కొబ్బరి బోండాలోని నీరు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

కాబట్టి గ్రీన్ కలర్ లో ఉండే కొబ్బరి బోండాంను గర్భిణీలు తప్పని సరిగా తీసుకోవాలని కోరుకుంటున్నారు . ముఖ్యంగా మూడో నెలలో ఉండే గర్భిణీలు కొబ్బరి బోండాం తీసుకోవడం వల్ల ఇది గర్భిణీలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది. పుట్టబోయే బేబీ క్లియర్ స్కిన్ మరియు జుట్టు మరియు కళ్ళతో పుడుతుంది.

READ MORE: గర్భిణీస్త్రీలలో వ్యాధినిరోధకశక్తిని పెంచే జామకాయ..

ఫ్రెష్ గా ఉండే కొబ్బరి నీళ్ళలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే దీనికి సైంటిఫిక్ కారణాలు లేకపోయినా, గర్భిణీలకు కోకనట్ వాటర్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అయితే కోకనట్ వాటర్ వల్ల పుట్టే బేబీకి పరోక్షంగా సహాయపడుతుందని కొన్ని ట్రెడిషినల్ అడ్వైజెస్ ద్వారా నిర్ధారించబడినది...మరి పరోక్షంగా గర్భిణీలకు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం...

Tender Coconut Water Benefits For Pregnant Women

1. నేచురల్ ఎలక్ట్రోలైట్స్: కొబ్బరి బోండాలంలో ఉండే ఎలక్ట్రోలైట్స్, క్యాల్షియం, క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం మరియు రిబోఫ్లెవనాయిడ్స్ మరియు నేచురల్ ఐసోటోనిక్ మినిరల్ కలిగి ఉంటాయి. గర్బిణీలు చాలా త్వరగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. మరియు చాలా తర్వగా బలహీనపడుతుంటారు. అలాంటి వారు కొబ్బరి బోండాం త్రాగితే తక్షణ ఎనర్జీ పొందవచ్చు. మరియు డీహైడ్రేషన్ వల్ల ఎదుర్కొనే సమస్యలు తలనొప్పి, క్రాంప్స్, ఎడిమా, మరియు కాంట్రాక్షన్ వంటివి నివారించి స్టామినా అందివ్వడానికి సహాయపడుతాయి.

READ MORE: బేబీ తెలివితేటలతో పుట్టాలంటే ఖచ్చితంగా ఇవి తినాల్సిందే...

2. నేచురల్ డ్యూరియాటిక్: ఈ విషయంలో ఎలాంటి నిర్ధారణలు లేవు. అయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించే గుణాలు కోకోనట్ వాటర్ లో పుష్కలంగా ఉన్నాయని చాలా మంది నమ్ముతారు.కోకనట్ వాటర్ లో ఉండే న్యూట్రీషియన్స్ శరీరంలో టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

3. చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది: కొబ్బరి నీళ్ళలో యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . గర్భిణీ స్త్రీలు వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో కోకొనట్ వాటర్ గ్రేట్ గా సమాయపడుతుంది.

READ MORE: గర్భిణీ స్త్రీలు పెరుగు తినడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

4న. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
కొబ్బరి బోండాంలోని నీళ్ళు జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను నివారిచుకోవాలనుకొనే వారు కోకనట్ వాటర్ ను తీసుకోవాలి.

5. కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచడానికి : యంగ్ కోకనట్ వాటర్లో ఫ్యాట్స్ మరియు కొలెస్ట్రాల్స్ ఉండవు, కొన్ని పరిశోధనల ప్రకారం శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది.

English summary

Tender Coconut Water Benefits For Pregnant Women: Pregnancy tips in telugu

Tender Coconut Water Benefits For Pregnant Women: Pregnancy tips in telugu. So far no studies that scientifically prove the truth of that suggestion. However, young coconut water does contain many substances that are beneficial for pregnant women.
Desktop Bottom Promotion