For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇన్ స్టాంట్ ఎనర్జీనిచ్చే 10 హెల్తీ అండ్ ఎనర్జీ డ్రింక్స్

By Super Admin
|

గర్భధారణ సమయంలో గర్భిణీ శరీరంలో వివిధ రకాల లక్షణాలు కనబడుతుంటాయి. ఎనర్జీ లెవల్స్ తక్కువగా ఉంటాయి. గర్భధరాణ కాలంలో ఎలాంటి సమస్యలు లేకుండా , సురక్షితంగా ముగయాలంటే, అందుకు హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి.

గర్భిణీ ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా, ఆరోగ్యంగా జీవించడానికి , శరీరంను ఎప్పుడూ హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. ముఖ్యంగా వేసవిలో శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. గర్భిణీ శరీరం డీహైడ్రేషన్ కు గురైతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సివస్తుంది. గర్భిణీలు డీహైడ్రేషన్ కు గురికాకుండా హైడ్రేషన్ లో ఉండాలంటే అందుకు కొన్ని హెల్తీ డ్రింక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. స్మూతీస్ :

1. స్మూతీస్ :

గర్భిణీలు బ్రేక్ ఫాస్ట్ ముందు స్మూతీస్ తీసుకోవడం చాలా మంచిది. బ్రేక్ ఫాస్ట్ ముందు తీసుకునే స్మూతీస్ కు గ్రీన్ లీఫ్ లేదా నట్స్ చేర్చుకోవడం మంచిది. ఫ్రూట్ స్మూతీస్ లో ప్రోటీన్స్, క్యాల్షియం, ఫైబర్స్,ఎక్కువగా ఉండటం వల్ల ఇవి గర్భిణి శరీరాన్ని ఫిట్ గా మరియు యాక్టివ్ గా ఉంచుతాయి. అరటిపండ్లు, స్ట్రాబెర్రీస్, చికోస్ మరియు మామిడిపండ్లతో తయారుచేసే స్మూతీలు ఆరోగ్యానికి మంచి చేయడంతో పాటు, ఆకలిని అరికడుతుంది.

2. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్:

2. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్:

మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లో పూల్ ఫ్రూఫ్, శరీరంను హైడ్రేషన్ లో ఉంచుతుంది. ఎనర్జిటిక్ గా మార్చుతుంది. అందుకు ఫ్రెష్ గా సీసనల్ గా ఉండే స్వీట్ లైమ్, మస్క్ మెలోన్, వాటర్ మెలోన్,ఆరెంజెస్, పైనాపిల్ మొదలగు వాటితో ఫ్రూట్ జ్యూస్ లను తయారుచేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ జ్యూసుల్లో మినిరల్స్ ,న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీలకు చాలా అవసరమవుతాయి. టేస్టీగా ఉంటాయి.

3. వాటర్ :

3. వాటర్ :

వాటర్ బెస్ట్ డ్రింక్, శరీరంను హైడ్రేషన్ లో ఉంచడానికి వాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రోజూ సరిపడా నీళ్ళు త్రాగడం వల్ల శరీరంలో మార్పులు గొప్పగా ఉంటాయి. అలసటను తగ్గిస్తాయి.నీరు ఎక్కువగా తాగడం వల్ల బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి.మొత్తం ఆరోగ్యం బాగుంటుంది.

4. బట్టర్ మిల్క్:

4. బట్టర్ మిల్క్:

గర్భిణీలు నేచురల్ బట్టర్ మిల్క్ తాగడం వల్ల ఇది నేచురల్ కూలింగ్ డ్రింక్ గా పనిచేస్తుంది, ఇది శరీరంను హైడ్రేషన్ లో ఉంచుతుంది.హోం మేడ్ బట్టర్ మిల్క్ తాగడం మంచిది. ఈ డ్రింక్ లో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మొత్తం శరీర ఆరోగ్యానికి మంచిది, దీన్ని తయారుచేయడం సులభం, రిఫ్రెషింగ్ డ్రింక్ .

5. కోకనట్ వాటర్:

5. కోకనట్ వాటర్:

కోకనట్ వాటర్ ఎక్సలెంట్ ఐసోటానిక్ బెవరేజ్, గర్భిణీలకు బెస్ట్ హెల్త్ డ్రింక్, ఇది డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. మీరు అలసట, నీరసంగా ఫీలౌతుంటే కోకనట్ వాటర్ బెస్ట్ డ్రింక్. ఇది శరీరానికి తక్షణం మినిరల్స్ ను అందిస్తుంది. శరీరంలో నేచురల్ సాల్ట్ ఏర్పాటుకు సహాయపడుతుంది.

6. వెజిటేబుల్ జ్యూస్:

6. వెజిటేబుల్ జ్యూస్:

ఫ్రూట్ జ్యూసుల వలే , గర్భిణీ డైట్ లో ఉండాల్సిన స్పెషల్ డ్రింక్, వెజిటేబుల్ జ్యూస్. రోజూ ఫ్రెష్ గా ఉండే ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ ను తాగడం మంచిది. వెజిటేబుల్ జ్యూస్ శరీరానికి న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది.ఇది శరీరానికి ఫైబర్ ఎక్కువగా అందిస్తుంది, బౌల మూమెంట్ మెరుగుపరుస్తుంది.

7. లెమనేడ్:

7. లెమనేడ్:

శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవడానికి లెమనేడ్ గ్రేట్ రెమెడీ. దీన్ని తయారుచేయడం చాలా సులభం, ఇందులో ఎలక్ట్రోలైట్స్ అద్భుతంగా ఉన్నాయి. నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇది శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహించడానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో కొద్దిగా పుదీనా, అల్లం చేర్చి తీసుకుంటే మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది.

8. మిల్క్ బేస్డ్ డ్రింక్స్:

8. మిల్క్ బేస్డ్ డ్రింక్స్:

పాలు, పాల ఉత్పత్తుల, క్యాల్షియం, ప్రోటీన్స్ మరియు విటమిన్ బి12 అధికంగా ఉంటాయి, ఇవి గర్భిణీలకు ఖచ్చితంగా అవసరమవుతాయి. మిల్క్ బేస్డ్ డ్రింక్స్ ఎంపిక చేసుకోవాలి. మీగడ తీసిన పాలు, లస్సీ వంటివి తీసుకోవడం వల్ల బాడీ స్ట్రాంగ్ గా మరియు ఎనర్జిటిక్ గా మార్చుతుంది.

9. హెర్బల్ అండ్ ట్రెడిషినల్ డ్రింక్:

9. హెర్బల్ అండ్ ట్రెడిషినల్ డ్రింక్:

జల్జీర నుండి ఆమ్ పన్నా వరకూ వెరైటీగా ట్రెడిషినల్ ఇండియన్ డ్రింక్స్ ను ఎంపిక చేసుకుంటారు, ఇవన్నీ ఒక్కోదానికి ఒక్కో అద్భుతమైన రుచి ఉంటుంది. శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతాయి. శరీరాన్నినేచురల్ గా చల్లగా మార్చుతాయి.

10. ఐస్ టీ:

10. ఐస్ టీ:

మరో గ్రేట్ రిఫ్రెషింగ్ డ్రింక్, హోం మేడ్ ఐస్టీ, బయట తెచ్చుకోవడం కంటే ఇంట్లో తయారుచేసుకోవడం ఉత్తమం.నిమ్మరసం, పుదీనా ఆకులు తయారుచేసి రిఫ్రెషింగ్ డ్రింక్ మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గిస్తుంది. అయితే పరిమితంగా తీసుకోవడం మంచిది.

ఈ హెల్తీ డ్రింక్స్ తాగడానికి ముందు, మీ స్సెషలిస్ట్ ను కలిసి అభిప్రాయం, సూచనలను అడిగితెలుసుకోవాలి.

English summary

10 Best Healthy & Energy Drinks To Take During Pregnancy

You are staying hydrated all the time. But if summer is around the block, you need to be all the more prepared to tackle it when you are carrying.
Story first published: Friday, September 30, 2016, 17:39 [IST]
Desktop Bottom Promotion