For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం పొందినత తర్వాత మహిళ శరీరంలో వచ్చే 10 అద్భుతమైన మార్పులు....

|

ఒకప్పుడు ఐదారుగురు పిల్లల్ని కనేవాళ్లు. గర్భం నుంచి కాన్పు వరకూ.. సీమంతం నుంచి బాలసారె వరకూ.. ప్రతిదీ ప్రకృతి సహజంగా.. ఒక పండగలా.. హాయిగా జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా లేదు. గర్భంతో పాటే మధుమేహం మొదలవుతోంది. ఆ వెంటే హైబీపీ బయల్దేరుతోంది. సరిగా పట్టించుకోకపోతే.. గర్భవాతం, గుర్రపువాతం.. తల్లీబిడ్డలిద్దరికీ నానా దుష్ప్రభావాలూ.. సమస్యలూ తలెత్తుతున్నాయి.

ఎందుకిలా????.. దీనంతటికీ మూలం మన ఆధునిక జీవనశైలిలోనూ, మారుతున్న మన ఆహారం, అలవాట్లలోనే ఉందంటోందని అంటున్నారు నేటి పరిశోధనా రంగంవారు. మన ఆహారం మారిపోయింది, పర్యావరణం మారిపోయింది, ఒత్తిళ్లు పెరిగిపోయాయి. ఫలితమే ఈ గర్భ సమస్యలన్నీ! అందుకే వీటన్నింటినీ వదిలించుకుని... గర్భిణులంతా చక్కటి ఆహారాన్నీ, మన సంప్రదాయ జీవనశైలినీ అలవరచుకోవటం ఉత్తమం అంటున్నారు పరిశోధకులు.

మహిళలు గర్భం పొందిన తర్వాత 9నెల కాల వ్యవధిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వాతవరణంలో కూడా మార్పులు చేసుకోవడం వల్ల వాటిని ఎదుర్కోక తప్పదు. గర్భం పొందిన తర్వాత ప్రతి నెలనెలకు శరీరంలో మార్పులు జరగడం సహజం. వాతావరణానికి అనుగుణంగా మీ శారీర మార్పులు కూడా మార్చుకోవడం చాలా అవసరం. ఇలా మహిళ గర్భంలో మార్పులు చోటు చేసుకోవడం ఒక మిరాకిల్ అని చెప్పవచ్చు. పొట్టలో పెరుగుదలను, అవయవాల ఏర్పాటుకు ఇది ఒక గొప్ప సంకేతంగా సూచిస్తుంది. కడుపులో పిండం పెరిగే కొద్ది తల్లి గర్భంలో (యూట్రస్)లో మార్పులు వస్తాయి. ఈ ప్రొసెస్ లో అవయాలు ఏర్పడుతాయి. రీప్రొడక్టివిటి, సర్క్యులేషన్, రెస్పిరేటరీ, ఎక్సక్రిటరీ మరియు ఇమ్యూన్ సిస్టమ్ ఇవిన్ని ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ మార్పులన్నీ తల్లిలో అకస్మికంగా జరిగే వార్మోనుల మార్పుల వల్ల...ఇలా ఒక్కో నెలలో ఒక్కో విధంగా తల్లి శరీరం మార్పు చెందుతుంది.

అంతే కాదు , మనకు కళ్ళకు బయటకు కనిపించే లక్షణాలు మాత్రమే కాదు, అంతర్గతంగా కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మరి మహిళ గర్భం పొందిన తర్వాత తల్లిలో ఏర్పడే శారీరక మరియు మానసిక మార్పులేంటో తెలుసుకుందాం...

1. బాడీ పెయిన్స్:

1. బాడీ పెయిన్స్:

ముఖ్యంగా లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. గర్భం పొందిన మహిళలో యూట్రస్ సైజ్ పెరిగే కొద్ది లోయర్ బ్యాక్ పెయిన్ పెరుగుతుంది . ఈ నొప్పి లోయర్ బ్యాక్ నుండి కాళ్ల, మోకాళ్ళు మరియు పాదాలకు వ్యాప్తి చెందుతుంది .గర్భాధారణ సమయంలో పొందే ఇలాంటి నొప్పులు కొద్దిగా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం వల్ల నివారించుకోవచ్చు.

2. బ్రెస్ట్ లో మార్పులు:

2. బ్రెస్ట్ లో మార్పులు:

గర్భధారణ సమయంలో ఫిజికల్ బాడీ చేంజెస్ లో బ్రెస్ట్ లో కూడా మార్పులు వస్తాయి . హార్మోనుల పెరిగే కొద్దిగా ప్రతి త్రైమాసికంలో బ్రెస్ట్ ఎన్ లార్జ్ అవుతుంటుంది.

3. బౌల్ మూమెంట్:

3. బౌల్ మూమెంట్:

గర్బం పొందిన తర్వాత చాలా మంది మహిళలు ఎదుర్కొనే సమస్య మలబద్దకం. కొన్ని హార్మోనుల పెరుగుదలను ఆలస్యం కావడం వల్ల జీర్ణశక్తి తగ్గుముఖం పడుతుంది . గర్భధారణ సమయంలో ఇది ఒక ఖచ్చితమైన మార్పుగా భావిస్తారు.

4.సర్క్యులేటరీ సిస్టమ్:

4.సర్క్యులేటరీ సిస్టమ్:

మీ హార్ట్ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . శరీరంలోపల ఎక్కువ న్యూట్రీషియన్స్ పోవడం వల్ల రక్తప్రసరణతోపాటు, ఆక్సిజన్ కూడా బేబీకి బాగా అందుతుంది. దాంతో బాడీలో మార్పులు వారం వారం పెరుగుతుంటాయి.

5. మెటబాలిజం:

5. మెటబాలిజం:

గర్భాధారణ సమయంలో ఫస్ట్ అండ్ లాస్ట్ సెమిస్టర్ లో అలసట, వికారం మరియు నిద్రలేమి సమస్యలు అత్యంత సాధారణంగా ఉటాయి . గర్భధారణ కారణంగా శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది.

6. హార్ట్ బర్న్:

6. హార్ట్ బర్న్:

హార్మోనుల మార్పుల వల్ల శరీరంలో మార్పులు ఏర్పడుతాయి . పొట్ట నుండి వాల్వ్ వేరుపడటం వల్ల ఓసియోఫోగస్ మీద ప్రభావం చూపుతుంది . ఫలితంగా తీసుకొన్న ఆహారం వెనుకకు వస్తుంది . ఫలితంగా హార్ట్ బర్న్ కు గురి అవుతుంటారు.

7. హెమరాయిడ్స్:

7. హెమరాయిడ్స్:

గర్భధారణ సమయంలో వీన్స్ మరియు రెక్టమ్ లో వాపు, నొప్పి ఉంటుంది . ఫలితంగా దురద, నొప్పి మరియు బ్లీడింగ్ సమస్యలుంటాయి. గర్భధారణ సమయంలో బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల హెమరాయిడ్స్ కు దారితీస్తుంది.

8. నాజల్ సమస్యలు:

8. నాజల్ సమస్యలు:

గర్భధారణ సమయంలో వివిధ రకాల హార్మోనుల్లో మార్పుల వల్ల ముక్కులో రక్తం రావడం, ముక్కు మూసుకు పోవడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. . ఇలాంటి పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదు కానీ, సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ను తప్పనిసరిగా కలవాల్సి ఉంటుంది.

9. చర్మంలో మార్పులు:

9. చర్మంలో మార్పులు:

గర్భధారణ సమయంలో హార్మోనుల్లో వచ్చే మార్పుల వల్ల శరీరంలో వచ్చే మార్పుల్లో ఒకటి చర్మంలో మార్పులు వస్తాయి . బుగ్గల్లో డార్క్ ప్యాచెస్, ఫోర్ హెడ్ మరియు ముక్కు వద్ద కూడా డార్క్ ప్యాచెస్, నల్లని వలయాలు ఏర్పడుతాయి . ప్రసవం తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ , డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి.

10. యూరినరీ సిస్టమ్:

10. యూరినరీ సిస్టమ్:

గర్భాధారణ సమయంలో ఎక్కువ సార్లు వాష్ రూమ్ కు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో బేబీ గ్రోత్ పెరిగే కొద్ది యూట్రస్ మీద ఒత్తిడి పెరిగే కొద్ది ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్ళాలనిపిస్తుంది . క్రమంగా నెలలు పెరిగే కొద్ది , సమస్య పెరుగుతుంది. ప్రసవం తర్వాత తిరిగి నార్మల్ కు వస్తుంది.

English summary

10 Body Changes During Pregnancy

Pregnancy demands your body to be perfect to support the growth and development of a baby. One wonders how a woman's body changes during pregnancy? According to the progress of your child, almost every part of your body is also going through a change.
Story first published: Monday, May 16, 2016, 18:30 [IST]