For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ మహిళల్లో వాంతులు, వికారం తగ్గించే 10 ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్..!

By Staff
|

గర్భం పొందిన తర్వాత ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ఎదుర్కొనే సాధారణ సమస్య వికారం, వాంతులు. కొంతమందికి గర్భం పొందిన ప్రారం దశలో ఈ సమస్యను ఎదుర్కుంటే,మరికొంత మంది, గర్భధారణ చివరి నెలల్లో ఎదుర్కుంటుంటారు. ఇంకొంత మంది గర్భధారణ కాలం మొత్తం అనుభవిస్తుంటారు. ఇటువంటి పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి?

మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ నేచురల్ రెడీస్ అందుబాటులో ఉన్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే, వెంటనే ఉపశమనం కలుగుతుంది.మార్నింగ్ సిక్నెస్ కు కారణాలు, ఎఫెక్టివ్ టిప్స్ గురించి తెలుసుకుందాం...

మార్నింగ్ సిక్ నెస్ గర్భిణీ మహిళ శరీరంలో జరిగే హార్మోనుల మార్పుల వల్ల వస్తుంది. గర్భధారణ సమయంలో సాలివేషన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం , బ్లడ్ షుగర్ తగ్గడం, ప్రొజెస్టెరాన్ లెవల్స్ పెరగడం, ప్రొజెస్టరాన్ యూట్రస్ మజిల్స్ వదులై ప్రీమెచ్చుర్ బర్త్ ను నివారిస్తుంది. అయితే ప్రొజెస్ట్రాన్ పొట్ట, ప్రేగుల కండరాలను వదలు చేస్తుంది. ఎక్సెస్ స్టొమక్ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యి, అసిడిక్ రిఫ్లెక్షన్ కు దారితీస్తుంది. సాధారణంగా వాసన గ్రహించడంలో చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ వికారం వాంతులకు దారితీస్తుంది.

గర్భిణిలలో వాంతులను నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

1.అల్లం:

1.అల్లం:

చాలా మంది గర్భిణీ మహిళల్లో సహజంగా వచ్చే వికారం వాంతులకు నేచురల్ రెమడీ అల్లం, అల్లంలో ఉండ జింజరోల్ అనే కంటెంట్ వాంతులను వికారం తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవడం మంచిది.

2. నీళ్ళు:

2. నీళ్ళు:

మార్నింగ్ సిక్ నెస్ తో బాధపడే వారు ఎక్కువగా నీళ్ళు తాగాలి, డీహైడ్రేషన్ కారణంగా వికారం, వాంతులు కూడా అవుతాయి. కాబట్టి, ఒకే సారి ఎక్కువ నీళ్ళు తాగకుండా, ఒక రోజుకురెండు లీటర్ల అప్పుడప్పుడు కొద్దికొద్దిగా రోజంతా తాగుతూనే ఉండాలి. ఇతర స్వీట్ డ్రింక్స్ తాగకూడదు.

3. ఒత్తిడి తగ్గించుకోవాలి:

3. ఒత్తిడి తగ్గించుకోవాలి:

కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ వల్ల కూడా మార్నింగ్ సిక్ నెస్ పెరగుతుంది. సాధ్యమైనంత వరకూ గర్భిణీలు ఒత్తిడి తగ్గించుకోవాలి, యోగ, మెడిటేషన్ వంటివి చేసి, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి.

4. ఆక్యుప్రెజర్ :

4. ఆక్యుప్రెజర్ :

పి6 లేదా వ్రిస్ట్ ఆక్యుప్రెజర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని, చాలా పరిశోధనల్లో కనుగొన్నారు. ఆక్యుప్రెజర్ వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి. ఆక్యుప్రెజర్ అనేది వైద్యపరమైనది, కొన్ని శరీర బాగాల్లో ఒత్తిడి కలిగించడం వల్ల వికారం, వాంతులు తగ్గించుకోవచ్చు.

5. విశ్రాంతి:

5. విశ్రాంతి:

మార్నింగ్ సిక్నెస్ కు మరో ముఖ్యమైన లక్షణం గర్భణీలో తరచూ మూడ్ మారుతుంటుంది, దీన్నే మూడ్ స్వింగ్స్ అని అంటారు. అలా జరగకుండా ఉండాలంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. విశ్రాంతితో పాటు, నిద్రకూడా ఉండాలి. అలసట ఎప్పుడూ మార్నింగ్ సిక్నెస్ కు దారితీస్తుంది.

6.ఆహారంలో క్వాంటింటి తగ్గించాలి:

6.ఆహారంలో క్వాంటింటి తగ్గించాలి:

రోజుకు మూడు సార్లు తీసుకునే ఎక్కువ భోజనంను 5, 6 సార్లుగా కొద్దిగా కొద్దిగా తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, వికారం వాంతులు ఉండవు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న బ్రెడ్, క్రాకర్స్ వంటివి మీ ఆరోగ్యానికి మంచిది కొన్ని సందర్భాలలో భోజంన స్కిప్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ కు కారణమవుతుంది.

7. పుదీనా:

7. పుదీనా:

గర్భిణీల్లో వాంతులను నివారించడానికి పుదీనా గ్రేట్ రెమెడీ, ఇది బాడీ హీట్ తగ్గిస్తుంది, మనస్సును ప్రశాంత పరుస్తుంది, ఏదైనా చల్లగా తీసుకోవలనే కోరిక పెంచుతుంది. పెప్పర్ మింట్ ఆకలు తినడం, లేదా పిప్పర్మెంట్ టీ తాగడం, షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమలడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ ను కొంత ఉపశమనం కలుగుతుంది.

8. హెర్బల్ రెమెడీస్:

8. హెర్బల్ రెమెడీస్:

మార్నింగ్ సిక్నెస్ తగ్గించుకోవడానికి హెర్బల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.చమోమెలీ, లెమన్ బామ్, ఇతర లోజెన్స్ వంటివి వికారంను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

9. ఆరోమా థెరఫీ:

9. ఆరోమా థెరఫీ:

గర్భిణీల మైండ్ ను రిలాక్స్ చేయడంలో ఆరోమా థెరఫీ గ్రేట్ గా సహాయపడుతుంది. అదే విధంగా, మార్నింగ్ సిక్నెస్ వల్ల దెబ్బతిన్న శ్వాసనాళాలను ఉత్తేజపరుస్తుంది.

10. దాల్చిన చెక్క:

10. దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో వికారం, వాంతులు తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి, దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ తాగడం, లేదా దాల్చిన చెక్ వాసన చూడటం , లేదా ఆవిర పట్టడం వల్ల వికారం వాంతులు తగ్గుతాయి.

English summary

10 Effective Home Remedies To Stop Vomiting During Pregnancy

Are you a pregnant woman who often has an uncomfortable and a nauseating feeling? Does morning sickness during your pregnancy trouble you a lot? Pregnancy is a beautiful, and yet a crucial phase in a woman’s life. And morning sickness is a natural phenomenon that affects mostly all pregnant women in the early weeks of pregnancy.
Desktop Bottom Promotion