For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 వెజిటేరియన్ సూపర్ ఫుడ్స్ తో ప్రెగ్నెన్సీ హ్యాపిగా...హెల్తీగా...

|

సాధారణ మనుషులు తీసుకొనే ఆహారంతో పోల్చితే గర్భిణీ స్త్రీలు మరింత బలమైన, పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. తల్లితో పాటు, కడుపులో పెరిగే శిశువు ఆరోగ్యానికి, పెరుగుదలకు పోషకాహారం చాలా ముఖ్యం. అందులోనూ మీరు వెజిటేరియన్ ఫుడ్ అయితే, మీ తొమ్మిదినెలల గర్భధారణ కాలం సురక్షితంగా గడవటానికి సహాయపడుతాయి. అలాంటి వేజిటేరియన్ ఫుడ్స్ మీ డైట్ లిస్ట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. అలాగే కొన్ని ఆహారాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా వెజిటేరియన్స్ ఎటువంటి ఆహారాలను తమ డైట్ లిస్ట్ లో చేర్చుకొని తప్పనిసరిగా తీసుకోవాలో తెలుసుకోవాలి. అటువంటి వారికోసం కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను మీ డైట్ లిస్ట్ లో చేర్చుకోవడానికి బోల్డ్ స్కై కొన్నింటిని లిస్ట్ అవుట్ చేయబడింది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యే పోషకాలు పుష్కలంగా అంది బేబీ సురక్షితంగా ఉంటుంది.

బరువు తగ్గించే ప్రోటీన్ రిచ్ వెజిటేరియన్ ఫుడ్స్

వెజిటేరియన్స్ తప్పనిసరిగా మంచి పోషకాహారంను మరియు ఆరోగ్యకరమైన ఆహారంను తీసుకోవాలి. గర్భధారణ సమయంలో తల్లి తీసుకొనే ఆహారం ద్వారా శిశువు కూడా పోషకాంశాలను గ్రహించబడుతుంది. గర్భధారణ సమయంలో గర్భిణీ స్రీ తీసుకొనే వెజిటేరియన్ డైట్ రోజు..రోజుకి, వారం వారంకు శిశువు బలాన్ని మరియు శిశువు పెరుగుదలకు ఉపయోగపడేవిగా ఉండాలి.

హెయిర్ ఫాల్ ను అరికట్టే వెజిటేరియన్ ఫుడ్...

వెజిటేరియన్ గర్భిణి స్త్రీలను తినడానికి మార్కెట్లో వివిధ రకాల వెజిటేబుల్స్ మరియు వెజిటేరియన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. వాటిని ప్రధానమైనవి ఎంపిక చేసుకొని తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి గర్భిణీ స్త్రీలకు కోసం లిస్ట్ అవుట్ చేసిన కొన్ని బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్స్ ను క్రింది స్లైడ్ లో ఇవ్వబడ్డాయి. ఈ ఆహారాల్లో పుష్కలమైన విటమిన్స్, మినిరల్స్ తీసుకోవడం వల్ల గర్భిణీస్త్రీల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. మరి గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీ తీసుకోవల్సి ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

 బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీ గ్రీన్ సూపర్ ఫుడ్. దీని వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని మొదటి మూడు నెలలు తీసుకోవడం చాలా మంచిది. దీని తినడం వల్ల తల్లికి కావల్సిన ఐరన్ అంధించడమే కాకుండా అధిక రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

 గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్( ఆకుకూరలు):

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్( ఆకుకూరలు):

ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తల్లి నుండి రక్తం బిడ్డవైపుకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.నెలలో ఒకసారి ఎండిన ఆకుకూరలు ఉడికించి ఒక కప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇది పుష్కలమైన విటమిన్ కె ను అంధిస్తుంది

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది . ఇది ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్దకంను నివారిస్తుంది . ఈ సాధారణ సమస్యకు ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ .

ఆరెంజ్ :

ఆరెంజ్ :

ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తల్లిలో ఏర్పడే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగేందుకు రోగనిరోధక శక్తిని పెంపొంధిస్తుంది. మరియు ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.

తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

వెజిటేరియన్స్ వారి, రెగ్యులర్ డైట్ లో తృణధాన్యాలతో తయారు చేసి ఆహారాలను చేర్చుకోవడం వల్ల ఐరన్ కంటెంట్ ను పుష్కలంగా పొందవచ్చు . ముఖ్యంగా ఫీటస్ (పిండం)ఎదుగుదలకు ఐరన్ చాలా అత్యవసరం. కాబట్టి, కాబోయే తల్లులు తప్పనిసరిగా తృణధాన్యాలు తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.

నట్స్:

నట్స్:

ఒక గుప్పెడు నట్స్ (బాదాం మరియు పిస్తా)వంటి వాటిని తప్పని సరిగా తినాలి. ఈ నట్స్ బేబీకి ఆరోగ్యానికి మాత్రమే కాదు, తల్లి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వెజిటేరియన్ ఉమెన్స్ తప్పని సరిగా తీసుకోవాలి.అందులో వివిధ రకాల నట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శిశువు బ్రెయిన్ డెవలప్ మెంట్ కు బాగా సహాయపడుతాయి. అంతే కాదు, గర్భధారణ సమయంలో గర్భిణిస్త్రీలో ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

 ప్రోటీన్ ఫుడ్స్:

ప్రోటీన్ ఫుడ్స్:

టోఫు నుండి లెగ్యుమ్స్ వరకూ ఇతర వెజిటేరియన్ ఫుడ్స్ లో కొంత మొత్తంలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి గర్భాధారణ సమయంలో హెల్తీగా మరియు యాక్టివ్ గా ఉంచుతాయి . అదే విధంగా పండ్లను కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి మరియు చియా సీడ్స్ వంటివి గర్భిణీలు తీసుకోవచ్చు. ఈ రెండు రకాల సీడ్స్ లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి బేబీ యొక్క నాడీవ్యవస్థ మరియు బ్రెయిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

 డ్రై ఫ్రూట్స్ :

డ్రై ఫ్రూట్స్ :

హెల్తీ స్వీట్ ట్రీట్ లో డ్రై ఫ్రూట్స్ ఒకటి. ఇవి స్వీట్ టేస్ట్ ను అందివ్వడం మాత్రమే కాదు, నేచురల్ ఎనర్జీని అందిస్తుంది మరియు మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతుంది .

కలర్ ఫుల్ వెజిటేబుల్స్:

కలర్ ఫుల్ వెజిటేబుల్స్:

కలర్ ఫుల్ వెజిటేబుల్స్ అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది , ఈ కలర్ ఫుల్ వెజిటేబుల్స్ హార్ట్ హెల్త్ కు, బ్లడ్ ప్రెజర్ మరియు మొత్తం శరీర ఆరోగ్యం 9 నెలల పాటు రక్షణ కల్పిస్తాయి.

English summary

10 Vegetarian Superfoods For A Healthier Pregnancy

Healthy eating is important when you have the bun in the oven. It is mandatory to add foods like vegetables and fruits to your daily intake, as they help in keeping the foetus healthy and aid in its overall growth.
Story first published: Tuesday, April 5, 2016, 15:08 [IST]
Desktop Bottom Promotion