For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ బేబీ పుట్టడానికి.. ప్రెగ్నన్సీ టైంలో కంపల్సరీ తినాల్సినవి..!!

By Swathi
|

తల్లి కాబోతున్నామన్న గుడ్ న్యూస్.. మహిళల్లో చాలా తియ్యటి అనుభూతిని ఇస్తుంది. చాలా మెమరబుల్ మూమెంట్ అది. మీ గర్భం గురించి.. ఆనందంలో.. మీరు ఫాలో అవ్వాల్సిన హెల్తీ డైట్ టిప్స్ గురించి మరిచిపోకూడదు.

మహిళల జీవితంలో.,. ప్రెగ్నన్సీ అనేది చాలా ముఖ్యమైన భాగం. ఆ సమయంలో.. అన్నింటి గురించి చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. తన ఆరోగ్యం, తన కడుపులోని బిడ్డ ఆరోగ్యం కూడా.. ప్రతి క్షణం జాగ్రత్తపడాలి.

మీకు తెలియకుండానే గర్భం దాల్చడానికి ఆశ్చర్యకర కారణాలు..!మీకు తెలియకుండానే గర్భం దాల్చడానికి ఆశ్చర్యకర కారణాలు..!

ఒక చిన్న పొరపాటు అయినా.. మీ ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తాయి. అలాగే మీ బిడ్డ ఆరోగ్యంపైనా.. పరోక్షంగా దుష్ర్పభావం ఉంటుంది. అలాగే గర్భధారణ సమయంలో పోషకాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మీకు పుట్టబోయే బిడ్డ హెల్తీగా ఉండాలంటే.. తీసుకోవాల్సిన ఆహారాలేంటో చూద్దాం..

ఎగ్స్

ఎగ్స్

ఎగ్స్ లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది.. గర్భస్థ శిశుడు ఆరోగ్యానికి, కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

చేపలు

చేపలు

ప్రెగ్నన్సీ టైంలో చేపలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా లభించడం వల్ల.. బేబీ నరాల వ్యవస్థను బలంగా మారుస్తాయి.

యాపిల్

యాపిల్

యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి.. కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి చాలామంచిది. అలాగే.. ప్రెగ్నన్సీ వల్ల వచ్చే కాన్ట్సిపేషన్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

బీన్స్

బీన్స్

బీన్స్, రాజ్మాలలో ప్రొటీన్ లభిస్తుంది. ఇవి.. హెల్తీ బేబీని పొందడానికి సహాయపడతాయి. కాబట్టి.. డైట్ లో తరచుగా రాజ్మా, బీన్స్ ఉండేలా జాగ్రత్తపడాలి.

చిలకడదుంప

చిలకడదుంప

ప్రెగ్నన్సీ సమయంలో స్వీట్ పొటాటో లేదా చిలకడ దుపం తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి, ఫోలేట్ ఉంటుంది. ఇవి.. కడుపులో బేబీ ఆరోగ్యానికి సహాయపడతాయి.

వాల్ నట్స్

వాల్ నట్స్

ప్రెగ్నన్సీ సమయంలో.. వాల్ నట్స్ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల.. అందులో లభించే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్.. బేబీ హెల్తీగా ఉంటుంది.

బాదాం

బాదాం

బాదాంలో విటమిన్ ఈ, ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి.. కడుపులోని బిడ్డ ఎముకలు డెవలప్ అవడానికి చాలా ముఖ్యమైనవి.

పాలు

పాలు

పాలల్లో విటమిన్స్, ప్రొటీన్స్ చాలా ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ప్రెగ్నన్సీ టైంలో పాలు లేదా పాల ఉత్పత్తులను డైలీ డైట్ లో చేర్చుకోవాలి.

బార్లీ

బార్లీ

బార్లీని తరచుగా తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ అందుతాయి. ఇవి.. కడుపులోని బిడ్డకు పోషణ అందించి.. ఎనర్జీని ఇస్తాయి.

శనగలు

శనగలు

శనగలను.. ప్రెగ్నన్సీ టైంలో డైట్ లో చేర్చుకోవడం వల్ల.. ఇందులో పుష్కలంగా ఉండే.. ప్రొటీన్స్ లభిస్తాయి. ఇవి గర్భస్థ శిశువు ఆరోగ్యానికి చాలా అవసరం.

పాలకూర

పాలకూర

ఈ పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది.. కడుపులోని బేబీ డెవలప్ మెంట్ కి, హెల్తీ బ్లడ్ సెల్స్ ఏర్పడటానికి సహాయపడతాయి.

అవకాడో

అవకాడో

గర్భధారణ సమయంలో డైట్ లో చేర్చుకోవాల్సిన మరో హెల్తీ ఫుడ్ అవకాడో. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభించడం వల్ల.. కడుపులో డెవలప్ అవుతున్న బేబీకి పోషణ అందుతుంది.

English summary

12 Best Foods To Eat During Pregnancy For A Healthy Baby!

12 Best Foods To Eat During Pregnancy For A Healthy Baby! Here is a list of foods that can help you give birth to a hale and healthy baby, do read on!
Desktop Bottom Promotion