For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ: 9నెలలు హ్యాపిగా గడపడానికి 12 సింపుల్ మార్గాలు

By Staff
|

ఒక మహిళ శరీరం గర్భాదరణ సమయంలో అనేక మార్పులకు గురి అవుతుంది. ఆ సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు మరియు కొంత క్రేజీగాను ఉంటుంది.

ఆ దశలో ఆమెలో వచ్చే ఆకస్మిక మార్పులు మరియు ప్రవర్తన పట్ల అవగాహన ఉండాలి. ఆమెకు ఈ 9 నెలలు ఆమె కుటుంబ సభ్యులు సహకారం అందిస్తే ఆమె ఈ 9 నెలలు చాలా ఆనందంగా ఉంటుంది.

గర్భవతి అయిన మహిళ సంతోషంగా ఉంటే రక్తపోటు,ఒత్తిడి,గర్భానికి సంబందించిన సమస్యలు రావని నిపుణులు అంటున్నారు.

ఉదయం చేసే రతి క్రీడతో ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువా?

ఈ సమయంలో ఆమె జీవితంలోకి మూడు విషయాలు ప్రవేశిస్తే మాత్రం ఆమెకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గర్భవతి అయిన మహిళ సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

మీ శరీరంలో జరిగే మార్పులను గురించి తెలుసుకొని అంగీకరించాలి. అలాగే గర్భం గురించి చదవాలి మరియు పిండంతో బంధాన్ని ఏర్పరుచుకోవాలి. గర్భవతి మహిళకు ఆమె భర్త గురించిన విషయాలు కూడా ఒక బాగంగా ఉంటాయి.

గర్భధారణ సమయంలో బిపిని కంట్రోల్ చేసే హోం రెమెడీస్


గర్భిణీ స్త్రీలు వారి భర్తలు వారి పరిస్థితిని అర్థం చేసుకొని మరియు వారు 9 నెలలు సంతోషంగా ఉండటానికి తమ వంతు కృషి చేయాలి. ఇప్పుడు గర్భధారణ 9 నెలలు ఆనందంగా ఉండటానికి 12 మార్గాల గురించి తెలుసుకుందాం.

1. ఆకారం కోసం

1. ఆకారం కోసం

గర్భాదరణ సమయంలో సరైన ఆకారంలో ఉండాలి. మీరు తదుపరి 9 నెలలు సంతోషముగా మరియు ఆరోగ్యకరముగా ఉండాలంటే ప్రీ నాటల్ క్లాస్ లలో చేరాలి.

2. సమతుల్య ఆహారం

2. సమతుల్య ఆహారం

ప్రోటీన్, ఇనుము మరియు కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకోవటం వలన పిండం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీరు కూడా ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా శిశువు యొక్క అభివృద్ధిని మెరుగు చేస్తుంది.

3. ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం

3. ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం

బీన్స్, సిట్రస్ ఆహారాలు మరియు ఆకు పచ్చని కూరల్లో ఫోలిక్ ఆమ్లం సమృద్దిగా ఉంటుంది. అలాగే వైద్యుని సలహా మేరకు ఫోలిక్ యాసిడ్ మాత్రలను వాడటం కూడా ముఖ్యమే. ఫోలిక్ యాసిడ్ పుట్టుక లోపాలను నిరోధించడానికి సహాయపడుతుంది.

4. బరువు చూసుకోవాలి

4. బరువు చూసుకోవాలి

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఒక ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ అవసరం. చాలా సన్నగా ఉంటే అనేక సమస్యలు వస్తాయి. అలాగే ఊబకాయం ఉంటే రక్తపోటు మరియు మధుమేహం వంటి వ్యాధులకు దారి తీస్తుంది. అందువలన కొన్ని కోరికలను నియంత్రణలో ఉంచుకొని సరైన బరువును నిర్వహించాలి.

5. గర్భాదరణ గురించి తెలుసుకోవాలి

5. గర్భాదరణ గురించి తెలుసుకోవాలి

గర్భాదరణ గురించి తెలుసుకోవాలి. ఈ తొమ్మిది నెలలు ఎలా ఉంటుందో అవగాహన కోసం పుస్తకాలను చదవాలి.

6. రెగ్యులర్ చెకప్

6. రెగ్యులర్ చెకప్

గర్భాదరణ మహిళకు రెగ్యులర్ చెకప్ చాలా ముఖ్యం. ఈ చెకప్ శిశువు యొక్క పెరుగుదల మరియు మీ ఆరోగ్యం గురించి తెలుసుకోవటానికి సహాయపడుతుంది. అంతేకాక శిశువులో ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి.

7. వ్యాక్సిన్ వేయించుకోవాలి

7. వ్యాక్సిన్ వేయించుకోవాలి

మీకు, మీ బిడ్డకు హాని కలిగించే కొన్ని అనారోగ్యాలు ఉంటాయి. అందువలన ఇన్ఫ్లుఎంజా ఫ్లూ టీకా ముందు వేయించుకుంటే గర్భధారణ సమయంలో అనిశ్చిత పరిస్థితులను నిరోధించేందుకు సహాయపడుతుంది.

8. జీన్ టెస్ట్ చేయించుకోవాలి

8. జీన్ టెస్ట్ చేయించుకోవాలి

జన్యు స్క్రీనింగ్ ద్వారా కుటుంబ రుగ్మతల అభివృద్ధి శిశువుకు ఏమైనా ఉంటే ముందుగానే తెలుస్తుంది. జన్యువుల ద్వారా వచ్చే సిస్టిక్ ఫైబ్రోసిస్, పెళుసు X సిండ్రోమ్, తయ్ సాచ్స్ వ్యాధి లేదా సికిల్ సెల్ వంటి వ్యాధులను గుర్తించటానికి ఈ పరీక్షను చేస్తారు.

9. కాఫీ మానేయాలి

9. కాఫీ మానేయాలి

కెఫీన్ తీసుకోవడం అనేది బిడ్డకు హానికరం కావచ్చు. కాఫీ త్రాగటం వలన శిశువుకు అనేక రకాల సమస్యలు రావచ్చు. అందువలన సాధ్యం అయ్యినంత వరకు కాఫీ త్రాగటం మానేయాలి.

10. చెడు అలవాట్లు మానేయాలి

10. చెడు అలవాట్లు మానేయాలి

మీరు ఆకస్మికంగా శిశు మరణాలు, అకాల జననాలు, తక్కువ బరువుతో పుట్టటం మరియు గర్భస్రావం నుండి మీ శిశువు రక్షించాలని అనుకుంటే, చెడు అలవాట్లను విడిచిపెట్టాలి.

11. మద్యపానం

11. మద్యపానం

మద్యపానం కారణంగా గర్భస్త పిండంలో పుట్టుక లోపాలు మరియు అభ్యాసన లోపాలు వస్తాయి. కాబట్టి మీ పుట్టబోయే శిశువును రక్షించాలంటే తప్పనిసరిగా మద్యపానం మానేయాలి.

12. ఒత్తిడిని తగ్గించాలి

12. ఒత్తిడిని తగ్గించాలి

ఏది ఏమైనా ఒత్తిడిని దూరంగా ఉంచవలసిన అవసరం ఉంది. ఒత్తిడి అనేది ఒక నిశ్శబ్ద కిల్లర్ వలే గర్భం లో పెరుగుతున్న పిండం మీద ప్రభావాన్ని చూపుతుంది.

English summary

12 Ways To Enjoy 9 Months Of Pregnancy

Pregnancy is the time when a woman experiences a whole lot of changes in her body. She has hormonal fluctuations, which kind of makes her go crazy every now and again.
Desktop Bottom Promotion