For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేసే వాళ్లు పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు..!

By Swathi
|

మీ ఫ్యామిలీని బిగ్ చేయాలనుకుంటున్నారా ? ఇద్దరు పిల్లలతో సందడిగా ఉండే ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారా ? ఇప్పటికే.. ఒక అందమైన బేబీ ఉన్నప్పటికీ.. ఇంకొక బేబీని మీ ఫ్యామిలీలోకి తీసుకురావాలని భావిస్తున్నారా ? ఒక వేళ మీరు సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేస్తుంటే.. దానికంటే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

పొట్టలో ఉన్నది అబ్బాయా ? అమ్మాయా ? తెలుసుకోవడం ఎలా ?

రెండో బిడ్డ కావాలంటే.. ఫస్ట్ బేబీకి కొంత సమయం, కంపెనీ దొరుకుతుంది. అలాగే ఇద్దరు పిల్లలు ఉంటే.. మీ ఫ్యామిలీ చాలా ఫుల్ గా, ఫన్ తో కూడి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలు, పిల్లల సంరక్షణ తీసుకోవడానికి టైంలేనప్పుడు, తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు.. ఇద్దరు పిల్లలు కష్టమని భావిస్తారు.

చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు.. కొత్త బేబీని ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి పర్సనల్ గా చాలా త్యాగాలు చేస్తారు. కాబట్టి మీరు సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేస్తుంటే.. మాత్రం ఇక్కడున్న కొన్ని చిట్కాలను మనసులో పెట్టుకోవడం మంచిది. అవేంటో చూద్దాం..

తల్లి ఆరోగ్యంగా ఉండాలి

తల్లి ఆరోగ్యంగా ఉండాలి

రెండో బిడ్డ కోసం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు తల్లి ఆరోగ్యంగా ఉండాలి. ప్లాన్ కి ముందే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఒకవేళ మీరు హెల్తీగా లేకపోతే.. భవిష్యత్ లో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

35 ఏళ్లు దాటి ఉంటే

35 ఏళ్లు దాటి ఉంటే

చాలా గ్యాప్ తర్వాత సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేస్తుండటం, 35 ఏళ్లు దాటిన తర్వాత సెకండ్ బేబీ కావాలి అనుకుంటూ ఉంటే.. ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. లేట్ ప్రెగ్నన్సీ అంత సురక్షితం కాదు కాబట్టి.. డాక్టర్ ని సలహా తీసుకోవడం చాలా అవసరం.

ఆర్థికంగా

ఆర్థికంగా

ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అన్నది ఒకసారి గుర్తుంచుకోవాలి. ఫ్యామిలీలో మరో వ్యక్తి వస్తున్నారంటే.. ఖచ్చితంగా.. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు ప్రస్తుతమున్న దానికంటే.. రెట్టింపు ఉంటాయని గమనించాలి.

ఏజ్ గ్యాప్

ఏజ్ గ్యాప్

ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత ఏడాదికే.. మరో బేబీ కోసం ప్లాన్ చేసుకోవడం మంచిది కాదు. మొదటి డెలివరీ తర్వాత మీలో చాలా ఎనర్జీ తగ్గిపోయి ఉంటుంది. తల్లికి ఇది హెల్తీ కాదు.. కాబట్టి గ్యాప్ ని పరిగణలోకి తీసుకోండి.

ఏజ్ గ్యాప్ 3 నుంచి 5ఏళ్లు

ఏజ్ గ్యాప్ 3 నుంచి 5ఏళ్లు

ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి మధ్య గ్యాప్.. 3 నుంచి 5 ఏళ్లు కంపల్సరీ ఉండాలని.. సైకాలజిస్ట్ లు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల వాళ్లిద్దరి మధ్య ప్రేమ బావుంటుంది.

ఫస్ట్ బేబీ హెల్తీగా ఉండాలి

ఫస్ట్ బేబీ హెల్తీగా ఉండాలి

ఫస్ట్ పుట్టిన బేబీ చాలా అనారోగ్య సమస్యలతో బాధపడటం, తరచూ సిక్ అవుతూ ఉంటే.. సెకండ్ ప్రెగ్నెన్సీ కి గ్యాప్ తీసుకోవడం మంచిది. లేదంటే.. ఇద్దరినీ మేనేజ్ చేయడం, ఇద్దరి సంరక్షణ తీసుకోవడం కష్టమవుతుంది.

జెండర్ ప్లాన్

జెండర్ ప్లాన్

ఫస్ట్ బేబీ ఆడపిల్ల లేదా మగపిల్లాడు అవడం వల్ల.. సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేయడం మంచిది కాదు. ఫస్ట్ బేబీతో హ్యాపీగా లేమని భావించి అంటే.. బేబీ జెండర్ ని బట్టి హ్యాపీనెస్ ఫీలవడం కరెక్ట్ కాదు. ముందుగా బేబీ ఎవరైనా.. హ్యాపీగా అంగీకరించాలి.

English summary

7 Best Tips For Parents Planning A Second Baby!

7 Best Tips For Parents Planning A Second Baby! Have you and your partner always wished to have a big, happy family complete with 3 kids and 2 dogs?
Story first published:Friday, July 1, 2016, 14:31 [IST]
Desktop Bottom Promotion